మారుతి విటారా బ్రెస్జా MT vs AMT ఆటోమేటిక్ - రియల్ వరల్డ్ మైలేజ్ పోలికలు
ఏప్రిల్ 18, 2019 02:48 pm dinesh ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి విటారా బ్రెజ్జా 2016 లో విడుదల అయినప్పటి నుండి భారతదేశంలో యొక్క అత్యధికంగా అమ్ముడుపోతున్న సబ్-4m SUV గా ఉంది. నిజానికి, 10,000 పైగా యూనిట్ల సగటు నెలవారీ విక్రయాలతో, బ్రెజ్జా భారతదేశంలో టాప్ 10 అమ్ముడైన కార్ల మధ్య ఒకటిగా ఉంది. సెగ్మెంట్ లో దాని ఆధిపత్యాన్ని మరింత విస్తరించడానికి మరియు నెక్సాన్ తో పోటీ పడేందుకు, మారుతి ఇటీవలే బ్రెజ్జా లో AMT ప్రారంభించింది. ఇది వరకు, మారుతి నుండి సబ్ 4m SUV 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
మారుతి విటారా బ్రజ్జా డీజిల్ ఇంజన్ తో మాత్రమే లభిస్తుంది. ఇది ఒక 1.3 లీటర్ DDiS200 డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది, ఇది 90ps గరిష్ట శక్తిని మరియు 200Nm గరిష్ట టార్క్ ని అందిస్తుంది. ఇంధన సామర్ధ్యం పరంగా, విటారా బ్రెజ్జా మాన్యువల్ మరియు AMT రెండూ కూడా 24.3Kmpl మైలేజ్ అందిస్తుంది. వాస్తవ ప్రపంచ పరిస్థితులలో ఇది సరిపోతుందా? కనుక్కుందాం పదండి.
క్లెయిమ్డ్ ఫ్యుయల్ ఎకానమీ |
పరీక్షించిన ఫ్యుయల్ ఎకానమీ (నగరం) |
పరీక్షించిన ఫ్యుయల్ ఎకానమీ (హైవే) |
|
మారుతి బ్రెజ్జా MT |
24.3kmpl |
21.7kmpl |
25.3kmpl |
మారుతి బ్రెజ్జా AMT |
24.3kmpl |
17.68kmpl |
20.91kmpl |
రెండు పవర్ట్రెయిన్ ఎంపికలు అదే పేర్కొనబడిన ఇంధన (ఇది నగరం మరియు హైవే డ్రైవింగ్ యొక్క సమ్మేళనంగా ఉంటుంది)సామర్ధ్యం కలిగి ఉన్నప్పటికీ, వాస్తవ ప్రపంచంలో ఫలితాలు చాలా భిన్నంగా ఉంటాయి. మా పరీక్షలలో, బ్రెజ్జా MT దాని AMT కౌంటర్ కంటే నగరంలో మరియు రహదారిలో ఎక్కువ పొదుపుగా ఉంది, మరియు ఇది చాలా ముఖ్యమైన తేడాతో ఉంది. నగరంలో బ్రెజ్జా MT దాని AMT కంటే 4.02Kmpl ఎక్కువ ఉంది మరియు ఈ గ్యాప్ హైవే మీద అయితే మరీ ఎక్కువ ఉన్నట్టు పైన పట్టిక చూస్తుంటే తెలుస్తుంది.
ఎవరైతే ఎక్కువ కారులో తిరిగడం కోసం మరియు ముఖ్యంగా మంచి మైలేజ్ కోసం బ్రెజ్జా డీజిల్ కావాలి అనుకుంటారో వారు మాన్యువల్ తీసుకోడం మంచిదని స్పష్టంగా తెలుస్తుంది. ప్రతీ లీటరు ఫ్యుయల్ లో 4 కిలోమీటర్ల అదనంగా నడుస్తుంది మరియు మీ నెలవారీ ఫ్యుయల్ బిల్లుని తగ్గిస్తుంది.