మారుతి సుజుకి eVX ఎలక్ట్రిక్ SUV టెస్టింగ్ ప్రారంభం, ఇంటీరియర్ వివరాలు లభ్యం
మారుతి ఇ vitara కోసం rohit ద్వారా జ ూన్ 27, 2023 10:14 am ప్రచురించబడింది
- 51 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఫ్రాంక్స్ మరియు గ్రాండ్ విటారా వంటి కొత్త మారుతి సుజుకి కార్ల డిజైన్ పోలికలతో మారుతి సుజుకి eVX.
-
మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పో 2023లో eVXని కాన్సెప్ట్ EVగా ప్రవేశపెట్టింది.
-
ఈ టెస్ట్ వాహనంలో మేక్షిఫ్ట్ లైట్స్ , ORVM-మౌంటెడ్ సైడ్ కెమెరాలు మరియు సిల్వర్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
-
దీని లోపల, కనెక్ట్ చేయబడిన స్క్రీన్‌లు మరియు కొత్త స్క్వేర్డ్-ఆఫ్ స్టీరింగ్ వీల్‌లు ఉన్నాయి.
-
క్లెయిమ్ చేసిన శ్రేణిలో 550km వరకు మైలేజీ ఇచ్చే 60kWh బ్యాటరీ ప్యాక్‌ని పొందుతుంది.
-
2025 నాటికి విడుదలయ్యే ఈ వాహనానికి రూ. 25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభ ధరలు ఉంటుందని భావిస్తున్నాము.
ఆటో ఎక్స్‌పో 2023లోని కాన్సెప్ట్‌లలో, మారుతి eVX ఎలక్ట్రిక్ SUV కార్‌మేకర్ యొక్క మొదటి EV కావడంతో అత్యంత ప్రాముఖ్యతను పొందింది. రహస్యంగా దొరికిన సమాచారంలో, 2025 నాటికి ప్రారంభించబడుతుందని అంచనాలున్నప్పటికీ, మారుతి సుజుకి ప్రొడక్షన్-స్పెక్ eVXలో అభివృద్ధి పనులను ప్రారంభించిందని తెలిసింది.
రహస్యంగా తీసిన చిత్రాలనుండి లభించే సమాచారాలు చూద్దాం
ఈ ప్రోటోటైప్ లో కొన్ని కీలకమైన లక్షణాలు తొలగించబడ్డాయి. ORVM లోని కెమెరాలు మరియు అవాస్తవిక చక్రాలు తొలగించబడ్డాయి. రహస్యంగా దొరికిన చిత్రాలలో eVX భారీ నల్లని ముసుగుతో కప్పివేసినట్లు కనిపిస్తుంది. ఇది మారుతి గ్రాండ్ విటారా మరియు ఫ్రాంక్స్‌లలో ఉన్న గ్రిల్ లాంటి క్రోమ్ బార్‌తో పాటు తాత్కాలిక హెడ్‌లైట్‌లు మరియు టెయిల్‌లైట్‌లను కలిగి ఉండవచ్చు. బహుశా పెద్ద క్లోజ్-ఆఫ్ గ్రిల్ కూడా ఉండవోచ్చ్చని భావిస్తున్నాము.
EV యొక్క సైడ్ ప్రొఫైల్ ఫ్రాంక్స్‌తో పోలికలు కలిగి ఉంటుంది. గీతాలున్న దిట్టమైన భుజాలు ఉండొచ్చు. టెస్ట్ వాహనంలో సిల్వర్-ఫినిష్డ్ అల్లాయ్ వీల్స్ ముస్క్యూలర్ ఆర్చ్ మరియు రియర్ పిల్లర్-మౌంటెడ్ డోర్ హ్యాండిల్స్ ఉండొచ్చు. 360-డిగ్రీ ప్రోవిషన్ ఉన్న కెమెరా, ORVM-మౌంటెడ్ సైడ్ కెమెరా కూడా ఉండొచ్చు. భారీ కవర్ కింద దాని రియర్ భాగం కనిపించకపోయినప్పటికీ, దానికి వైపర్ మరియు కనెక్ట్ చేయబడిన LED లైటింగ్ సెటప్ ఉన్నట్లు తెలుస్తుంది, నంబర్ ప్లేట్ బంపర్‌పైన ఉండొచ్చు.
ఇది కూడా చూడండి: మారుతి ఇన్విక్టో యొక్క తాజా టీజర్ ఇంటీరియర్ వివరాల యొక్క అధికారిక సంగ్రహావలోకనం ఇస్తుంది
కనిపించిన క్యాబిన్ వివరాలు
ఈ చిత్రాలలో eVX యొక్క క్యాబిన్ కూడా వెల్లడైంది. క్యాబిన్ లో కనెక్ట్ స్క్రీన్‌ల సెటప్ ఉంది. స్క్వేర్డ్-ఆఫ్ స్టీరింగ్ వీల్ నియంత్రణలను కలిగివుంటుంది. పొడవైన సెంటర్ కన్సోల్ డాష్‌బోర్డ్ వరకు ఉంటుంది, నిలువుగా పేర్చబడిన AC వెంట్‌లను కూడా కలిగి ఉంటుంది. లోవర్ సెంట్రల్ కన్సోల్ కింద పెద్ద నిల్వ స్థలం ఉంటుంది. డ్రైవర్ సీటు కోసం పవర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది.
ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ వివరాలు
ప్రొడక్షన్-స్పెక్ eVX ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ గురించి పెద్దగా తెలియనప్పటికీ, మారుతి సుజుకి - ఆటో ఎక్స్‌పో 2023లో - ఇది 550km వరకు క్లెయిమ్ చేయబడిన పరిధికి తగిన 60kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని ఎదురుచూస్తున్నాము. eVX 4x4 డ్రైవ్‌ట్రెయిన్ కోసం డ్యూయల్-మోటార్ సెటప్ కూడా ఉండొచ్చని ఎదురుచూస్తున్నాము.
ఇది కూడా చదవండి: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత టెస్లా ఇండియా అరంగేట్రం గురించి ఎలన్ మస్క్ ధృవీకరించారు
వాహనం యొక్క ఊహించిన ప్రారంభ తేదీ మరియు ధరలు
మారుతి సుజుకి 2025 నాటికి భారతదేశంలో eVXని దాదాపు రూ. 25 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేస్తుందని మేము భావిస్తున్నాము. ఇది మహీంద్రా XUV400 మరియు టాటా నెక్సాన్ EV మ్యాక్స్‌లకు ప్రీమియం ప్రత్యామ్నాయంగా ఉండగా, MG ZS EV మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వంటి వాటితో పోటీపడొచ్చు.
0 out of 0 found this helpful