Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మెర్సిడేజ్-బెంజ్ జీఎల్ఈ ఈరోజు విడుదల కానుంది

మెర్సిడెస్ బెంజ్ 2015-2020 కోసం manish ద్వారా అక్టోబర్ 14, 2015 10:16 am ప్రచురించబడింది

జైపూర్:

మెర్సిడేజ్ వారు వారి జీఎల్ఈ ఎస్‌యూవీ ని ఈరోజు విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఎం-క్లాస్ కి ఇది పునరుద్దరణ అయినా కానీ ఈ జీఎల్ఈ-క్లాస్ ఎం-క్లాస్ ని భర్తీ చేయనుంది. ఈ అడుగు అన్ని మెర్సిడేజ్ వాహనాల పేర్లను 'జీ' తో మొదలవ్వాలి అనే ఉద్దేశం తో అయ్యి ఉండవచ్చు. ఈ కొత్త జీఎల్ఈ బీఎండబ్ల్యూ ఎక్స్3, ఆడీ క్యూ5 మరియూ కొత్తగా విడుదల అయిన ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ కి పోటీగా నిలువనుంది.

ఇంజిను విషయానికి వస్తే, కారుకి రెండు డీజిల్ ఆప్షన్లు వస్తాయి. ఇందులో 2.2-లీటర్ ఇన్-లైన్ 4 సిలిండర్ మరియూ 3.0-లీటర్ V6 మోటర్లు ఉంటాయి. ఈ ఇంజిన్లు మునుపటివే అయినా ఇంకాస్థ సమర్ధంగా తయారు అయ్యాయి. ఇది టర్బో చార్జర్ కి కొన్ని మార్పులు, కొత్త ECU ఇంకా ఆటోమాటిక్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్ల వలన సాధ్యం అయ్యింది. ఈ ఇంజిన్లు కి 9-స్పీడ్ ఆటోమాటిక్ ని జత చేయడం అయ్యింది. ఇది ప్రస్తుతం ఉన్న 7-స్పీడ్ యూనిట్ కంటే మెరుగైనది.

పొడుచుకొచ్చినటువంటి ముక్కు పక్కన హెడ్‌ల్యాంప్స్ కి కనుబొమ్మల వంటి డే లైట్ రన్నింగ్ ల్యాంప్స్ ఉంటాయి. పక్కలు మరియూ వెనుక భాగం మునుపటి లాగానే ఉన్నాయి. లోపల, కొత్త ఇంఫొటెయిన్‌మెంట్ స్క్రీన్ ఇంకా గుండ్రటి ఏసీ వెంట్లు మరియూ డ్యాష్ బోర్డు సెటప్ ఉంటాయి. కొత్త స్టీరింగ్ వీల్ కూడా ఉంటుంది.

m
ద్వారా ప్రచురించబడినది

manish

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మెర్సిడెస్ బెంజ్ 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర