• English
  • Login / Register

మోడల్ ఇయర్ 2016 ఈ-క్లాస్ ని రూ.48.50 లక్షల వద్ద ప్రారంభించిన మెర్సిడీస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్ 2017-2021 కోసం arun ద్వారా జూన్ 25, 2015 12:29 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ముంబాయి: ఈ-క్లాస్, భారతదేశంలోనే అత్యుత్తమంగా అమ్ముడుపోతున్న సెడాన్, మరియు మెర్సిడెస్ బెంజ్ ఇండియా పొర్ట్ఫోలియో లో భారత రోడ్లపై 30,000 యూనిట్లు అత్యధికంగా అమ్ముడైన మోడల్. కొత్త ఈ-క్లాస్ ఇప్పుడు ఆడి ఎ6 మరియు బిఎండబ్ల్యు 5 సీరీస్ ల నుండి అధనపు లక్షణాలను తీసుకొని నూతనంగా రూపొందింది. మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ 'గ్లోబల్ సేల్స్ వార్షికోత్సవం నేడు జరుపుకొని భారత మార్కెట్ కోసం మోడల్ ఇయర్ 2016 ని ఆవిష్కరించింది. 

మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో అయినటువంటి మిస్టర్ ఎబెర్హర్డ్ కెర్న్ తమ మోడల్ ఇయర్ 2016 ఈ-క్లాస్ ని ప్రారంభించిన కారణంగా ఈ విధంగా స్పందించారు. "ఈ-క్లాస్ భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్. ఈ కొత్త మోడల్ 16 ఈ-క్లాస్ ప్రారంభంతో మా సంస్థ అత్యుత్తమ స్థానానికి చేరుకుంటుందని ఆశిస్తున్నాము. అంతేకాకుండా , 16 ఈ-క్లాస్ అమ్మకాలతో, సంస్థ భారత మార్కెట్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంటుందని గట్టి నమ్మకంతో ఉన్నాము. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ సాంకేతికలను ప్రవేశపెట్టడం మరియు క్రమానుగతంగా ఉన్న వాటిని మార్పులు చేయడం వంటివి ప్రేక్షకుల నమ్మకాలని గెలుచుకోడానికి దోహదపడతాయి. ఎల్లప్పుడూ వినియోగదారుల అభిరుచికి తగినట్టుగా అధునాతనమైనవి ఆకర్షణీయమైనవి అందించడం మా ప్రత్యేఖత " అని తెలిపారు.

ఏమిటి కొత్త?

నావిగేషన్ తో కూడిన కొత్తరకం టెలిమాటిక్స్: మోడల్ ఇయర్ 2016 ఈ-క్లాస్ ఇంటర్నెట్ సామర్ధ్యం తో కొత్త ఆడియో 20 టెలిమాటిక్స్ వ్యవస్థ ని, నావిగేషన్ కోసం ప్రీ ఇన్స్టాలేషన్ (జర్మిన్ మ్యాప్ పైలట్), రేడియో, బ్లూటూత్ మరియు సిడి ప్లేయర్ వంటి వాటిని కలిగి ఉంది. ఇది అధిక రిజల్యూషన్ కలర్ మీడియా ప్రదర్శన (20.3 సెంటీ మీటర్స్) ని కూడా కలిగి ఉంది. ఇది 7.068 నగరాల మ్యాప్ లని కలిగి ఉంది. వీటిలో 80 నగరాలు వీధి స్థాయి మరియు రెసిడెన్షియల్ హౌస్ లెవెల్ మ్యాప్ లని కలిగి ఉంది. ఈ 7.068 నగరాల మ్యాప్ లలో మొత్తం 10.63 మిలియన్ పాయింట్ ఆఫ్ ఇంట్రస్ట్ ని చూపిస్తుంది. 3డి టెరియన్-, బిల్డింగ్- మరియు ల్యాండ్ మార్క్ వీక్షణ, ఫోటో-రియలిస్టిక్ జంక్షన్ వీక్షణ మరియు లేన్ అసిస్ట్ మొదలైనవి అందిస్తుంది. 

రివర్స్ కెమెరా: కొత్త మోడల్ ఇయర్ 2016 ఈ-క్లాస్ రివర్స్ కెమెరా తో అందుబాటులో ఉంది. దీనివలన రివర్స్ పార్కింగ్ సులభం అవుతుంది. ఈ మోడల్ మూడు వేరియంట్లని కలిగి ఉంది. ఈ 200, 48.50 లక్షల ధరకి, ఈ 250 సిడి ఐ 50.70 లక్షల ధరకి, ఏ 350 సిడి ఐ 59.90 లక్షల ధరకి ఢిల్లీ ఎక్స్-షోరూమ్ వద్ద అందుబాటులో ఉన్నాయి. 

was this article helpful ?

Write your Comment on Mercedes-Benz బెంజ్ 2017-2021

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience