సి 63 ఎస్ ఎఎంజి ని సెప్టెంబర్ 03, 2015న ప్రారంభించనున్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా (వీడియో)
మెర్సిడెస్ కొత్త సి-క్లాస్ 1997-2022 కోసం raunak ద్వారా ఆగష్టు 18, 2015 10:28 am ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
4.0 లీటర్ బై టర్బో పెట్రోల్ ఇంజిన్ 510పిఎస్ శక్తిని మరియు 700ఎన్ ఎం టార్క్ ని అందిస్తుంది !
జైపూర్: మెర్సిడెస్ బెంజ్ ఇండియా నిరంతరమైన ఆవిష్కరణలతో ఏఎంజి వెర్షన్ యొక్క కొత్త సి క్లాస్ సి 63 ఎస్ ఏఎంజి ని త్వరలోనే పరిచయం చేయనుంది. ఈ వాహనం వచ్చే నెల 2న రానున్నది. ఎ ఎంజి 2015 లో విడుదల కాబోయే మెర్సిడీస్ యొక్క భవిష్యత్తు 15 కార్లలో ఒకటి. మెర్సిడీస్ ఇటీవల ఎస్63 ఎ ఎంజి కూప్, ఎస్500కూప్ మరియు జి63 ఎ ఎంజి క్రేజీ కలర్ తో పాటూ ఎస్63 ఎ ఎంజి సెడాన్ ను విడుదల చేసింది. అంతేకాక, ఈ వాహనం ఎఎంజి ఎస్ వలే మరియు బిఎండబ్లు ఎం3 కి వ్యతిరేకంగా సిబియు మార్గం ద్వారా రాబోతున్నది.
మునుపటి సి63వలే కాకుండా 2015 మెర్సిడీస్ ఎ ఎంజి సి63 ఎస్ 4.0లీటర్ వి8 చే శక్తి ని ఇవ్వబడుతున్నది. ఎఎంజి జిటి కూడా ఇదే విధమైన శక్తి తో అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ ఎ ఎంజి స్పీడ్ షిఫ్ట్ ఎంసిటి 7-స్పీడ్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ తో జత చేయబడి 5500-6250rpm వద్ద 510hp శక్తిని మరియు 1750-4500rpm వద్ద 700Nm టార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది. ఈ హ్యాండ్ బిల్ట్ ఎ ఎంజి ఇంజిన్ ఎస్63ఎస్ చే 4 సెకెన్లలో 100కిలోమీటర్లు మరియు గరిష్టంగా 250kmph చేరుకొనేలా చేస్తుంది. అంతేకాకుండా సాధారణ సి క్లాస్ బాడీ పక్కన పెడితే ఈ ఎ ఎంజి వెర్షన్ స్పోర్టియర్ బంపర్స్, అల్లాయ్స్ మరియు కిట్లు పొంది ఉంటుంది. దీనిలో అంతర్భాగాలన్నీ నలుపుగా మరియు ఎ ఎంజి ట్రీట్మెంట్ లక్షణాన్ని కలిగి ఉంటుంది.
0 out of 0 found this helpful