మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ క్యాబ్రియోలెట్: 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షో వద్ద త్వరలో రంగప్రవేశం
మెర్సిడెస్ ఎస్-క్లాస్ 2012-2021 కోసం అభిజీత్ ద్వారా ఆగష్టు 25, 2015 03:04 pm ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: 2015 మెర్సిడెస్ ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షో వద్ద ఆరంగేట్రం చేయవలసిన మెర్సిడిస్ యొక్క ప్రధానమైన ఎస్- క్లాస్ సెడాన్ కాబ్రియోలేట్ వెర్షన్ ను ముందుగానే మనకి కనిపించేలా చేశారు. మార్క్ క్లాసిక్ ఎస్- క్లాస్ క్యాబియోలెట్ పురాతన వెర్షన్ అప్పటి కాలంలో ఒక బెంచ్ మార్క్ వాహనంగా నిలిచింది.
ఈ అన్ని కొత్త కార్లు ఎస్- క్లాస్ కూపే ఆధారంగా తయారయ్యాయి మరియు "ప్రపంచ అత్యంత సౌకర్యవంతమైన కన్వర్టిబుల్" వాహనంగా తయారీదారుడు దీనిని అంచనా వేశాడు . ఇతర మెర్సిడిస్ లలో వలె దీనిలో కూడా లెదర్, వుడ్ మరియు లోపల వైపు నాణ్యమైన మెటల్ అస్సెంట్స్ ను ఉపయోగించి రూపొందించారు. అంతేకాక, హీటెడ్ సీట్లు, "తెలివైన" కళతో కూడిన ఆర్మెస్ట్ లు మరియు వాతావరణ పర్యవేక్షణ వంటి సాధనాలతో అందించబడుతుంది. అధిక కల్లోలభరిత గాలిని అధిగమించేందుకు దీనిలో కన్వర్టిబుల్ టాప్ క్రిందకి జరుగుతుంది. దీనిలో ఎయిర్ క్యాప్ ఆటోమెటిక్ వైండ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ను ఉపయోగిస్తారు.
"కొత్త ఎస్-క్లాస్ కాబ్రియోలెట్ మన ఆర్ద్రత ని మరియు ప్రత్యేక చలనాని మా కస్టమర్ల తో పంచుకోవడాన్ని సూచిస్తుంది," అని డైమ్లెర్ ఏజీ బోర్డ్ మెంబర్ అయిన మిస్టర్.ఓలా కల్లెనియస్ అన్నారు. "44 సంవత్సరాల తరువాత మేము మా కంపెనీ యొక్క స్నేహితులకు ఎస్-క్లాస్ యొక్క ఓపెన్ వేరియంట్ ని అందిస్తాము," అని ఆయన అన్నారు.
ఈ కారులో ఎస్-క్లాస్ కూపేలో ఉన్నట్లుగానే ఒక 4.7-లీటరు వీ8 ఇంజినుతో వస్తుంది అని అనుకుంటున్నారు. ఇది 453 బి హెచ్ పి యొక్క శక్తిని మరియు 700 ఎన్ ఎం యొక్క టార్క్ ని ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగిన ట్విన్ టర్బో తో వస్తోంది.
2015 ఐఏఏ ఫ్రాంక్ఫర్ట్ షో వద్ద దీని ఆవిష్కారం జరిగిన తరువాత, ఇది వివిధ విదేశీ మార్కెట్లలో విడుదల అవుతుంది. భారతదేశం లో ఇది 2016 సంవత్సర ప్రారంభంలో ఇండియన్ ఆటో ఎక్స్పో లో విడుదల కావొచ్చునని భావిస్తున్నారు.