• English
  • Login / Register

మెర్సిడెజ్ బెంజ్ భారతదేశం వారు కాలికట్ లో ఒక కొత్త డీలర్షిప్ ని ప్రారంభించారు

ఆగష్టు 28, 2015 10:40 am konark ద్వారా సవరించబడింది

  • 19 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ముంబై: కేరళ లోని కాలికట్ లో మెర్సిడెజ్ బెంజ్ వారు ఒక కొత్త డీలర్షిప్ ని ప్రారంభించారు. సేల్స్ మరియూ నెట్వర్క్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ అయిన బోరిస్ ఫిట్జ్, మ్యానేజింగ్ డైరెక్టర్ మరియూ సీఈఓ అయిన ఎబర్హార్డ్ కర్న్ మరియూ మెర్సిడెజ్ బెంజ్ కి మ్యానేజింగ్ డైరెక్టర్ అయిన అబుల్ వాహబ్ మొదలగు వారు అందరు ఈ ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు.

అక్కడ ఉన్న అతిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ," మేము కాలికట్ వాసులైన మా కస్టమర్లకు ఈ సౌకర్యాలను అందించగలుగుతున్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నాము. ఇందు వలన ఉత్తర కేరళ లోని మా ఉనికి మరింత బలపడుతుంది అని ఆశిస్తున్నాము. మా ఈ షోరూం మరియూ సర్వీసు సెంటర్ ద్వారా మేము మా కస్టమర్లకు నేరుగా మా సేవలను మరియూ ఉన్నతమైన అంతర్జాతీయ ఉపకరణాలను అందించగలము. కాలికట్ యొక్క ఈ విలాసవంతమైన ఎనారై కస్టమర్ బేస్ ఈ ప్రాంతం లో డిమాండ్ ని పెంచడానికి అస్త్రంగా ఉపయోగపడింది," అని మెర్సిడేజ్ బెంజ్ భారతదేశానికి ఎసీయో మరియూ మ్యానేజింగ్ డైరెక్టర్ అయిన ఎబర్హార్డ్ కర్న్ అన్నారు.

కాలికట్ లో ఉండే చాలా మంది ఎనారై లు విదేశాలలో లగ్జరీ వాహనాలను ఉపయోగించి వచ్చి ఇప్పుడు ఇక్కడ కూడా మెర్సిడెజ్-బెంజ్ కార్లు వాడాలని అనుకుంటారు. దాదాపుగా 28,000 పైగా చదరపు అడుగుల విస్తీర్ణం లో ఈ బ్రిడ్జ్వే మోటర్స్ ఉంది. అంకితంగా పనిచేసే ఒక టీం సమయానికి ఎల్లవేళలా కస్టమర్ల సేవ కై అందుబాటులో ఉంటారు. ధనవంతులైన కస్టమర్ బేస్ వలన దాదాపుగా ఆరంభానికి ముందే 30 కార్ల కోసమై బుకింగ్స్ ఇప్పట్టికే నమోదు అయ్యాయి. ఇది ఈ 2015 సంవత్సరం లోని మెర్సిడేజ్-బెంజ్ వారి 11వ డీలర్షిప్. ఇది '15 లో 15' యొక్క నినాదం మీద వెళుతున్న ఒక కార్యక్రక్రమం. అయితే ఇంకో 4 డీలర్షిప్ లు ఆరంభం అవ్వవచ్చును. దేశం లోని అన్ని లగ్జరీ కార్ల కంపెనీల్లోకీ మెర్సిడెజ్-బెంజ్ వారికి అత్యధికంగా 39 నగరాలలో 78 అవుట్లెట్లు ఉన్నాయి.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience