మరుతీ వారు ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ని అక్టోబరు 15న విడుదల చేయనున్నారు
మారుతి ఎర్టిగా 2015-2022 కోసం అభిజీత్ ద్వారా అక్టోబర్ 13, 2015 03:12 pm ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: మారుతీ ఎర్టిగా ఫేస్6లిఫ్ట్ అక్టోబర్ 15న విడుదల కి సిద్దంగా ఉంది. ఇండొనేషియా ఆటో ఎక్స్పో లో ప్రదర్శితం అయ్యినప్పటి నుండి కొంచం ఆలస్యమైంది. ఇదే కాకుండా ఈ కారు అప్పుడప్పుడు దేశంలో కంటపడింది.
ఈ పునరుద్దరణకి చిన్న బాహ్యపు అతుకులు జరిగాయి. అవి, మారిన ముందు వైపు బంపర్ డిజైన్, కొత్త గ్రిల్లు క్రోము పూత కలిగి, కొత్త జత అల్లోయ్ వీల్స్ ఇంకా కొత్త వెనుక వైపు బంపర్. లోపల వైపు, స్టార్ట్/స్టాప్ బటన్, సియాజ్ వారిచే స్మార్ట్‌ప్లే ఇంఫొటెయిన్‌మెంట్ యూనిట్ మరియూ కొత్త అప్‌హోల్స్ట్రీ కలిగి ఉంటుంది. అతి పెద్ద మార్పు ఇంజిను విషయంలో పొందింది. ఎందుకంటే ఇందులో కొత్త CVT ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ మరియూ SHVS మైల్డ్ హైబ్రీడ్ సిస్టం తో డీజిలు మోటరు మైలేజీని పెంచడం కోసం జత చేయబడింది.
కొత్త ఎర్టిగా కి 1.3-లీటర్ DDiS200 డీజిల్ మరియూ 1.4-లీటర్ పెట్రోల్ మోటర్లు 88.8bhp/200Nm టార్క్ మరియూ 93.7bhp/130Nm టార్క్ లు అందిస్తాయి. డ్రైవింగ్ విధానాలు అలాగే ఉన్నప్పటికీ సీవీటీ ఆటోమాటిక్ మరియూ సుజుకీ మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీ ఉండటం చేత కొంచం తేడా ఉంటుంది. పైగా, పెట్రోల్ తో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్న వాహనం యొక్క మైలేజీ అదే 16.02Kmpl ఉండగా, డీజిలుకి ప్రస్థుత 20.77Kmpl కంటే కొంచం ఎక్కువగా ఉండవచ్చును.
దీనికి పోటీగా హోండా మొబిలియో, రెనాల్ట్ లాడ్జీ, టొయోటా ఇన్నోవా లు ఉన్నా, వీటితో పోలిస్తే, ఎర్టిగా యొక్క అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ ఎర్టిగా కి ఎంపీవీ మార్కెట్ లో అమ్మకాలు పెరగవచ్చు ఎందుకంటే ఇతర ఏ వాహనానికి ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ అందించడం లేదు.