మారుతి విటారా బ్రెజ్జా ఆశించిన ధరలు: ఇది హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ & మహీంద్రా XUV 300 ల కంటే తక్కువ ధరలని కలిగి ఉంటుందా?
మారుతి విటారా బ్రెజా 2016-2020 కోసం dhruv attri ద్వారా ఫిబ్రవరి 13, 2020 12:43 pm ప్రచురించబడింది
- 25 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
డీజిల్ ఇంజిన్ ఇప్పుడు అందుబాటులో లేనందున, పెట్రోల్ మోటారుతో కూడిన విటారా బ్రెజ్జా మునుపటి కంటే తక్కువ ధరలో ఉంటుందా?
ఇది మొదట లాంచ్ అయిన సరిగ్గా నాలుగు సంవత్సరాల తరువాత, ఆటో ఎక్స్పో 2020 లో ఫేస్లిఫ్టెడ్ విటారా బ్రెజ్జా ని మారుతి ఆవిష్కరించింది. మేము అప్డేట్ చేయబడిన విటారా బ్రెజ్జాను నిశితంగా పరిశీలించడమే కాక, దాని గురించి తెలుసుకోవలసిన ప్రతి వివరాలను కూడా మేము తెలుసుకున్నాము. అయినప్పటికీ, దాని ధరలను మేము ఇంకా కనుగొనలేదు, ఈ ధరలు ఫిబ్రవరి 15 న ప్రారంభమయ్యే సమయానికి వెల్లడి అవుతుంది. ప్రీ-లాంచ్ బుకింగ్స్ ఇప్పటికే తెరిచి ఉన్నాయి, కాబట్టి మీరు పెట్రోల్ పవర్ తో కూడిన ఎస్యూవీ నుండి ఆశించే ధరల గురించి మీకు ఒక ఆలోచన కావాలంటే ,ఆపై చదవండి. అయితే మొదట, ఇక్కడ మీరు దాని పెట్రోల్ ఇంజిన్ - 1.5-లీటర్ K15 యూనిట్ గురించి తెలుసుకోవాలి.
గణాంకాలు |
BS6 1.5-లీటర్ K-సిరీస్ పెట్రోల్ |
పవర్ |
105PS |
టార్క్ |
138Nm |
ట్రాన్స్మిషన్ |
5-స్పీడ్ MT/4-స్పీడ్ AT |
ఫ్యుయల్ ఎఫిషియన్సీ |
17.03kmpl/18.76kmpl |
ఫేస్‌లిఫ్టెడ్ మారుతి విటారా బ్రెజ్జా ప్రస్తుత మోడల్ లో L, V, Z మరియు Z + లను కలిగి ఉన్న వేరియంట్ నామకరణాన్ని అనుసరిస్తుంది. ఇప్పుడు, అంచనా ధరలను పరిశీలించండి.
వేరియంట్స్ |
ధరలు |
LXi |
రూ. 7.20 లక్షలు |
VXi |
రూ. 7.65 లక్షలు |
VXi AT |
రూ. 8.70 లక్షలు |
ZXi |
రూ. 8.45 లక్షలు |
ZXi AT |
రూ. 9.50 లక్షలు |
ZXi+ |
రూ. 9.25 లక్షలు |
ZXi+ AT |
రూ. 10.50 లక్షలు |
గమనిక: ఈ ధరలు అంచనాలు మాత్రమే మరియు ఫైనల్ ధరలు నుండి మారే అవకాశం ఉంది.
ఇప్పుడు, డీజిల్ కార్లు వాటి పెట్రోల్ కన్నా ఎక్కువ ఖరీదైనవి అని మనందరికీ తెలుసు. అదే లాజిక్‌ను వర్తింపజేస్తే, పెట్రోల్ తో నడిచే విటారా బ్రెజ్జా, 1.3 లీటర్ DDiS ఇంజన్ (రూ. 7.63 లక్షలు) తో నడిచే ప్రస్తుత డీజిల్ వేరియంట్ల కంటే తక్కువ ప్రారంభ ధరను పొందుతుందని మేము ఆశిస్తున్నాము. మారుతి ఈ ఇంజిన్ ను సియాజ్, ఎర్టిగా మరియు XL 6 లతో ఆఫర్ చేస్తున్న 4-స్పీడ్ AT తో అందించనుంది. ఈ ట్రాన్స్మిషన్ కమాండ్ కలిగి ఉన్న వేరియంట్స్ వారి మాన్యువల్ ప్రత్యర్ధుల కంటే సుమారు లక్ష రూపాయల ప్రీమియంను కలిగి ఉంటాయి, కాబట్టి ఇక్కడ కూడా ఇదే విధమైన ధరను ఆశి స్తున్నాము. మీరు గనుక డ్యూయల్-టోన్ ఆప్షన్స్ ని తీసుకోవాలనుకుంటే, అప్పుడు మోనోటోన్ ZXi + వేరియంట్ కంటే సుమారు 16,000 నుండి 20,000 రూపాయల వరకు డబ్బు పెట్టడానికి సిద్ధంగా ఉండండి.
లక్షణాల విషయానికొస్తే, విటారా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ DRL లు తో కొత్త డ్యూయల్ ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్ లు, అప్‌డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, 16-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, 7-ఇంచ్ స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆటో-డిమ్మింగ్ IRVM లను పొందుతుంది. చివరగా, దాని పెట్రోల్-శక్తితో కూడిన పోటీదారుల ధరలను పరిశీలిద్దాం మరియు ఫేస్‌లిఫ్టెడ్ విటారా బ్రెజ్జా ఈ విభాగంలో ఎక్కడ సరిపోతుందో చూద్దాం.
మోడల్ |
మారుతి విటారా బ్రెజ్జా |
టాటా నెక్సాన్ |
హ్యుందాయ్ వెన్యూ |
||
ధరలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) |
రూ. 7.20 లక్షల నుండి రూ. 10.50 లక్షలు (అంచనా) |
రూ. 6.94 లక్షల నుండి రూ. 11.20 లక్షలు |
రూ. 6.55 లక్షల నుండి రూ. 11.15 లక్షలు |
రూ. 8.30 లక్షల నుండి రూ. 11.99 లక్షలు |
రూ. 8.04 లక్షల నుండి రూ. 11.43 లక్షలు |
మరింత చదవండి: మారుతి విటారా బ్రెజ్జా AMT