• English
    • Login / Register

    మారుతి సుజుకి బాలెనో రూ. 4.99 లక్షల ధర వద్ద ప్రారంభించబడినది

    మారుతి బాలెనో 2015-2022 కోసం akshit ద్వారా అక్టోబర్ 26, 2015 01:40 pm సవరించబడింది

    • 11 Views
    • 23 వ్యాఖ్యలు
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    డిల్లీ:

    మారుతి సుజికి ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రీమియం హ్యాచ్బ్యాక్ ని నేడు భారత మార్కెట్లోనికి రూ. 4.99 లక్షల ధర వద్ద ప్రారంభించింది. ఇది ఎస్-క్రాస్ తరువాత భారతదేశం యొక్క అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అందిస్తున్న రెండవ వాహనం. అదే నెక్సా ప్రీమియం డీలర్షిప్ల ద్వారా ప్రత్యేకంగా అమ్మకం అవుతుంది.

    ఒక దశాబ్దం క్రితం యొక్క సెడాన్ నుండి పేరుని తీసుకొని బాలెనో గా పిలవబడుతున్న వాహనం హ్యుందాయ్ ఐ 20 ఎలైట్, ఫోక్స్వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి వాటితో పోటీకి సిద్ధంగా ఉంది. ఈ ఉన్నత నిర్దేశాలు గల మోడల్ బెల్స్ మరియు విజిల్స్, ప్రొజెక్టర్లు మరియు పగటిపూట నడుస్తున్న లైట్లు, వాతావరణ నియంత్రణ సమాచారం, కలర్ టిఎఫ్టి స్క్రీన్, వెనుక పార్కింగ్ కెమెరా తో 7 అంగుళాల టచ్ స్క్రీన్, సాటిలైట్ నావిగేసహన్ వ్యవస్థ మరియు విభాగంలో మొదటి ఆపిల్ కార్ప్లే తో అందించబడుతున్నది.

    దీని పొడవు 3995mm, వెడల్పు 1745mm మరియు 1470mm ఎత్తు. ఈ వాహనం స్విఫ్ట్ యొక్క పొడవు 3,850mm మరియు వెడల్పు 1,695mm తో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఈ వాహనం యొక్క ఎంపికలు స్విఫ్ట్ తో సమానంగా ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్స్ 1.2 లీటర్ K12 ఇంజిన్ తో అమర్చబడి 83Bhp శక్తిని అందిస్తుంది. అయితే, డీజిల్ ఇంజిన్లు 1.3 DDiS డీజిల్ ఇంజిన్ తో 74Bhp శక్తిని అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు ఐదు స్పీడ్ గేర్బాక్సులతో జతచేయబడి ఉన్నాయి. అయితే పెట్రోల్ బాలెనో అదనంగా ఒక సివిటి ట్రాన్స్మిషన్ తో ఒక ఆటోమేటిక్ వేరియంట్లో ఉంది.

    మారుతి సుజుకి ఇతర కారుల వలే, బాలెనో అద్భుతమైన మైలేజ్ గణాంకాలు అందిస్తుంది. పెట్రోల్ మోడల్ 21.40Kmpl మైలేజ్ మరియు డీజిల్ మోడల్ ఈ విభాగంలో ఉత్తమంగా 27.39Kmpl మైలేజ్ ని అందిస్తుంది.

    పెట్రోల్ ధర(ఎక్స్-షోరూం)
    సిగ్మా   రూ. 4,99,000
    డెల్టా    రూ.  5,71,000
    జెటా   రూ.  6,31,000
    ఆల్ఫా    రూ. 7,01,000
    సివిటి   రూ. 6,76,000
     
    డీజిల్  ధర (ఎక్స్ షోరూం)
    సిగ్మా   రూ.  6,16,000
    డెల్టా   రూ.  6,81,000
    జెటా    రూ. 7,41,000
    ఆల్ఫా  రూ. 8,11,000

         

          
     
           

       

         

    was this article helpful ?

    Write your Comment on Maruti బాలెనో 2015-2022

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience