ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సేల్స్ లో హిస్టారిక్ గ్రోత్ రిజిస్టర్ చేసుకున్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా

జూలై 03, 2015 03:43 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: మెర్సిడెస్ బెంజ్ దాని ఉత్తమ  రెండవ త్రైమాసిక  మరియు అర్ధ సంవత్సర అమ్మకాలను నమోదు చేశారు. ఈ జర్మన్ బ్రాండ్  వరుసగా దాని మూడవ సంవత్సరంలో లగ్జరీ కార్ల విభాగంలో ,  వేగంగా  వృద్ధిని నమోదు చేసింది. మెర్సిడెస్  జనవరి-జూన్ 2015  కాలంలో  నమ్మ సఖ్యం కాని విధంగా 41% వృద్ధిని  పెంపొందించుకుంది. అనగా ఈ వ్యవధిలో 6659 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్-జూన్ 2014 కాల వ్యవధిలో  2163 యూనిట్ల కార్లు మాత్రమే విక్రయించారు, అనగా ఇప్పటి అమ్మకాలతో పోలిస్తే  43% వృద్ధి పెరిగింది. అదనంగా 3093 యూనిట్లు ఈ సంవత్సరం  విక్రయించారు అన్నమాట, ఇది చెప్పుకోదగ్గ గొప్ప విషయంగా మనం భావించవచ్చు.

ప్రధాన అమ్మకాలు  సి-క్లాస్, ఈ-క్లాస్ లో జరిగాయి. కాగా, ఎం క్లాస్ మరియు జిఎల్-క్లాస్ వంటి ఎస్యూవి లకు  మాత్రం గణనీయమైన పెరుగుదల ఉంది. మరోవైపు, సిఎల్ ఎ మరియు జిఎల్ ఎ క్లాస్  వాహానాలు క్రమంగా ప్రజాదరణను పొందుతున్నాయి మరియు ఒక బలమైన కస్టమర్ బేస్ మేకింగ్ లో బ్రాండ్ సహాయం చేస్తోంది. అయితే, పనితీరు విభాగంలో  మాత్రం ఏఎంజి కార్లకు వారికి కావలసిన న్యాయమైన వాటాను పొందుతున్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఇండియా  మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో ఎబెర్హర్డ్ కెర్న్ మాట్లాడుతూ "2012 యొక్క మొత్తం సంవత్సరంలో ఎన్ని కార్లు విక్రయించామో, 2015  మొదటి ఆరు నెలల్లో దాదాపుగా అన్ని కార్లు విక్రయించాము. ఈ సంవత్సర మొదటి  త్రైమాసికంలో మేము స్పష్టమైన అమ్మకాలను కొనసాగించి ఒక బలమైన వృద్ధి వేగాన్ని పెంపొందించుకున్నాము మరియు అలాగే  రెండవ త్రైమాసికంలో కూడా  ఈ వృద్ధిని కొనసాగించినందుకు ఆనందంగా ఉంది అన్నారు. మేము భారతదేశం లో మా వ్యాపార కోసం  ఒక నిరంతర ప్రాఫిటబుల్ గ్రోత్ ను పెంపొందించే దీర్ఘకాల  లక్ష్యంతో ఒక ట్రాక్ వైపు వెళుతున్నాము. ఈ పనితీరు దృఢంగా కస్టమర్  కేంద్రీకృత విధానాన్ని మరియు పునరుద్ఘాటిని తెలుపుతున్నట్లు వారు అంగీకరించారు. లగ్జరీ కార్ల పరిశ్రమలో మెర్సిడెస్ బెంజ్  ఇండియా యొక్క బ్రాండ్, ప్రీమియం మరియు పోటీ పడగల సామర్థ్యం కలిగి ఉందని మరోసారి రుజువైంది. నిరంతర ఉత్పత్తి ఆవిష్కరణలే వారి ధ్యేయంగా , అతిపెద్ద లగ్జరీ కారు ఉత్పత్తి సౌకర్యం కలిగి, సంపన్నమైన సేవలు అందించడమే వారి లక్ష్యంగా మరియు మా విస్తృతమైన నెట్ వర్క్ తో ప్రపంచమంతా మా బ్రాండ్ పాదముద్రలను బలపరిచింది అన్నారు. మిగతా అర్ధ సంవత్సరంలో రానున్న అత్యంత ఆశగా ఎదురు చూస్తున్న ఉత్పత్తులు,  ఎ ఎం జి జిటి తో సహా  మెర్సిడెస్ బెంజ్ అన్ని ఉత్పత్తులతో సిద్ధంగా ఉంది,  ఇంకో  సంవత్సరంలో కావలసిన ఉత్పత్తులను ముందుగానే సమకూర్చుకుని , ఇది ఆ సంవత్సరంలో కూడా బలమైన వృద్ధిని పొందుతుందని ఆశిస్తున్నాము" అని ఆయన ప్రసంగించారు. 

ముందుకు వెళ్లి చూసినట్లయితే, ఎ ఎం జి జిటి తో సహా మిగతా అర్ధ సంవత్సరంలో మెర్సిడెస్ నుండి చాలా ఉత్పత్తులు రాబోతున్నాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience