మారుతి విటారా బ్రెజ్జా వివరాలు క్లప్తంగా
మారుతి విటారా బ్రెజా 2016-2020 కోసం nabeel ద్వారా ఫిబ్రవరి 11, 2016 06:53 pm ప్రచురించబడింది
- 17 Views
- ఒ క వ్యాఖ్యను వ్రాయండి
2016 ఆటో ఎక్స్పో మారుతి బ్రెజా కారణంగా ఘన విజయం సాధించింది. మారుతి ఎగ్జిబిషన్ 0800 గంటలకు ప్రారంభించబడింది మరియు వెంటనే విటారా బ్రెజ్జా వేదికపై తీసుకురాబడింది. ఈ వాహనం మొదటి చూపులో చాలా మంచిగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తరువాత దగ్గరగా చూసినట్లయితే, ఈ కారు దాని బోల్డ్ స్టైలింగ్, థీమ్ లు మరియు తీరుగా అమర్చబడిన అంతర్గత భాగాలతో ఆకట్టుకుంటుంది.
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఒక సబ్ కాంపాక్ట్ అర్బన్ ఎస్యువి, కాన్సెప్ట్ తయారీ, డిజైన్ మరియు అభివృద్ధి భారతదేశంలో సుజికి గ్లోబల్ ప్లాట్ఫార్మ్ మరియు ఇంజిన్ కి అనుగుణంగా చేయబడింది. ఇది సుజుకి యొక్క ప్రధాన సాంకేతిక మరియు ప్రపంచ ఉత్పత్తి అభివృద్ధి ప్రక్రియ ఉపయోగించి అభివృద్ధి చేయబడింది. దీని అభివృద్ధి వ్యయం స్థానికీకరణ 98% కలుపుకొని రూ. 860 కోట్లు కలిగి ఉంది. మిస్టర్ సి వి రామన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆర్ అండ్ డి, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) చీఫ్ ఇంజనీర్ విటారా బ్రెజ్జా ప్రాజెక్ట్ ని లీడ్ చేసారు. ఇక్కడ విటారా బ్రెజ్జా ని మరియు అది అందించే అంశాలను దగ్గరగా పరిశీలించడి.
లుక్స్:
ఈ విభాగంలో తొలి సారిగా, కారు మూడు థీమ్స్ అందుబాటులో ఉంది. షోరూమ్ నుండి వినియోగదారులు గ్లామర్, అర్బన్ మరియు స్పోర్టీ వంటి వారికి నచ్చిన వేరియంట్లను అనుకూలీకరించవచ్చు. స్పోర్టీ వాహనం ఒక పసుపు రూపాన్ని కలిగి దాని విభాగంలో ఇతర వాటితో పోలిస్తే భిన్నంగా కనిపిస్తుంది. దీనిలో బాడీ గ్రాఫిక్స్, బాడీ క్లాడింగ్ మరియు స్పోర్టి 5 యూనిట్లు, 15-స్పోక్ అల్లాయ్ వీల్స్ భిన్నంగా కనిపించేలా చేస్తాయి. ఫ్రంట్ గ్రిల్ కూడా మెష్ బ్లాక్ చిత్రలేఖనము ద్వారా చాలా అద్వితీయంగా ఉంది.
గ్లామర్ అండ్ అర్బన్ వేరియంట్స్ అనేక అంశాలను షేర్ చేసుకుంది మరియు విభిన్నంగా కనిపించేందుకు చాలా ప్రయత్నిస్తుంది. దీనిలో నల్లని రూఫ్ పైన రెడ్ గ్లామర్ థీం స్పోర్ట్ ప్రదర్శిస్తుంది, అయితే బ్లూ అర్బన్ వేరియంట్ రెండు రంగుల ఫ్లోటింగ్ రూఫ్ ని కలిగి ఉంటుంది. ఈ రెండు థీంస్ యొక్క అలాయ్ వీల్స్ ఒకటే అవి 5 సెట్ 10 స్పోక్ సమితి. కానీ గ్లామర్ వేరియంట్ శరీరం పెయింట్ లో కలిగిన ఒక స్పోక్ సమితిని కలిగి ఉంటుంది. ఈ థీమ్లు కాకుండా, ఈ కార్లు ప్రమాణంగా వివిధ పెయింట్ పథకాలతో అందుబాటులో ఉంటుంది.
ఈ విభాగంలో ఎకోస్పోర్ట్ చూడడానికి చాలా స్పోర్టీ గా కనిపిస్తుంది మరియు TUV300 ఒక కఠినమైన SUV లా కనిపిస్తుంది. మారుతి సంస్థ బ్రెజా ని స్పోర్టి మరియు SUV లా రెండు రూపాల్ని కలగలిపేలా తయారుచేసింది. దీని యొక్క పైన వైఖరి చూసినట్లయితే 198mm గ్రౌండ్ క్లియరెన్స్ ని కలిగి ఉండి మరియు ఫ్లాట్ గా ఉండే ముఖ భాగం ఈ కారుకి ఎస్యువి లా కనిపించేలా చేస్తుంది. అయితే రెండు రంగులతో ఉన్న ఫ్లోటింగ్ రూఫ్ కొద్దిగా క్రిందకి దిగి వెనుక భాగం నుండి కారు ని స్పోర్టీ గా కనిపించేలా చేస్తుంది. ఈ కారు 'బుల్ హార్న్' ఆకారంలో ఉన్న LED DRLs ప్రొజక్టర్ హెడ్ల్యాంప్స్ క్రిందగా ప్రవహించేలా ఉంటాయి.
ఈ కారు యొక్క అంతర్భాగాలు మూడ్ లైట్స్ తో విభాగంలో మొదటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని మరియు స్మార్ట్ ప్లే సమాచార వినోద వ్యవస్థను కలిగి ఉంటుంది. శరీర రంగు అవుట్ లైన్స్ మరియు డోర్ ప్యానెల్ల రూపంలో క్యాబిన్ లోపల కారు యొక్క థీం ని గుర్తించవచ్చు. దీని అంతర్భాగాలలో ఒక కొత్త స్టీరింగ్ వీల్ అందించడం జరిగింది. ఈ స్టీరింగ్ వీల్ పైన నియంత్రణ స్విచ్చులు అమర్చబడి ఉంటాయి కానీ ఉత్తేజకరమైన లేదా కొత్తగా అనిపించవు. వారు ఇప్పటికీ పాత మారుతి సరళత మరియు డిజైన్ ని నిర్వహిస్తున్నారు. మొతానికి ఈ కారు ఆకర్షణీయంగా మరియు ఖచ్చితంగా భారతీయ కొనుగోలుదారులు ఆకర్షిస్తుంది.
ఇంజిన్
మొదట్లో విటారా బ్రెజ్జా డీజిల్ మిల్లు తో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇది వారు ప్రయత్నించిన మరియు పరీక్ష చేసిన 1.3 లీటర్ DDiS 200 ఇంజన్ ని కలిగి ఉంటుంది. ఈ ఫియాట్ ఆధారిత ఇంజిన్ గతంలో ఎస్-క్రాస్, ఎర్టిగా మరియు సియాజ్ లో అమలు చేయబడింది. సియాజ్ మరియు ఎర్టిగా లో ఈ ఇంజిన్ సుజుకి యొక్క SHVSతేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీ తో వస్తుంది. కానీ ఇప్పటివరకూ బ్రెజ్జా వాహనం SHVS టెక్ కలిగి ఉంది అని ఎటువంటి వార్త రాలేదు. కాబట్టి, మైలేజ్ గణాంకాలు ఎస్-క్రాస్ ని పోలిన విధంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బ్రెజ్జా వాహనం 88bhp శక్తిని మరియు 200Nm టార్క్ ని అందిస్తుంది. ఈ ఇంజిన్ న్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది మరియు మొత్తం 23Kmpl మైలేజ్ అందిస్తుంది.
భద్రత:
విటారా బ్రెజ్జా భద్రత విషయంలో బలంగా నిలుస్తుంది. ఇది ప్రమాణంగా ఎయిర్బ్యాగ్ ని అందిస్తుంది, అది మాత్రమే కాకుండా బేస్ వేరియంట్ నుండి EBD తో ABS మరియు ప్రయాణికుల ఎయిర్బ్యాగ్ ని కూడా అందిస్తుంది. దీని బాడీ కూడా సుజుకి టెక్స్ట్ శరీర నిర్మాణంతో అమర్చబడిన హై- టెన్సైల్ స్టీల్ నుంచి తయారు చేస్తారు.
మొత్తం
- పొడవు: 3,995mm
- వెడల్పు: 1,790mm
- ఎత్తు: 1,640mm
- వీల్బేస్: 2,500mm
- బూట్ స్పేస్: 328 లీటర్ల
- కనీస గ్రౌండ్ క్లియరెన్స్: 198mm
- టైర్ పరిమాణం: 215 / 60R16
- ఇంజిన్: 1.3-లీటర్ DDiS 200
- పవర్: 88 బిహెచ్పి @ 4,000rpm
- టార్క్: 200Nm @ 1,750rpm
క్లుప్తంగా చెప్పలంటే
విటారా బ్రెజా లుక్స్, స్టైల్, ఉనికి, ఒక నమ్మకమైన వాహనం మరియు నమ్మకమైన బ్రాండ్ గా ఉంది. అంతర్భాగాలు కొద్దిగా వెలిసిపోయిన రంగులో ఉన్నప్పటికీ కానీ ఈ విభాగంలో ఉన్న తొలి టచ్ స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ మిగతా లోపాల్ని మర్చిపోయేలా చేస్తుంది. ఈ కారు యొక్క బుకింగ్స్ ఇపాటికే మొదలాయ్యాయి, ఆసక్తి ఉన్న కారు ఔత్సాహికులు దీనిని వెంటనే బుక్ చేసుకోవచ్చు. మొత్తంమీద, విటారా బ్రెజ్జా భారత మార్కెట్లో చాలా బలమైన ఉత్పత్తిగా ఉంది మరియు సరైన ధరని కలిగి ఉన్నట్లయితే విటారా దాని విభాగంలో ఖచ్చితంగా ఆధిక్యతను సంపాదించుకుంటుంది. అదే విధంగా సబ్-4 మీటర్ మరియు C-సెగ్మెంట్ సెడాన్ యొక్క అమ్మకాలను కూడా కొల్లగొడుతుంది.