సేల్స్ పరంగా 1 లక్ష అమ్మకాల మైలురాయిని దాటిన మారుతి సుజుకి సెలెరియో
modified on జూలై 10, 2015 04:48 pm by raunak కోసం మారుతి సెలెరియో
- 10 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
దేశంలో, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రత్యామ్నాయాలతో పాటు పెట్రోల్, సిఎన్జి, డీజిల్ తో అందించే ఒక్క గాని ఒక్క కారు మారుతి సెలిరియో మాత్రమే
జైపూర్: మారుతి సెలెరియో హాచ్బాక్ 2014 భారత ఆటో ఎక్స్పోలో గత ఏడాది ప్రవేశపెట్టారు, అయినప్పటికి దేశంలో 100,000 అమ్మకాలను దాటింది. దీనిని ఏఎంటి (ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) వెర్షన్ తో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా, ఇది చౌకైన ఆటోమేటిక్ వాహనాన్ని అందుబాటులో ఉంచారు. గత నెల, మారుతి వారిచే మొట్టమొదటిగా అబివృద్ది చేయబడిన డీజిల్ ఇంజన్ ను ప్రవేశపెట్టారు. ఈ డీజిల్ ఇంజన్, అత్యధికంగా 27.62 kmpl మైలేజ్ ను అందిస్తుంది మరియు భారతదేశంలో అధిక ఇంధన సామర్ధ్యాన్ని ఇచ్చే వాహనం సెలెరియో మాత్రమే.
మారుతి ఘన విజయాన్ని జరుపుకుంటున్న సమయంలో, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ యొక్క మార్కెటింగ్, సేల్స్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి మిస్టర్ ఆర్ ఎస్ కల్సి ఈ విధంగా మాట్లాడారు. " బ్రాండ్ సెలేరియోకి గానూ వినియోగదారులు అందించే ప్రోత్సాహానికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అని తెలిపారు. సెలెరియో భారతదేశంలో ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీ విభాగంలో అనేక ప్రశంసలు అందుకున్న మరియు ఆటో గేర్ షిఫ్ట్ వేరియంట్స్ లో మూడువంతులు అమ్మకాలు సాధించిన కార్లలో మొదటిది అని అన్నారు. అంతేకాకుండా ఆటోమెటిక్ గేర్ షిఫ్టింగ్ లో ఇంధనం నష్ట పోనందుకు మరియు సంవత్సరంలోనే ఈ తక్కువ హాచ్బాక్ లో మారుతీ సుజికి షేర్ 61% నుండి 71% వరకు పెరిగినందుకు వినియోగదారులు అభినందించారని తెలిపారు".
దేశంలో ఇటీవల విడుదల అయిన సెలిరియో డీజిల్ ఇంజన్, అత్యంత ఇంధన సామర్ధ్యాన్ని ఇచ్చి సంచలనం సృష్ట్టించింది. ఈ ఇంజన్, రెండు సిలండర్లను కలిగి ఉంది. 793 స్థానభ్రంశాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ డిడి ఐఎస్ డీజిల్ ఇంజన్ 3500 rpm వద్ద 47.6 bhp పవర్ ను మరియు 2000 rpm వద్ద 125 Nm గల పీక్ టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. అయితే, తరువాతి రోజుల్లోఅ ఈ మారుతి సెలిరియో ఏఎంటి వెర్షన్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- Renew Maruti Celerio Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful