మెర్సిడేజ్-బెంజ్ లగ్జరీ అపార్ట్‌మెంట్లు: కనులవిందు [ లోపల గ్యాలరీ]
అక్టోబర్ 16, 2015 05:06 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: మెర్సిడేజ్-బెంజ్ వారు ఆటో తయారీదారులలో రెసిడెన్షియల్ మార్కెట్ లోకి అడుగు పెట్టిన మొట్టమొదటి వారు. ఫ్రేజర్స్ హాస్పిటల్ గ్రూపు వారితో భాగస్వామ్యంగా ఈ వెంచర్ లోకి అడుగు పెట్టారు. మెర్సిడేజ్ వారు వారి విలాసవంతమైన డిజైన్ లను అపార్ట్‌మెంట్లలోకి కూడా తీసుకు రావాలి అన్న యోచన లో ఉన్నారు. ఈ ప్రాజెక్టు కెంగ్సిన్‌టన్ లండన్ లో చేస్తున్నారు. ఈ ప్రదేశం యూకే లో అత్యంత విలాసవంతమైన చోటు. ఆరు సర్వీసు అపార్ట్‌మెంట్లలో ఒకటి కస్టమర్లు నవంబర్ నుండి పొందగలరు. ఇది "మెర్సిడేజ్-బెంజ్ లివింగ్@ఫ్రేజర్" పేరిట రానుంది. తొమ్మిది అపార్ట్‌మెంట్లతో ఇది సింగపూర్ లో కూడా విస్తరించనున్నారు.
లోపల, ఇంటి ఫర్నీచర్ మరియూ డిజైన్ లలో మెర్సిడేజ్ వారి హస్తం కనపడనుంది. షాండలియర్ కి స్వరోవ్స్కీ క్రిస్టల్స్ మరియూ డైనింగ్ & లివింగ్ కి బర్మెస్టర్ సౌండ్ సిస్టము వంటి లక్షణాలు కలిగి ఉంటాయి. రీడింగ్ లైట్లు మెర్సిడేజ్ కార్ల ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ మాదిరిగా ఉంటాయి. ఎంటర్టెయిన్‌మెంట్ ఉత్పత్తులు కూడా కస్టమర్లు వినియోగించే విధంగా ఉంటుంది. ఇది మెర్సిడేజ్ స్మార్ట్ టీవీ ఆప్ సహాయంతో మీడియా వాల్ పై చేయవచ్చును.
" ఎక్కువ మంది ఎప్పుడూ మారుతూ ఉంటారు. 'హోం అవే ఫ్రం హోం' వంటి వాటి కోసం అన్వేషిస్తూ ఉంటారు. అదే మేము ఇవ్వదలిచాము," అని మెర్సిడేజ్-బెంజ్ బిజినెస్ ఇన్నొవేషన్ డిపార్ట్‌మెంట్ కి అధినేత అయిన విల్ఫ్రెడ్ స్టెఫ్ఫెన్ అన్నారు.