మారుతి సుజుకి ఎర్టిగా BS6 డీజిల్ టెస్టింగ్ జరుగుతూ మా కంటపడింది

ప్రచురించబడుట పైన Nov 19, 2019 03:06 PM ద్వారా Sonny for మారుతి ఎర్టిగా

 • 24 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

డీజిల్ ఇంజిన్ సమర్పణ 2020 ఏప్రిల్ తరువాత ఎంచుకున్న మారుతి మోడళ్లలో కనిపిస్తుంది

 •  ఎర్టిగా MPV BS 6 డీజిల్ ఇంజిన్‌ చుట్టూ కవరింగ్ తో టెస్ట్ చేయబడుతూ మా కంట పడింది.
 •  ప్రస్తుతం ఇది 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో పాటు CNG వేరియంట్‌ తో కూడా అందించబడుతోంది.
 •  మారుతి ఎర్టిగా మరియు XL 6 రెండింటిలో BS6 డీజిల్ ఇంజిన్‌ అందించబడే అవకాశం ఉంది.
 •  డీజిల్ ఇంజన్ కోసం BS6 అప్‌డేట్ ధర లక్ష రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది.
 •  S-క్రాస్‌ లో రహస్యంగా చూసిన కొత్త 1.6-లీటర్ డీజిల్ ఇంజిన్‌ ఎర్టిగా లో కూడా ఉండే  అవకాశం ఉంది, ఈ ఎమిషన్ టెస్ట్ లో ఇది కూడా కనబడింది.

Maruti Suzuki Ertiga BS6 Diesel Spied Testing

మారుతి సుజుకి ఎర్టిగా MPV ప్రస్తుతం 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు మరియు CNG వేరియంట్‌ తో కూడా లభిస్తుంది. పెట్రోల్ ఇంజన్ ఇప్పటికే BS6 కంప్లైంట్ అయితే, BS4 డీజిల్ ఇంజన్ నిలిపివేయబడుతుంది. ఇప్పుడు, మారుతి MPV యొక్క కవరింగ్ తో ఉన్న వెర్షన్ BS6- కంప్లైంట్ డీజిల్ ఇంజిన్‌ టెస్ట్ చేయబడుతూ మా కంటపడింది.

BS 6 ఎరాలో  డీజిల్ మోడళ్లను పూర్తిగా నిలిపివేయాలని కార్ల తయారీదారు ప్రకటించినప్పటికీ, పెద్ద మోడళ్లు డీజిల్ ఇంజిన్‌ ను పొందడం కొనసాగించవచ్చని తెలుస్తోంది. రహస్యంగా కనిపించిన ఎర్టిగాలో DDiS డీజిల్ బ్యాడ్జ్ ఉంది మరియు ఇది BS 6 ఎమిషన్ టెస్ట్ నడుపుతున్నట్లు సూచించే స్టిక్కర్‌ ను కూడా కలిగి ఉంది.

Maruti Suzuki Ertiga BS6 Diesel Spied Testing

ఇటీవల, మారుతి S-క్రాస్ కాంపాక్ట్ SUV కూడా 1.6-లీటర్ డీజిల్ బ్యాడ్జ్‌ తో ఎమిషన్ టెస్ట్ కి గురవుతున్నట్టు గుర్తించబడింది. ఎర్టిగా యొక్క 1.5-లీటర్ డీజిల్‌ ను మారుతి సుజుకి ఇన్హౌస్‌ లో అభివృద్ధి చేసింది మరియు 6-స్పీడ్ మాన్యువల్‌ తో జతచేయబడి 95 PS పవర్ మరియు 225 Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ఎర్టిగా మరియు  XL6 రెండు మారుతి MPV లు కొత్త ఫియట్-సోర్స్డ్ BS6 1.6-లీటర్ డీజిల్‌ ను పొందే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: ఏ మారుతి కార్లు BS6 డీజిల్ ఇంజిన్ పొందగలవు?

Maruti Suzuki Ertiga BS6 Diesel Spied Testing

BS6 డీజిల్ ఇంజన్ డీజిల్ వేరియంట్ల ధరలు లక్ష రూపాయల వరకు పెరగవచ్చు. మారుతి XL 6 ప్రస్తుతానికి పెట్రోల్ తో మాత్రమే అందించబడుతుంది మరియు దీని ధర రూ .9.79 లక్షల నుంచి రూ. 11.46 లక్షల మధ్య ఉండగా, డీజిల్‌ తో నడిచే ఎర్టిగా ధర రూ .9.87 లక్షల నుంచి రూ .11.21 లక్షల మధ్య ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

చిత్ర మూలం

మరింత చదవండి: ఎర్టిగా డీజిల్

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మారుతి ఎర్టిగా

2 వ్యాఖ్యలు
1
N
naveen bansal
Dec 25, 2019 2:05:46 AM

Plz tell when ertiga diesel bs6 launched

  సమాధానం
  Write a Reply
  1
  R
  rajesh
  Dec 8, 2019 4:53:40 PM

  Please provide an update on diesel automatic launch

   సమాధానం
   Write a Reply
   Read Full News

   సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

   ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
   • ట్రెండింగ్
   • ఇటీవల
   ×
   మీ నగరం ఏది?