Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మెర్సిడేజ్-బెంజ్ ఎప్పుడూ నంబర్ వన్ గా ఉండటానికి కృషి చేస్తూనే ఉంటుంది, అని కొత్త సీఈఓ అంటున్నారు

మెర్సిడెస్ బెంజ్ 2015-2020 కోసం bala subramaniam ద్వారా అక్టోబర్ 19, 2015 10:31 am ప్రచురించబడింది

చెన్నై:

మెర్సిడేజ్-బెంజ్ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేందుకు ప్రయత్నిస్తుంది అని మిస్టర్.రోలాండ్ ఫోల్గర్ గారు అన్నారు. ఈయన మెర్సిడేజ్-బెంజ్ కి కొత్త నియమకం అయిన మ్యానేజింగ్ డైరెక్టర్ సీఈఓ. చెన్నై లో సంభాషణలో భాగంగా, ఈ కంపెనీ ఎప్పుడూ కస్టమర్ల అంచనాలను నాణ్యత తగ్గకుండా చేరుకుంటూ ఉంటుంది అని అన్నారు. గత ఏడాది అమ్మకాల సంఖ్యను ఈ సెప్టెంబరుకే అందుకున్నందున, ఇకపై మిగితా ఏడాది అమ్మకాలతో కంపెనీ రికార్డుసృష్టించనుంది.

కొత్త జీఎల్ఈ (మునుపు ఎం-క్లాస్) గురించి మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా 1.6 మిలియన్ అమ్మకాల పైగా ఈ కారు1997 లో విడుదల అయినప్పటి నుండి అందుకుంది అని అన్నారు. ఎం-క్లాస్ భారతదేశంలో 2009 లో విడుదల అయ్యి ఇక్కడ 6000 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. జీఎల్ఈ కంపెనీ వారి నుండి వచ్చిన 13వ ఉత్పత్తి. ఇది 2015 లో విడుదల అయ్యింది మరియూ ఇంకో రెండు మోడల్స్ ఈ ఏడాది లో విడుదలకు ఉన్నాయి. మరొక 15 ఔట్‌లెట్ లు తెరిచి మొత్తం 39 నగరాలలో విస్థరించిన ఔట్‌లెట్ల సంఖ్యను 80 కి పెంచుతుంది.

కొత్త మెర్సిడేజ్-బెంజ్ జీఎల్ఈ రెండు వేరియంట్స్ గా జీఎల్ఈ 250d మరియూ జీఎల్ఈ 350d లను రూ. 59.95 లక్షలు ఇంకా రూ. 71.14 లక్షల ధరకు అందిస్తున్నారు. జీఎల్ఈ 250d కి 2143 ఇన్-లైన్ సిలిండర్ డీజిల్ ఇంజిను ఉండి అది 204bhp శక్తి ఇంకా 500Nm టార్క్ విడుదల చేస్తుంది. జీఎల్ఈ 350d కి 3.0-లీటర్ 6-సిలిండర్ టర్బో చార్జడ్ డీజిల్ ఇంజిను కలిగి ఉండి ఇది 258bhp శక్తి ఇంకా 620Nm టార్క్ ని ఉత్పత్తి చేయగలదు. వీటి ట్రాన్స్మిషన్ బాద్యతలు 9-స్పీడ్ 9-ట్రానిక్ ట్రాన్స్మిషన్ చూసుకుంటుంది.

ఇతర లక్షణాలు డైనమిక్ సెలెక్టివ్ తో ఐదు డ్రైవింగ్ మోడ్స్, ఎయిర్‌మాటిక్ సస్పెన్షన్, కమాండ్ ఆన్‌లైన్ ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టం మరియూ ఇతర ఆధునిక రక్షణ మరియూ అస్సిటెన్స్ వసతులు అందాయి.

b
ద్వారా ప్రచురించబడినది

bala subramaniam

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మెర్సిడెస్ బెంజ్ 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర