మెర్సిడేజ్-బెంజ్ రాయ్పూర్ లో ఒక కొత్త ఆటో హంగర్ ని ఆవిష్కరించారు
ఆగష్టు 21, 2015 12:04 pm nabeel ద్వారా సవరించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మెర్సిడేజ్ బెంజ్ ఇండియా యొక్క సేల్స్ మరియూ నెట్వర్క్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ అయిన బోరిస్ ఫిట్జ్ గారు ఛత్తిస్గర్ లోని రాయ్పూర్, టతిబధ్ లోని ఎనెచ్6 దగ్గర కొత్త మెర్సిడెజ్ బెంజ్ డీలర్షిప్ ని ఆవిష్కరించారు. ఆటో హంగర్ రాయ్పూర్ డీలర్షిప్ యొక్క డీలర్షిప్ ని 8 కోట్ల రూపాయలతో దాదాపుగా 17,707 చదరపు అడుగుల విస్తీర్ణం లో నిర్మించబడింది. ఆటో హంగర్ రాయ్పూర్ ని మ్యానేజింగ్ డైరెక్టర్ అయిన మోహన్ మరివాలా గారు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అన్ని కారు పరికరాలు కలిగిన మెర్సిడేజ్ కేఫ్ కూడా ఉంది. దీనితో పాటుగా ఈ డీలర్షిప్ దగ్గర 7 కార్లు ఒకేసారి ఉంచే స్థలం ఉంది పైగా ట్రైన్ అయిన స్టాఫ్ ఉన్నారు. దీనితో పాటుగా దేశం లో ఉన్న మొత్తం మెర్సిడెజ్ బెంజ్ డీలర్షిప్ల సంఖ్య 74.
ఈ సందర్భంగా, మిస్టర్ ఫిట్జ్ ఏమన్నారంటే," రాయ్పూర్ లోని లగ్జరీ కారు మార్కెట్ పెరుగుతోంది మరియూ ఇందుకు గాను మేము ఆటో హంగర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో కలసి మా కస్టమర్లకు మరింత సేవ చేయదలచాము. ఈ డీలర్షిప్ వల్ల కేంద్ర భారతదేశం లో మా ఉనికి మరింతగా పెరుగుతుంది అని మా నమ్మకం. మా విస్థరణ పథకం మా ఎదుగుదలకు దోహదం చేస్తుంది మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మా కస్టమర్లకి లగ్జరీ కార్ల అనుభవాన్ని మెరుగు పరిచే ప్రయత్నం చేస్తాము.
మెర్సిడెజ్-బెంజ్ వారు వారి ఎస్63 ఏఎంజీ సెడాన్ ని ఆగస్ట్ 11 న భారతదేశం లో వారి మునుపటి 15 మోడల్స్ కి జత కలుపుతూ విడుదల చేసారు. ఈ కారులో ఎస్ 63 కూపే కి ఉన్నట్టుగానే 5.5-లీటరు వీ8 బై-టర్బో ఏఎంజీ ఇంజిను ఉంది. ఇది 585బీహెచ్పీ శక్తి ని మరియూ 900ఎనెం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. తరువాత వరుస లో ఉన్నది సీ 63 ఎస్ ఏఎంజీ. ఇది బహుశా 2015 సెప్టెంబర్ 3 న విడుదల కావొచ్చు.