మెర్సిడెస్ 'లైనప్ 2016 ఆటో ఎక్స్పో వద్ద రాబోతుంది.
జనవరి 25, 2016 01:36 pm konark ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మెర్సిడెస్ బెంజ్ భారత దేశం యొక్క రాబోయే ఆటోఎక్స్పోలో Glc SUV, మెర్సిడెస్ మేబ్యాక్ S 600 గార్డ్ మరియు S-కాబ్రియోలేట్ అనే మూడు కొత్త ఉత్పత్తులు ప్రారంభించబోతోంది. ఆటో ఎక్స్పో లైనప్ ప్రకటించిన మాదిరిగా భారతదేశ మెర్సిడెస్ బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్, రోలాండ్ ఫోల్గేర్స్,ఈ విధంగా చెప్పారు. "ఆటో ఎక్స్పో తయారీదారులు, ఆటోమోటివ్ ఔత్సాహికులు మరియు వినియోగదారులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఆటోఎక్స్పో వేదిక యొక్క ప్రతి సంచిక ప్రాముక్యత కూడా పెరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం మెర్సిడెస్ బెంజ్ దాని 'విన్నింగ్' ఉత్పత్తులని ప్రదర్శించబోతోంది. మరియు అందరూ ఎదురు చూస్తున్నటువంటి Glc మరియు S-క్లాస్ కాబ్రియోలేట్ లను ప్రారంభించటం ఎంతో సంతోషమయిన విషయం. మెర్సిడెస్ బెంజ్ పెవిలియన్ డిజైన్,మంచి సృజనాత్మకత తో ఆధునిక సమ్మేళనంగా ఉంటుంది. మరియు మూడు కోణాల నక్షత్రంపై బ్రాండ్ సంస్కృతి యొక్క కోర్ ఉండటం ఈ వాహనం యొక్క ఆధునిక విలాసవంతమైన సౌకర్యాన్ని ప్రతిబింబిస్తుంది. వినియోగదారులు మరియు ఔత్సాహికులు మెర్సిడెస్ బెంజ్ పెవిలియన్లో కొన్ని నిజమైన మరియు ఉత్సాహవంతమయిన నమూనాలని ఆశించవచ్చు".
భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత తిరిగి దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్లో 2015 లో 13.502 యూనిట్లు విక్రయించి no.1 స్పాట్ ని సాధించింది.
GLC SUV;
మెర్సిడెస్ గత సంవత్సరం Glc ని అంతర్జాతీయంగా ఆవిష్కరించారు. ఈ SUV యొక్క ఒక సి-క్లాస్ ఎస్క్ హెడ్ల్యాంప్స్, ముందు ఒక భారీ ట్విన్- స్లాట్టేడ్ గ్రిల్ మరియు క్రోమ్ యొక్క లోడ్లు కలిగిన ముందు భాగాన్ని కలిగి ఉంటుంది. ప్రక్క భాగం చుట్టూ గమనిస్తే Glc ఒక వీల్ బేస్ అవుట్గోయింగ్ మోడల్ కంటే 118mm పొడవుగా ఉంటుంది. ఈ Glc యొక్కSUV వీల్ ఆర్చేస్, మరియు సబ్టిల్ టచెస్ మరియు సిల్వర్ రోఫ్ రేయిల్స్ ని కలిగి ఉంటుంది. వెనుక పెద్ద సాధారణ చుట్టూ ఉన్నటువంటి టెయిల్ ల్యాంప్స్ ని కలిగి ఉంటుంది. మెర్సిడెస్ బాహ్య అద్దాలు మరియు స్పాయిలర్ లకి ఆన్టేన్న అనుసంధానించబడి ఉంటుంది. భారత స్పెక్ 2.1-లీటర్ నాలుగు సిలిండర్ల ఇంజన్ నుండి రెండు డీజిల్ ఎంపికలు అనగా 250d 201bhp తో మరియు 220d,168bhp తో రాబోతుంది అని అంచనా వేస్తున్నారు. దీని ధర 50 లక్షల కన్నా తక్కువ ఉంటుందని ఆశిస్తున్నారు.
S-క్లాసు కాబ్రియోలేట్;
1971 లో వచ్చినటువంటి ఎస్- క్లాస్ మళ్ళీ గౌరవప్రదమయిన పునరుద్దరనగా అనగా ఎస్- క్లాస్ కాబ్రియోలేట్ గా రాబోతుంది. S- క్లాస్ కూపే,లో అందించినటువంటి ఒక 4.7-లీటరు V8 మోటార్ ఇంజిన్ ద్వారా 453 bhp శక్తిని మరియు 700 Nm,టార్క్ ని ఉత్పత్తి చేసే అదే ఇంజిన్ ని అందించవచ్చును.
మెర్సిడెస్ మేబ్యాక్ S 600 గార్డ్;
S600 గార్డ్ ని ప్రస్తుతం అందుబాటులో అత్యంత విలాసవంతమైన సాయుధ వాహనం అని పేర్కొంటారు. రెయిన్ ఫోర్సుడ్ బాడీ షెల్ల్స్, డబుల్ -ప్లటేడ్ వేల్డ్స్, కటినమయిన మరియు మందమయిన గ్లాస్ బులెట్లు తో పాటు ఇంకా అదనపు ఫీచర్లని కలిగి ఉంటుంది.
మెర్సిడెస్ బెంజ్ దాని పెవిలియన్ లో ప్రత్యేక మెర్సిడెస్ AMG పెట్రోనాస్, F1 జట్టు యొక్క FIA ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ ని గెలుచుకున్న కారుని ప్రదర్శించబోతుంది.
ఇది కూడా చదవండి; జిఎల్ ఈ 450 ఏఎంజి కూపే ను ప్రారంభించడానికి సిద్దపడుతున్న మెర్సిడెస్ బెంజ్
0 out of 0 found this helpful