ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్క రించబడిన ఏ-క్లాస్ ఫేస్లిఫ్ట్
మెర్సిడెస్ ఏ జిఎల్ఈ కోసం arun ద్వారా జూన్ 29, 2015 02:01 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ముంబై: ఏ-క్లాస్ అనేది సంస్థ యొక్క అత్యుత్తమమైన కారు. ఇది ఈ సంస్థ కి ఒక మైలురాయి వంటిది. ఒక కొత్త ఏ220డి 4మేటిక్ మరియు ఏ45 ఎ ఎంజి అనే మోడళ్ళు ఏ-క్లాస్ లో చేరబోతున్నాయి.
2012 సంవత్సరం కాంపాక్ట్ క్లాస్ నమూనాలో మార్పుని తెచ్చిన సంవత్సరం. కొత్త ఏ-క్లాస్ ముందు సిరీస్ కంటే అద్భుతమైనదిగా ఉంది. కాంపాక్ట్ క్లాస్ లో ఈ మోడల్ చాలా అత్యుత్తమమైనది అనేకమంది మెర్సిడీస్ బెంజ్ అభిమానుల మనసు దోచుకుంటుంది. ఈ మోడల్ ఫేస్లిఫ్ట్ ద్వారా మేము అనేకమంది కారు అభిమానులకి చేరువ అవ్వగలం అనే గట్టి నమ్మకంతో ఉన్నామని మెర్సిడెస్ బెంజ్ కార్స్ మార్కెటింగ్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్ డైమ్లెర్ ఏజీ బోర్డు సభ్యుడు అయినటువంటి "ఓల కల్లేనియస్" అన్నారు.
కాంపాక్ట్ హాచ్ బాహ్య భాగాలలో చిన్న చిన్న మార్పులు చేయబడింది. ఈ మార్పులు చూడగానే ఒక్క చూపులోనే కంటికి స్పష్టంగా కనిపిస్తాయి. దీని బంపర్లు 2011 లో ప్రదర్శించిన ఏ-క్లాస్ బంపర్ల శైలిలో ఉంటాయి. మెర్సిడెస్ బెంజ్ ఆప్షనల్ గా ఎల్ఇడి హెడ్ల్యాంప్స్ మరియు పునఃరూపకల్పన చేయబడిన టైల్ ల్యాంప్స్ ని అందిస్తుంది. దీనిలో వెనుక బంపర్లు ఎగ్జాస్ట్ గొట్టాలు తో అమర్చబడి వస్తున్నాయి.
దీనిలో అంతర్భాగాలు దీని అవుట్గోయింగ్ వెర్షన్ లానే దాదాపు ఒకేలా ఉంటాయి. చిన్న తేడా ఏమిటంటే, దీనిలో నవీకరించబడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్,గాల్వనైజ్డ్ స్విచ్లు మరియు సమాచార వ్యవస్థ కోసం కొత్త (8 అంగుళాల) స్క్రీన్ ఉంటుంది. సమాచార వ్యవస్థ విషయానికి వస్తే, కొత్త తరం ఏ-క్లాస్ స్మార్ట్ఫోన్ తో అనుసంధానం చేయబడిన మెర్సిడెస్ బెంజ్ యొక్క మొదటి మోడల్. 2016 ప్రారంభం నుండి సమాచార వ్యవస్థ ఆపిల్ కార్ప్లే మరియు మిర్రర్ లింక్ లో అందుబాటులోనికి రాబోతుంది.
ఏ-క్లాస్ లో అందుబాటులో ఉన్న ఎంపికలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
Variant | Power | Torque |
Diesel | ||
A180d | 109hp@4000rpm | 260nm@1750-2500rpm |
A200d | 136hp@3200-4000rpm | 300nm@1400-3000nm |
A220d | 177hp@3600-3800rpm | 350nm@1400-3400nm |
Petrol | ||
A180 | 122hp@5000rpm | 200nm@1250-4000rpm |
A200 | 156hp@5000rpm | 250nm@1250-4000rpm |
A250 AMG | 218hp@5500rpm | 350nm@1200-4000rpm |
A45 AMG | 381hp@6000rpm | 475nm@2250-5000rpm |
ప్రస్తుతం, పెట్రోల్ లో ఏ200డి మరియు ఏ180 ఈ రెండు మాత్రమే భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. ఇది రానున్న రోజుల్లో ఏ220డి, ఏ250 ని వీటితో పాటుగా ఏ45 ఏఎంజి ని భారత మార్కెట్ లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
మోటార్ స్పోర్ట్ ఎడిషన్:
ఒక ప్రత్యేక "మోటార్ స్పోర్ట్స్ ఎడిషన్" ఎ- క్లాస్ (ఎ220డి యొక్క పైన) లో అందుబాటులో ఉంది. ఇది మెర్సిడెస్ ఫార్ములా 1 అభిమానులకు నమ్మదగిన విధంగా ఉంది. మెర్సిడెస్ ఎ ఎం జి పెట్రోనాస్ ఎఫ్ 1 టీం నుండి తీసుకున్న నేపథ్య భావన మీద ఇది రూపొందించబడింది. మోటార్ స్పోర్ట్స్ ఎడిషన్ రెండు బంపర్స్ మీద గ్రీన్ చేరికలు, ఎ ఎం జి వీల్ యొక్క రింలు మరియు స్పాయిలర్ అంచుల మీద గ్రీన్ అసెంట్స్ పూత ఉంటుంది. ఇలాంటి గ్రీన్ అసెంట్స్ కారు లోపలి భాగాలలో మరియు సీట్లకు ఎఫ్1 టీం కలర్స్ తో కుట్టబడి ఉండడం మనం గమనించవచ్చు.
ఎ45 4మాటిక్
మెర్సిడెస్ యొక్క ఎ ఎంజి అవతార్ చాలా వేగంగా వచ్చింది! ఇది 4.2 సెకన్లలో ఒక 0-100 మార్క్ వరకు చేరుకోగలుగుతుంది. అవుట్ గోయింగ్ వెర్షన్ తో పోలిస్తే పూర్తిస్థాయిలో 0.4 సెకన్లు వేగంగా వెళ్లగలుగుతుంది. ఈ సవరించిన గేర్ నిష్పత్తులు అన్ని ఏరోడైనమిక్ ఫైన్-ట్యూనింగ్ మరియు కొత్త డైనమిక్ సెలెక్ట్ మోడ్ ల డ్రైవింగ్ లతో కలిసి ఉన్నాయి. దీని డ్రైవింగ్ మోడ్ లు "కంఫర్ట్", "స్పోర్ట్", "స్పోర్ట్ +", మరియు "ఇండివిజువల్ " వంటివి ప్రామాణికంగా మెర్సిడెస్ ఎఎంజి జిటి మరియు సి63 ఎఎంజి మోడల్స్ లలో అందించబడుతున్నాయి. ఎఎంజి డైనమిక్ ప్లస్ ప్యాకేజీ ఒక యాంత్రిక ఫ్రంట్ ఆక్సిల్ లాకింగ్ డిఫరెన్షియల్ ను కలిగి ఉంది మరియు ఎ ఎం జి రైడ్ కంట్రోల్ స్పోర్ట్ సస్పెన్షన్ మరియు ఫిఫ్త్ డ్రైవింగ్ మోడ్ "రేస్" లను కూడా కలిగి ఉంది.
మెర్సిడెస్ఎ ఎం జి జి ఎం బి హెచ్ యొక్క చైర్మన్, టోబియాస్ మోర్స్, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కాంపాక్ట్ స్పోర్ట్స్ కారు గురించి మాట్లాడుతూ, " మేము సాధించిన దానితో మేము విశ్రాంతి తీసుకోలేదు, ఎప్పుడూ నిరంతరం మరింతగా మా ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాము. ఎ 45 ఇప్పటికీ చాలా అభివృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉంది మేము దానిని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాము. మా బ్రాండ్ మాకు ఆ హక్కులను కల్పించింది" అని ఆయన వాఖ్యానించారు.
అయితే, ఈ కొత్త తరం ఎ-క్లాస్ కారు అంతర్జాతీయ మార్కెట్లలో జూలై, 2015 నుండి ఆర్డర్ అందుబాటులో ఉంటుంది. భారత షోరూమ్ లలో దీని యొక్క ఫేస్లిఫ్ట్ వర్షన్ ను అందజేయవలసిన అవసరం ఉంది. చకన్ వద్ద కొత్తగా అసెంబ్లీ లైన్ కంపెనీ ధరలు తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మెర్సిడెస్ ప్రస్తుతం అసెంబ్లీ లైన్ వద్ద జి ఎల్ ఎ క్రాస్ఓవర్ ఉత్పత్తి తయారీలో ఉంది.