• English
  • Login / Register

బలేనో అలియాస్ YRA - అంతా కేవలం రూప సౌందర్యమేనా?

మారుతి వైఆరే కోసం nabeel ద్వారా అక్టోబర్ 01, 2015 03:33 pm ప్రచురించబడింది

  • 21 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చూపు తిప్పుకోని రూపం, ఆకర్షించే లక్షణాలు మరియూ వళ్ళు గగుర్పొడిచే ఉనికి. కాని, బలెనో అంతా కేవలం రూప సౌందర్యమేనా? పదండి చూద్దాం!

జైపూర్:

Maruti Suzuki Baleno

మారుతీ వారు భారతీయ మార్కెట్ కి అందించే తాజా కారు పై ఎంతగానో శ్రమించినట్టు తెలుస్తోంది. చూడటానికి బావుంటుంది, ప్రత్యేకంగా అనిపిస్తుంది మరియూ మారుతీ వారి కొత్త వేదికపై నిర్మించబడింది. ప్రీమియం క్రాస్ ఓవర్ అయిన S-క్రాస్ తరువాత ఈ వరుసలో ఇది మారుతీ వారి రెండవ ప్రయత్నం. S-క్రాస్ అంతగా విజయం సాధించనప్పటికీ కంపెనీ వారు బలెనో పై ఆశలు పెట్టుకున్నారు.

డిజైన్

మారుతీ బలెనో ఎంతో హుందాగా ఉంది. ముఖ్యమైన లక్షణాలలో కొత్త 'V' ఆకారం ముందు గ్రిల్లు కి క్రోము పూతలు మరియూ తయారీదారి ఇన్సిగ్నియా ఉంటుంది. ముందు బలిష్టమైన బంపర్ ఇంకా వనక్కి దువ్వినట్టు ఉండే హెడ్‌ల్యాంప్స్ ఈ కారుకి కొత్తదనం తీసుకు వస్తాయి.
డిజైన్ సుజూకీ సైలిలోనే ఉంటుంది మరియూ మారుతీ కారు కాదేమో అనే అనుమానం ఎవరికీ రాదు కానీ ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క ప్రవేశం వలన కొత్త డిజైన్ ని వెలుగులోకి తెస్తున్నారు. పక్క వైపు చూస్తే, సగం తేలుతూండే పై కప్పు కనబడుతుంది. ఇది కారుకి అధిక సొగసుని అందిస్తుంది.బలమైన వీల్ ఆర్చెస్, దీనికి ఉన్న స్పాయిలర్ మరియూ కొత్త సుజూకీ అల్లోయ్స్ కి అందం చేకూరుస్తుంది. కారు వెనుక భాగాన క్రోము పూత ఉండి రేర్ అద్దాల వరకు కొనసాగుతుంది. భారీ రేర్ బంపర్ వెనుక బూట్ తో సరిగ్గా విలీనం అయి ఉంటుంది. టెయిల్‌లైట్స్ చిన్నగా బావున్నాయి. క్లియర్ అద్దాలు మరియూ రెడ్ అద్దల కలయికతో టర్న్ ఇండికేటర్స్ జత చేయబడి ఉండి మధ్యలో ఇక 6 LED లు పైన ఉన్నాయి. మొత్తం మీద డిజైను తాజాగా ఉండి మారుతీ అభిమానులని మరియూ విమర్శకులని సైతం ఆకర్షిస్తుంది.

Maruti Suzuki Baleno

Maruti Suzuki Baleno

ఇప్పుడు ఈ కారు యొక్క డిజైన్ నుండి దీని పనితనం మరియూ సామర్ధ్యం చూద్దాము.a

ఇంజిను

బలెనో గంభీరంగా ఉంది కానీ ఇది కస్టమర్ల మనసుని దోచుకోగలదా అనేది ప్రశ్నార్ధకం. దీనికి 1.2-లీటరు పెట్రోల్ ఇంజును ఉండి 83bhp మరియూ 115Nm టార్క్ విడుదల చేస్తుంది. బలేనో కి పోటీదారి అయిన ఎలీట్ i20 కి కూడా ఇటువంటి లక్షణాలే ఉంటాయి. డీజిల్ వేరియంట్ కి 1.3-litre ఇంజిను ఉండి 90bhp మరియూ 200Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కారు కి సుజూకి యొక్క టెక్నాలజీ ఇంజిను స్టార్ట్-స్టాప్ ఫంక్షన్లు తో పాటు మెరుగైన మైలేజీని కూడా అందిస్తుంది. ఈ SHVS సియాజ్ 1595kgs బరువు ఉండి వీల్‌బేస్ తక్కువగా ఉంది కాబట్టి మైలేజీ 30 Kmpl ఉండవచ్చు.

Maruti Suzuki Baleno

అంతర్గతాలు & లక్షణాలు

బలెనో బయటే కాదు, లోపల కూడా ఉన్నతంగా ఉంటుంది. క్యాబిన్లో ఆల్-బ్లాక్ స్కీంతొ పాటు, స్తీరింగ్ వీల్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పై సిల్వర్ మరియూ క్రోము పూతలు ఉన్నాయి. ఇందులో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే ఇంఫొటెయిన్మెంట్ సిస్టము సియాజ్ లో మరియూ స్ క్రాస్ లో ఉన్నటువంటిది ఉంది మరియూ ఇది డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఉంటుంది. ఈ కారు నెక్సా షోరూముల్లో అందుబాటులో ఉంటుంది.

Maruti Suzuki Baleno

కారు విడుదల అయిన తరువాత దీని సామర్హ్యం మనకి తెలుస్తుంది. అది తప్ప, ఈ కారు అన్ని విధల పరిపూర్ణం.

was this article helpful ?

Write your Comment on Maruti వైఆరే

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience