రేపే, భారతదేశంలో తన కార్యకలా పాలను తిరిగి ప్రారంభించబోతున్న మసెరటి
జూలై 14, 2015 03:26 pm akshit ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఢిల్లీ: దిగుమతులలో ష్రేయన్స్ గ్రూప్ వారితో గతంలో అంతగా విజయం సాధించలేకపోయిన ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ అయిన మసెరటి, అధికారికంగా రేపు భారత మార్కెట్ లో తిరిగి నమోదు చేసుకోబోతుంది.
ప్రస్తుతం కంపెనీ యొక్క మొత్తం పోర్ట్ఫోలియో లో ఉన్న అన్ని వాహనాలను భారదేశంలో రేపే ప్రవేశపెట్టబోతుంది. అవి వరుసగా, గిబ్లీ, క్వాట్రోపోర్టే, గ్రాన్ టురిస్మో, గ్రాన్ కాబ్రియో. ఈ వాహనాలన్నింటినీ భారతదేశంలో కి సిబియు విధానం ద్వారా తీసుకురాబోతున్నారు.
మసెరటి, వారి వార్షిక అమ్మకాలలో భారీస్కోరును సాధించింది. అంటే సగం కంటే ఎక్కువ వాటాను గత సంవత్సరం 23,500 గిబ్లీస్ వాహనాలను విక్రయించింది. అంతర్జాతీయంగా, ఈ మోడల్ 3.0 లీటర్ వి6 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ లతో అందుబాటులో ఉంది. ఇది, కార్ల చరిత్రలోనే మొదటి డీజిల్ తో నడిచే కారు గా ఉంది.
బ్రాండ్ యొక్క మరొక లగ్జరీ ఫ్లాగ్ షిప్ అయిన సెలూన్ అయిన క్వట్ట్రోపోర్టే, గత ఏడాది 9,700 యూనిట్ల వాహనాలను విక్రయించి జాబితాలో రెండవదిగా నిలుచింది. ఈ క్వట్ట్రోపోర్టే, 3.0 లీటర్ వి6 మరియు 3.8 పెట్రోల్ ఇంజన్ లతో పాటు 3.0 లీటర్ వి6 డీజిల్ ఇంజన్ లతో అందుబాటులో ఉంది. గ్రాన్ టురిస్మో మరియు గ్రాన్ కాబ్రియో విషయానికి వస్తే, ఈ మోడల్స్ 4.2 లీటర్ లేదా 4.7 లీటర్ వి8 పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది.
మొదటి డీలర్షిప్ ముంబై లో తరువాత ఇతర మెట్రో నగరాల్లో వస్తుందని భావిస్తున్నారు. ప్రసిద్ధ ఆటోమోటివ్ గ్రూప్ అయిన గెలాక్సీ, పునః ప్రవేశం వారి మొదటి భాగస్వామి కావచ్చు.
రేపే దీని గురించి పత్రికా సమావేశం వద్ద మాట్లాడతారు. కనుక తదుపరి నవీకరణల గురించి కార్దేకొ ను వీక్షిస్తూనే ఉండండి.