• English
  • Login / Register

మాసెరాటి ఢిల్లీ లోని ఒక కొత్త డీలర్షిప్ తో తిరిగి భారతదేశంలో ప్రవేశించారు

సెప్టెంబర్ 23, 2015 11:04 am nabeel ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

న్యూ ఢిల్లీ లోని ఒక కొత్త షో రూం ద్వారా మాసెరాటి వారు మళ్ళీ భారతదేశంలో ప్రవేశించారు. ఈ డీలర్షిప్ అంప్ సూపర్ కార్స్ వారి భాగస్వామ్యంతో రాబోతోంది మరియూ మథురా రోడ్ లో 3S సదుపాయం కలదు. ఈ ఇటాలియన్ తయారీదారి ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్ ఇండీయా వారి సహకారంతో భారతదేశంలో పునః ప్రవేశంపై గత ఏడాది ప్రకటించారు.ఈ బ్రాండ్ యొక్క రాబోయే డీలర్షిప్ లు ముంబై మరియూ బెంగళూరు లో ఉంటాయి. ఈ కొత్త షోరూం లో - క్వాట్రపోర్టో, జిబ్లీ, గ్రాన్ ట్యురిస్మో మరియూ గ్రాన్ క్యాబ్రియో వంటివి ఉంటాయి. ఈ 3స్ సదుపాయంలో అమ్మకాలు మరియూ అమ్మకాల తరువాత సర్వీసు పాఋత్ లు అలాగే కస్టమర్లకు సంబంధించి అన్ని సమస్యల పరిష్కారం కూడా అందుబాటులో ఉంటుంది. ఇవి కాకుండా, ప్రత్యేకమైన కస్టమర్ల లౌంజ్ లో మాసెరాటి యొక్క చరిత్ర మరియూ ఏ ప్రాంతంలో కస్టమర్లు ఎక్కడ వారి వాహనాలను కస్టమైజ్ చేసుకోవచ్చు అనే వివరాలు పొందుపరుస్తారు.

ఈ సదర్భంగా మాట్లాడుతూ," మేము భారతదేశంలో ఈ ప్రయాణాన్ని రాజధాని లో మొదటి డీలర్షిప్ తో మొదలు పెట్టినందుకు ఎంతో ఉల్లాసంగా ఉన్నాము. AMP సూపర్ కార్స్ లగ్జరీ కార్ల ఇండస్ట్రీ లో ఇప్పటికే నిలదొక్కుకున్న లీడరు. లగ్జరీ కార్ల కోసమై డిమాండే కాదు, కస్టమర్లు అదే విధమైన అంచనాలను అందుకోవాలి అని ఆశిస్తారు కూడా. ఈ లక్ష్యాన్ని మేము కొత్త AMP సూపర్ కార్స్ ఆధిపత్యం లో చేరుకోవలి అని ఆశిస్తున్నాము," అని ఇండియా కి హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ అయిన మిస్టర్. బొజాన్ జంకులోస్కీ అన్నారు.

ఈ కూటమి గురించి మాట్లాడుతూ, అంప్ సూపర్ కార్స్ కి డీలర్ ప్రిన్సిపల్ అయిన మిస్టర్. గుర్మీత్ ఆనంద్ గారు," మొట్టమొదటి మాసెరాటి షోరూం ని భారతదేశంలో మొదలు పెడుతున్నందుకు గాను మాకె ఎంతో గర్వంగా ఉంది. మేము మాసెరాటి యొక్క విలాసాన్ని మరియూ ప్రత్యేకతని అందించగలమే నమ్మకం మాకు ఉంది. ఈ బ్రాండ్ తో మా ఈ అనుబంధం ఎన్నో కాలాలు నడుస్తుంది అని భావిస్తున్నాము," అని తెలిపారు. మాసెరాటి వారు వారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లగ్జరీ వెహికల్ అమ్మకాలైన 36,500 యూనిట్ల ని 2014 లో కొత్త మార్కెట్లలో ప్రవేశించడం వలన మరియూ కొత్త మోడల్స్ అందించడం వలన సాధించగలిగారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience