మారుతి సుజుకి సెలెరియో: వేరియంట్స్ వివరణ
మారుతి సెలెరియో 2017-2021 కోసం raunak ద్వారా మార్చి 27, 2019 12:06 pm ప్రచురించబడింది
- 21 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి సంస్థ ఇటీవల అక్టోబర్ 2017 లో సెలెరియో యొక్క మిడ్-లైఫ్ రిఫ్రెష్డ్ / ఫేస్లిఫ్ట్ మోడల్ ను విడుదల చేసింది. సెలెరియో దేశంలో మారుతి సంస్థ యొక్క మొట్టమొదటి AMT- ఎక్యుపెడ్ (ఆటోమేటెడ్-మాన్యువల్ ట్రాన్స్మిషన్) వాహనంగా ఉంది మరియు 2014 లో ప్రారంభించబడింది. నిజానికి ఇది AMT ట్రాన్స్మిషన్ కలిగి ఉన్న భారత మార్కెట్ లో మొదటి వాహనం.
మారుతి సెలెరియో మూడు వేరియంట్లలో - LXI, VXI మరియు ZXI, మరియు మూడు ఆప్ష్నల్ - LXI (O), VXI (O) మరియు ZXI(O) లతో లభిస్తుంది. ఇంకా, సెలేరియో యొక్క టాప్ రెండు వేరియంట్స్ - VXI మరియు ZXI వాటి ఆప్ష్నల్ వెర్షన్లతో పాటు AMT ఎంపికను అందిస్తాయి మరియు మిడ్ VXI వేరియంట్ CNG ఆప్షన్ ని కూడా ఉంది. అందువల్ల మొత్తం 12 ఆప్షన్స్ లో ఇది అందుబాటులో ఉంది. డ్రైవర్ యొక్క ఎయిర్బాగ్ అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా అందించబడుతుంది, అయితే ఆప్ష్నల్ వేరియంట్స్ ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్, ప్రీ-టెన్సర్ తో ఫ్రంట్ సీటు బెల్ట్ మరియు ABS తో ఫోర్స్ లిమిటెర్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ఏ వేరియంట్ మీకు ఉత్తమమైనదో చూద్దాం పదండి.
మారుతి సుజుకి సెలెరియో: స్పెసిఫికేషన్స్
కొలతలు (L x W x H) |
3695mm x 1600mm x 1560mm |
వీల్బేస్ |
2425mm |
గ్రౌండ్ క్లియరెన్స్ |
165mm |
సీటింగ్ సామర్థ్యం |
5 |
మారుతి సుజుకి సెలెరియో: ఇంజన్ ఆప్షన్స్
1.0 లీటర్ K10B 3-సిలిండర్ పెట్రోల్ |
|
ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ |
998cc |
ట్రాన్స్మిషన్ |
5-speed MT/AMT |
మాక్స్ పవర్ |
68PS @ 6,000rpm |
మాక్స్ టార్క్ |
90Nm @ 3,500rpm |
ఇంధన సామర్ధ్యం (క్లైమెడ్) |
23.10kmpl |
మారుతి సుజుకి సెలేరియో LXI మరియు LXI(O): బేర్ బోన్స్
ధరలు(ఎక్స్-షోరూం, డిల్లీ)
వేరియంట్స్ |
LXI |
LXI(ఆప్ష్నల్) |
ధర |
రూ.4.51 లక్షలు |
రూ.4.30 లక్షలు |
ప్రధాన లక్షణాలు
- మాన్యువల్ ఎయిర్ కండీషనింగ్
- ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్
- డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్
- టైర్ పరిమాణం: 155/80 క్రాస్ సెక్షన్ R13
ఈ బేస్ LXI వేరియంట్ అనేది ఎవరైతే అల్టోస్, నానో మరియు క్విడ్ వంటి ఎంట్రీ-లెవల్ కార్లు మరియు కొన్ని ముఖ్యమైన లక్షణాలు లేనటువంటి కార్లు కాకుండా వారి బడ్జెట్ ని ఇంకా పెంచుకొని మంచి బేస్ వేరియంట్ కోసం చూస్తారో ఇది వారికోసం. అయితే మారుతి సంస్థ వేరియంట్ ల శ్రేణిలో ప్రామాణికంగా డ్రైవర్ ఎయిర్బాగ్లను అందిస్తుంది, అయితే ఇది బేస్ వేరియంట్ LXI నుండి ఫ్రంట్ పవర్ విండోస్ ని తప్పకుండా అందించాలి. మొత్తంమీద, LXI (O) ను ఎంపిక చేసుకుంటాము, కేవలం 15K కి మాత్రమే మీరు ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) తో పాటు కో-ప్యాసింజర్ ఎయిర్బ్యాగ్ ను పొందుతారు, ఇది ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్ కార్ల ఆఫర్ కాదు.
మారుతి సుజుకి సెలెరియో VXI మరియు VXI (O): ఎక్కువ ఆప్షన్స్ తో ఉన్న ఒకే ఒక్క వేరియంట్
5-స్పీడ్ మాన్యువల్
వేరియంట్స్ |
VXI |
VXI (ఆప్షనల్) |
ధర |
రూ. 4.49 లక్షలు |
రూ. 4.64 లక్షలు |
LXI పై తేడా |
~ రూ. 34,000 |
~ రూ. 34,000 |
5-స్పీడ్ AMT
వేరియంట్స్ |
VXI AMT |
VXI AMT (ఆప్షనల్) |
ధర |
రూ. 4.92 లక్షలు |
రూ. 5.07 లక్షలు |
సెలేరియో CNG
వేరియంట్స్ |
VXI CNG |
VXI CNG (ఆప్షనల్) |
ధర |
రూ. 5.11 లక్షలు |
రూ. 5.26 లక్షలు |
ప్రధాన లక్షణాలు
- LXI వేరియంట్ మీద, VXI అందిస్తున్న లక్షణాలు:
- డ్రైవర్ వైపు ఆటో డౌన్ తో ముందు మరియు వెనుక పవర్ విండోస్
- ఇంటర్నల్లీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్(ORVM)
- సెంట్రల్ లాకింగ్
- 60:40 స్ప్లిట్ తో వెనుక సీటు
- డే మరియు నైట్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్
- 165/70 R14 టైర్లతో ఫుల్ వీల్ క్యాప్
- క్రోం గ్రిల్
- బాడీ కలర్డ్ ORVM లు మరియు డోర్ హ్యాండిల్స్
కొనుగోలు చేసేందుకు విలువైనదా?
VXI వేరియంట్ సెలేరియో లైనప్ లో ప్రత్యేకమైన CNG తో సహా, చాలా ఆప్షన్లను అందిస్తుంది. ఇది LXI వేరియంట్ పై పవర్ విండోస్ మరియు సెంట్రల్ లాకింగ్ వంటి ప్రాథమిక లక్షణాలను కూడా పొందుతుంది. LXI పై ధర వ్యత్యాసం జోడించిన పరికరాలను పరిగణనలోకి తీసుకుంటే ఆ ధరను స్వీకరించవచ్చు మరియు ధర VXI మరియు VXI (O) రెండింటికీ సమానంగా ఉంటుంది. మొత్తంమీద, VXI అనేది విలువైనది, అది మీకు ఆటోమేటిక్ మరియు ప్రత్యేక ఆల్టర్నేటివ్ ఫ్యుయల్ ఆప్షన్ (CNG) తో పాటు అన్ని ప్రాథమిక లక్షణాలను అందిస్తుంది. మళ్ళీ, మేము ఇక్కడ ఆప్ష్నల్ వెర్షన్ ని ఎంచుకుంటున్నాము, అది చాలా సురక్షితమైనది.
మారుతి సుజుకి సెలేరియో ZXI మరియు ZXI (O): చాలా ప్రీమియమైనది!
5-స్పీడ్ మాన్యువల్
వేరియంట్స్ |
ZXI |
ZXI(ఆప్ష్నల్) |
ధర |
రూ. 4.74 లక్షలు |
రూ .5.22 లక్షలు |
VXI పైగా వ్యత్యాసం |
~ రూ. 25,000 |
~ రూ. 58,000 |
5-స్పీడ్ AMT
వేరియంట్స్ |
ZXI AMT |
ZXI AMT (ఆప్ష్నల్) |
ధర |
రూ. 5.17 లక్షలు |
రూ. 5.34 లక్షలు |
VXI పైగా వ్యత్యాసం |
~ రూ. 25,000 |
~ రూ. 27,000 |
ప్రధాన లక్షణాలు
VXI వేరియంట్ పై, ZXI అందిస్తున్న లక్షణాలు:
- CD, USB మరియు Aux-in తో కలిసి బ్లూటూత్ ఫోన్ ఇంటిగ్రేషన్ తో డబుల్-డిన్ ఆడియో సిస్టమ్, మరియు నాలుగు-స్పీకర్ సిస్టమ్ జత చేయబడింది.
- ఎలెక్ట్రానికల్ అడ్జస్టబుల్ వెలుపలి రియర్వివ్ మిర్రర్స్
- కీలేస్ ఎంట్రీతో సెంట్రల్ లాకింగ్
- టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్
ZXI (O) మాన్యువల్: ఫ్రంట్ ఫాగ్ దీపాలు, అల్లాయ్ చక్రాలు, యాంటీ థెఫ్ట్ భద్రతా వ్యవస్థ మరియు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు
కొనుగోలు చేసుకొనేందుకు విలువైనదా?
టాప్ వేరియంట్ అయిన ZXI వేరియంట్ సెలెరియో యొక్క మరింత ప్రీమియం ని జోడిస్తుంది. సుమారు 25,000 రూపాయల అప్గ్రేడ్, అదనపు పరికరాలకు గానూ ZXI మాన్యువల్, ZXI AMT మరియు ZXI (O) AMT వేరియంట్స్ కి చార్జ్ చేయబడతాయి. మరోవైపు, ZXI (O) మాన్యువల్, హ్యాచ్బ్యాక్ యొక్క లైనప్ లో అత్యధికంగా లోడ్ చేయబడిన వేరియంట్ గా ఉంటుంది, అయితే సుమారు రూ .60,000 అలాయ్ వీల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు మరిన్ని లక్షణాల కోసం చెల్లించాల్సి ఉంటుంది.
You don’t wanna miss this: Maruti Suzuki Celerio vs CelerioX