మారుతి సుజుకి సెలెరియో ZXI ఆటోమాటిక్ ని ప్రవెసపెట్టింది:
మారుతి సెలెరియో 2017-2021 కోసం raunak ద్వారా మే 27, 2015 03:49 pm సవరించబడింది
- 15 Views
- 2 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇప్పుడు మీరు సెలిరియో ఆటోమేటిక్ వేరియంట్ ను ఎంచుకోదలచుకుంటే, అది ప్రస్తుతం అగ్ర శ్రేణి వేరియంత్ అయిన ZXi వేరియంట్ లో అందుబాటులో ఉంది అంతేకాకుండా ఈ ఆటోమేటిక్ వెర్షన్ లో డ్రైవర్ సైడ్ ఎయిర్ బాగ్ తో అందుబాటులో ఉంది, కాని దీనిలో ABS లేదు.
జైపూర్: మారుతి సుజుకి ఒక కొత్త వేరియంట్ ను ప్రవేశపెట్టింది. ఆ కొత్త వేరియంట్, మారుతి సుజుకి సెలిరియో యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన సెలిరియో ZXi లో అందుబాటులో ఉంటుంది. ఇది ఒక AGS ( ఆటో- గేర్ - షిఫ్ట్ ) అనగా ఆటోమేటిక్ వెర్షన్.
సెలెరియో ZXi AGS లక్షణాలు మరియు ఇతరత్రా గురించి మాట్లాడటానికి వస్తే, ఈ వేరియంట్ లో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బాగ్ ను కలిగి ఉంది; 2 - దిన్ ఆడియో సిస్టమ్ తో పాటుగా రేడియో, CD, USB, బ్లూటూత్ లను కలిగి ఉన్నాయి. మరియు ఆక్సలరీ - ఇన్ తో పాటుగా స్టీరింగ్ వీల్ పై ఆడియో నియంత్రణలు; స్టీరింగ్ వీల్ తో పాటు టిల్ట్ సర్దుబాటు; కారు వెనుక విండ్స్క్రీన్ పై ఒక వైపర్, వాషర్ మరియు డీమిస్టర్; ఎలక్ట్రానిక్ సర్దుబాటు తో వెలుపలి రేర్ వ్యూ మిర్రర్స్; మరియు కీలెస్ ఎంట్రీ. వీటితో పాటు, LXi మరియు VXi వేరియంట్లలో ఉన్న అన్ని లక్షణాలు ZXi AGS వేరియంట్ కలిగి ఉంటుంది. అయితే, మాన్యువల్ ZXi ఆప్షనల్ తో పోలిస్తే, ZXi AGS వేరియంట్ లో ABS అందుబాటులో లేదు.
ఈ వేరియంట్ 1.0 లీటర్ K10B పెట్రోల్ ఇంజెన్ తో వస్తుంది. ఈ పెట్రోల్ ఇంజెన్ లు అత్యదికంగా 67 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తాయి. మరియు 90 Nm అధిక టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజెన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో జతచేయబడి ఉంటాయి. ఈ ఆటోమేటిక్ వెర్షన్ అధికంగా 23.1 kmpl ఇంధన సామర్ధ్యాన్ని ఇస్తాయి.