మహీంద్రా థార్ కంటే అధిక బూట్ సామర్ధ్యాన్ని కలిగి ఉన్న మారుతి జిమ్నీ వాస్తవ బూట్ స్పేస్ ఆన్ؚలైన్ؚ చిత్రాలు
మారుతి జిమ్ని కోసం rohit ద్వారా ఏప్రిల్ 21, 2023 06:13 pm ప్రచురించబడింది
- 71 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రెండవ వరుస సీట్‌లను మడిస్తే ఐదు-డోర్‌ల జిమ్నీ బూట్ స్పేస్ సామర్ధ్యం 332 లీటర్‌లుగా ఉంటుంది
-
ఐదు-డోర్‌ల జిమ్నీని మారుతి ఆటో ఎక్స్ؚపో 2023లో ప్రదర్శించింది.
-
మూడు-డోర్‌ల మోడల్ؚతో పోలిస్తే ఇది పొడవైన వీల్ బేస్ మరియు రెండు అదనపు డోర్‌లను పొందుతుంది.
-
కొత్త చిత్రాలలో జిమ్నీ బూట్ స్పేస్ కేవలం ఒక జత లగేజ్ బ్యాగ్ؚలకు సరిపోతుందని చూడవచ్చు.
-
మహీంద్రా థార్‌తో పోలిస్తే జిమ్నీ అధిక బూట్ స్పేస్ؚను అందిస్తుంది (200 లీటర్‌ల కంటే తక్కువ).
-
రెండవ వరుసను మడిచినప్పుడు, దీని మూడు-డోర్‌ల వర్షన్ మరింత స్పేస్ؚను అందిస్తుంది.
-
ఇండియా-స్పెక్ మోడల్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను కలిగి ఉంటుంది; 4X4 ప్రామాణికంగా వస్తుంది.
-
ప్రారంభ ధర రూ.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.
ఎంతోకాలం వేచి ఉన్న తరువాత, మారుతి ఎట్టకేలకు సుజుకి ఐకానిక్ ఆఫ్‌రోడర్ జిమ్నీని భారతదేశానికి తీసుకురావాలని నిర్ణయించింది. ఆటో ఎక్స్ؚపో 2023లో దీన్ని ప్రదర్శించింది. మన మార్కెట్ؚకు మరింత అనుకూలంగా చేయడానికి, కారు తయారీదారు SUV వాస్తవికతను మెరుగుపరచేందుకు దీని వీల్ బేస్ؚను పొడిగించింది మరియు రెండు అదనపు డోర్‌లను కూడా అందిస్తుంది. భారతీయ కొనుగోలుదారులు చూసే మరొక ముఖ్యమైన అంశం కార్ బూట్ ఎంత స్టోరేజ్ సామర్ధ్యాన్ని అందిస్తుంది అనే విషయం. జిమ్నీ కోసం చూస్తుంటే, దీని బూట్ؚను చూపించే కొన్ని తాజా ఫోటోలు ఆన్ؚలైన్ؚలో విడుదలయ్యాయి, వీటిని చూడండి.
క్లెయిమ్ చేసిన గణాంకాలు Vs వాస్తవ దృశ్యం
రెండవ వరుస సీట్‌లను సాధారణంగా ఉంచినప్పుడు జిమ్నీ 208 లీటర్‌లు మరియు మాడిచినప్పుడు 332 లీటర్‌ల బూట్ స్పేస్ؚను అందిస్తుంది అని మారుతి ప్రకటించింది. స్పెసిఫికేషన్ పరంగా ఇది చాలా ఆకర్షణీయంగా కనిపించినా, వాస్తవానికి కొత్త చిత్రాలలో, కేవలం ఒక జత లగేజీ బ్యాగ్ؚలు మాత్రమే ఇందులో సరిపోతాయి అని చూడవచ్చు. సరైన విధంగా అమర్చినప్పటికీ, గరిష్టంగా మూడు లగేజీ బ్యాగ్ؚలను ఉంచడానికి మాత్రమే ఇది సరిపోతుంది.
ఇది కూడా చదవండి: 40 సంవత్సరాల తరువాత, మారుతి ‘800’ పేరు అధికారికంగా ఇకపై ఆల్టో 800 వద్ద ఉండదు
జిమ్నీ Vs థార్: ఏది ఎక్కువ స్పేస్ؚను అందిస్తుంది?
జిమ్నీ పోటీదారు అయిన మహీంద్రా థార్‌తో పోలిస్తే – మారుతి ఆఫ్‌రోడర్ బూట్ స్పేస్ పెద్దగా కనిపిస్తుంది. థార్ ఖచ్చితమైన లగేజీ సామర్ధ్యాన్ని మహీంద్రా వెల్లడించకపోయిన (200 లీటర్ కంటే తక్కువ ఉండవచ్చు) స్పేస్ మరియు వాస్తవికత పరీక్షలో, ఒక పెద్ద సైజు ట్రావెల్ బ్యాగ్ కూడా సరిపోదని తెలుస్తుంది. అయితే, ఆన్ؚలైన్ؚలో కనిపించిన చిత్రాలను బట్టి, ఇది జిమ్నీలో సాధ్యం కావచ్చు. SUVలు రెండూ 50:50 స్ప్లిట్-ఫోల్డింగ్ వెనుక సీట్‌లతో వస్తాయి కానీ పూర్తిగా క్రిందకి మాడచడానికి వీలు కాదు, ఇది ఉపయోగించగలిగే లగేజీ స్థలాన్ని తగ్గిస్తుంది.
ఇంజన్ మరియు డ్రైవ్ؚట్రెయిన్
ఇండియా-స్పెక్ జిమ్నీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో (103PS/134Nm) వస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా 4-స్పీడ్ ఆటోమ్యాటిక్ గేర్ బాక్స్ؚను కలిగి ఉంటుంది. నాలుగు-వీల్ డ్రైవ్ ట్రైన్ (4WD) ప్రామాణికంగా అందించబడుతుంది.
విడుదల మరియు ధర వివరాలు
మారుతి, జిమ్నీని మే నెలలో విడుదల చేయనుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.10-లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటుందని అంచనా. ఇది మహీంద్రా థార్ మరియు ఫోర్స్ గూర్ఖాలతో పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి : థార్ డీజిల్