మారుతి సుజుకి బాలెనో: కార్దెఖో యొక్క సమగ్ర సారాంశం!

మారుతి బాలెనో 2015-2022 కోసం raunak ద్వారా అక్టోబర్ 26, 2015 11:23 am ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Maruti Baleno

ఈ బాలెనో పేరు ఒక మిడ్ సైజ్ సెడాన్ నుండి తీసుకోబడినది. ఈ వాహనం ఆ మిడ్ సైజ్ సెడాన్ వలే కాకుండా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ వాహనం అద్భుతమైన లక్షణాలతో విభాగంలో మొదటిసారిగా ఆపిల్ కార్ప్లే తో వస్తుంది. ఈ వాహనం యొక్క ఇంజిన్ అంతా కుడా స్విఫ్ట్ తో సమానంగా ఉంటుంది. ఇది ఒక కొత్త ప్లాట్ఫార్మ్ తో రానున్నది. బుక్ చేసుకోవలనుకుంటున్నారా? కొనుగోలు ప్లాన్ చేస్తున్నారా? అయితే వివరాలన్నీ పరిశీలించండి.

మారుతి సంస్థ మొదట భారతదేశం యొక్క మొదటి ప్రీమియం హాచ్ జెన్ ని 1000cc ఇంజిన్ తో అందించింది. ఆ తరువాత స్విఫ్ట్ ట్రెండ్ ని ప్రారంభించింది మరియు ప్రజలు ప్రీమియం ధర ట్యాగ్లతో హ్యాచ్ లను అంగీకరించడం మొదలుపెట్టారు. హ్యుందాయి ఐ20 దాని లక్షణాలతో ఆకట్టుకోలేకపోయింది మరియు ఎలైట్ ఐ20 వచ్చి దాని యూరోపియన్ లుక్స్ తో ప్రజలను ఆకట్టుకుంది.

హ్యుండై ఎలీట్ ఐ20 ని క్రిందికి నెట్టేందుకుమారుతీ వారు బలేనో ని తీసుకు వచ్చారు. ఈ మారుతిసుజూకీ బలెనో వచ్చే సోమవారం విడుదల కానుంది. ఈ బలెనో కేవలం ప్రీమియం నెక్సా డీలర్‌షిప్ లలో లభ్యం అవుతుంది. ఈ ఏడాది చివరికి మరుతీ వారు 100 నెక్సా డీలర్‌షిప్ లను తెరవబోతున్నారు. ప్రస్తుతం 80 పైగా డీలర్‌షిప్ లు ఉన్నాయి. బలెనో కోసం బుకింగ్స్ కొన్ని వారాల క్రితం మొదలయ్యాయి మరియూ అధికారికంగా అక్టోబర్ 26న విడుదల అవ్వనుంది.

ఎంతగానో ఎదురుచూస్తున్న వైఆర్ ఎ ఈ రోజు రానున్నది. కానీ మళ్ళీ ఈ వాహనం బాలెనో నామకరణంతో రాబోతున్నదని ఎవరూ ఊహించలేనిది. కొత్త కారు పాత కారు లక్షణాలతో వస్తుంది అంటే కొంచెం వినియోగదారులు ఆశ్చర్యానికి లోనవుతారు. కానీ బాలెనో ఒక కొత్త లక్షణాలతో వస్తుందని వివరించాలి.

ఇప్పటి వరకు స్విఫ్ట్, మారుతి సుజుకి వారు సమర్పించిన హ్యాచ్బ్యాక్ లో మొట్టమొదటిది. ఇది 2005 లో ప్రీమియం హ్యాచ్బ్యాక్ యొక్క కాన్సెప్ట్ తో ప్రజలకు పరిచయం అయ్యింది. అప్పటికే దేశంలో చాలా శక్తివంతమైన మరియు విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి, అయినప్పటికీ స్విఫ్ట్ తన యొక్క లక్షణాలతో వాటన్నిటి మధ్య నిలదొక్కగలిగినది. ఇప్పుడు ఎలా అయితే ప్రజలు కాంపాక్ట్ ఎస్యువి పైన మక్కువ చూపిస్తున్నారో, అదే విధంగా అప్పటిలో ప్రజలు ప్రీమియం హ్యాచ్బ్యాక్ ల పట్ల ఆశక్తి చూపే వారు.

అక్టోబర్ 26న మారుతీ వారు వారి బలెనో ని విడుదల చేయనున్నారు. ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ నెక్సా షోరూం లలో అందుబాటులో ఉంటుంది మరియూ ఇది నెక్సా లో లభించేటువంటి రెండవ కారు. జారువాలే బాడీ ఆకారం, వెనక్కి దువ్వినటువంటి ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ తో డే టైం రన్నింగ్ లైట్స్, తేలే పై కప్పు, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వంటివి బాహ్యంగా కనపడతాయి. లోపల ఆల్ బ్లాక్ ఇంకా వెండి మరియూ క్రోము పూతలు కలిగి ఉంటుంది. లోపల మరియూ బయట ఈ కారు యొక్క చిత్రాలను మీకోసం అందిస్తున్నాము. చూడండి మరియూ బలెనో పై మరిన్ని వివరాలకు చూస్తూనే ఉండండి.

జపనీస్ వాహన తయారీసంస్థ వారి కాన్స్పెట్లను రోడ్ పైకి తీసుకువచ్చేందుకు ముఖ్యంగా సుజికీ వంటి కార్లను తీసుకువచ్చేందుకు చాలా నేర్పుని కలిగి ఉంది. సుజికి కిజాషీ ఏ-స్టార్ రోడ్ పైకి ఎటువంటి కాన్స్పెట్ తో అయితే వచ్చిందో అలానే చిన్న చిన్న మార్పులు మాత్రమే చేయబడి ఫైనల్ గా రోడ్ పైకి తీసుకురావడం జరిగింది. మారుతీ యొక్క తాజా సమర్పణ కూడా అదే మార్గంలో రాబోతున్నది. బాలేనో బాహ్యబాగాలలో ముందరి వైపు 'వి 'ఆకారపు గ్రిల్, కొంతవరకూ ఫ్లోటింగ్ రూఫ్, పైకప్పు రూఫ్, రేర్ స్పాయిలర్ మరియు కొత్త సుజుకి అలాయిస్ ని కలిగి ఉంది. 2015 మారుతి సుజుకి బాలెనో ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగంలో సంస్థ యొక్క సరైన ఎంట్రీ. ఈ కారు హ్యుందాయ్ ఐ 20 మరియు హోండా జాజ్ వంటి వాటికి పోటీగా ఉండవచ్చు.

మారుతి అక్టోబర్ పండుగ నెలలో ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రీమియం హాచ్బ్యాక్ , వైఆర్ ఎ లేదా బాలెనో ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రారంభంతో నెక్సా షోరూం కి ఎస్-క్రాస్ తో పాటూ ఇంకొక కారు జోడించబడుతుంది. ఎస్-క్రాస్ హ్యుందాయి క్రెటా తో పోలిస్తే, ఇప్పటికీ తక్కువ సంఖ్యలో అమ్మకాలు జరుగుతుంది. ప్రీమియం హాచ్బ్యాక్ స్పేస్ లో, కూడా ఎలైట్ ఐ 20 మరియు హోండా జాజ్ అద్భుతంగా రాణిస్తున్నాయి. స్విఫ్ట్ దాని లక్షణాలతో వీటికి ఎప్పటికీ పోటీ కాదు. దీనిని పరిష్కరించేందుకు బాలేనో ఒక్కటే సమాధానం చెప్పగలదు. బాలేనో వాహనం ఎలైట్20 మరియు జాజ్ కి ఏ విధంగా సమాధానం చెప్పగలదో చూద్దాం.

గత ఏడాదిగా మారుతీ సంస్థ తనకి ఉన్న సాధారణ కారు తయారీదారి అనే పేరు నుండి ప్రీమియం వాహనతయారీదారిగా అనిపించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఎస్-క్రాస్ తరువాత, మారుతి 'బాలెనో' అనే ప్రీమియం హాచ్బాక్ ని తీసుకొని రావడానికి సిద్ధంగా ఉంది. కారు మొదట్లో జూన్ 2015 లో బహిర్గతం అయ్యింది మరియు పూర్తిగా ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో 2015 వద్ద ప్రపంచానికి బహిర్గతం అయ్యింది. అప్పటి నుండి అది భారత ఆటోమోటివ్ స్పేస్ లో ఒక ముఖ్యాంశంగా మారింది. కొనుగోలుదారులు ఆత్రంగా ఈ వాహనం కోసం ఎదురు చూస్తున్నారు.

అక్టోబర్ 26 కొరకు ఎక్కువ సమయం లేదు. ఆ రోజు బాలెనో ప్రారంభం కానున్నది. ఆ కారు ఇప్పటికే నడుపబడినది మరియు దాని యొక్క నిర్దేశాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఈ కారు స్విఫ్ట్ నుండి 1.2 లీటర్ పెట్రోల్ తో అమర్చబడి ఉంది. కానీ వింతగా 90PS కి బదులుగా అదే 1.3 లీటర్ 75PS డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉంది. ఇది ఒక విధంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం అని చెప్పవచ్చు. మొత్తం ప్రపంచంలో అందరూ బలమైన ఇంజిన్ లతో వాహనాలను రూపొందించాలని నిర్ణయించగా మారుతీ మాత్రం వింతగా తక్కువ శక్తిని అందించే వాహనాన్ని రూపొందిస్తుంది. కారు 1.6-లీటర్-ed పెట్రోల్ ఇంజిన్ ని కనీసం భారతదేశం కొరకు తీసుకోవలసినది.

అక్టోబరు 26న విడుదల అవుతున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మరుతి బలెనో కోసమై బుకింగ్స్ ఇప్పుడు రూ. 11,000 వద్ద మొదలు అయ్యాయి. ఈ బుకింగ్స్ ని అన్ని నెక్సా డీలర్‌షిప్ ల వద్ద స్వీకరిస్తారు.

మారుతీ వారు కొత్త తార రాబోతున్నందున, ఈ కొత్త హ్యాచ్ బ్యాక్ పైన ఆశలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ని నెక్సా అధికారిక వెబ్సైట్ లో ఆరంగ్రేటం చేయించనున్నారు. ఎస్-క్రాస్ తో పాటుగా ఇప్పుడు నెక్సా షోరూం లలో రెండు కార్లు అమ్మకానికి ఉంటాయి. ఈ కారు మొదట సుజుకీ వారిచే ఫ్రాంక్‌ఫర్ట్ IAA మోటర్ షోలో సెప్టెంబర్ 2015 న ప్రదర్శించారు. ఒక అనధికార విడుదల అక్టోబర్ 26న, 2015 లో మారుతి వారి సమర్పణల్లో వెల్లడించబడింది కానీ వెబ్సైట్ లో మాత్రం ఇంకా రాబోతోంది అనే కనిపిస్తొంది. ఈ కారు సుజుకీ యొక్క సరికొత్త వేదిక ఆధారంగా నిర్మించబడింది మరియూ ఇకపై రాబోయే YBA ఇంకా నెక్స్ట్-జెన్ స్విఫ్ట్ లు కూడా ఈ వేదిక ఆధారంగానే ఉంటాయి.

ఈమధ్యనే భారతదేశంలో తయారీ మొదలు పెట్టిన తరువాత వైఆరే అక్టోబర్ 26న దేశంలో విడుదలకు సిద్దం అయ్యింది. ఎలీట్ ఐ20 వచ్చే కాలంలోనే ఇది కూడా రావడంతో పోటీ కి ఇది మరింతగా సన్నద్దం అవ్వాలి. ఈ కారు మొన్న జరిగిన ఫ్రాంక్ఫర్ట్ ఆటో షో లో ప్రదర్శితమయ్యింది.

సుజుకి కొనసాగుతున్న 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో వైఈర్ఎ అనగా బాలెనో యొక్క ఆరంగేట్రం చేసింది. మిగిలిన ప్రపంచానికి అది కొత్త బాలెనో కాని భారతదేశంలో ప్రాముఖ్యత చెందని ఆ పేరు ని మారుతీ సంస్థ కొనసాగించదలుచుకోలేదు. ఎస్-క్రాస్ నుండి ఎస్ ఎక్స్4 ని తీసేసిన విధంగా ఈ బాలెనో పేరు ని మారుతీ సంస్థ కనసాగించదలుచుకోలేదు. వైఆర్ఎ యొక్క ప్రధాన ప్రత్యర్థి ఎలైట్ ఐ 20 అవ్వచ్చు. హ్యుండాయి కాకుండా ఇది విడబ్లు పోలో, ఫియట్ పుంటో ఈవో మరియు హోండా జాజ్ వంటి వాటితో కూడా పోటీ పడవచ్చు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి బాలెనో 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience