• English
  • Login / Register

మారుతి జిమ్నీ Vs మహీంద్రా థార్ – ధర తనిఖీ

మారుతి జిమ్ని కోసం tarun ద్వారా జూన్ 08, 2023 05:44 pm ప్రచురించబడింది

  • 71 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఒకటి కుటుంబాలకు అనుకూలంగా ఉండే పెట్రోల్-ఆధారిత ఆఫ్-రోడర్ అయితే, రెండవది భారీగా, ఎక్కువ ధరతో డీజిల్ ఎంపికతో వస్తుంది. 

Maruti Jimny Vs Mahindra Thar - Price Check

మారుతి జిమ్నీ ధరలు ఇటీవల ప్రకటించారు, ఇది రూ.12.74 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభమవుతుంది. దీని ప్రధాన మరియు ప్రత్యక్ష పోటీదారు మహీంద్రా థార్ అని చెప్పవలసిన అవసరం లేదు. ఇవి రెండు సబ్-కాంపాక్ట్ ఆఫ్-రోడర్ వాహనాల అయినప్పటికీ, వీటి ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి మరియు ధరలలో వ్యత్యాసం ఉంది. 

4WD ప్రామాణికంగా కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే జిమ్నీని అందిస్తున్నారు కాబట్టి, దీని ధరలను థార్ పెట్రోల్-ఆధారిత 4WD వేరియెంట్‌లతో మాత్రమే పొలుస్తున్నాము. ఈ గణాంకాలు ఎలా ఉన్నాయో చూద్దాం: 

ధర తనిఖీ

మాన్యువల్ వేరియెంట్ؚలు

మారుతి జిమ్నీ

మహీంద్రా థార్ 

జెటా MT – రూ.12.74 లక్షలు

 

ఆల్ఫా MT – రూ.13.69 లక్షలు

AX (O) పెట్రోల్ MT సాఫ్ట్ టాప్ – రూ.13.87 లక్షలు

 

LX పెట్రోల్ MT హార్డ్ టాప్- రూ.14.56 లక్షలు

  • జిమ్నీ ప్రారంభ ధర థార్ కంటే సుమారు ఒక లక్ష తక్కువగా ఉంది. దీని టాప్-స్పెక్ పెట్రోల్-MT ఎంపిక కూడా మహీంద్రా థార్ కంటే చవకగా వస్తుంది, మరిన్ని ఫీచర్‌లను అందిస్తుంది.

Maruti Jimny front

  • జిమ్నీ 5-డోర్‌ల జెటా వేరియెంట్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ESP, హిల్ హోల్డ్ మరియు డిసెంట్ కంట్రోల్, రేర్ కెమెరా మరియు 7-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ؚ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

  • థార్ AX(O) పెట్రోల్-MT కంటే తక్కువగా, జిమ్నీ ఆల్ఫా 9-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమ్యాటిక్ AC, పుష్ బటన్ స్టార్ట్-స్టాప్, అలాయ్ వీల్స్, LED లైటింగ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ؚను అందిస్తుంది. దీనితో పోలిస్తే, థార్ కేవలం డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ؚలు, స్టీల్ వీల్స్, మాన్యువల్ AC మరియు సెంట్రల్ లాకింగ్ వంటి బేసిక్ ఫీచర్‌లతో వస్తుంది.

  • పోల్చి చూస్తే టాప్-స్పెక్ థార్ LXలో కూడా చిన్న సెంట్రల్ డిస్ప్లే, మాన్యువల్ AC, కేవలం రెండు ఎయిర్ బ్యాగ్ؚలు మరియు హాలోజెన్ హెడ్ؚలైట్ؚలతో వస్తుంది.

ఇది కూడా చదవండి: మారుతి జిమ్నీ vs మహీంద్రా థార్: చిత్రాల పోలికలు

  • అన్నిటికంటే ముఖ్యమైన పవర్‌ట్రెయిన్‌ల విషయానికి వస్తే. మారుతి సిరీస్‌లో సాధారంగా కనిపించే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో జిమ్నీ వస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ؚతో జోడించబడి 105PS పవర్ మరియు 134 Nm టార్క్‌ను అందిస్తుంది. థార్ 6-స్పీడ్ మాన్యువల్ؚకు జోడించిన 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో 152PS పవర్ మరియు 329Nmను టార్క్‌ను అందిస్తుంది. 

  • మరొక ప్రత్యేకమైన అంశం ప్రాక్టికాలిటీ, థార్‌తో పోలిస్తే జిమ్నీ చాలా ఆచారణాత్మకంగా ఉంటుంది. అధిక బూట్ మరియు వెనుక సీట్లకు సులభమైన యాక్సెస్ؚను జిమ్నీ కలిగి ఉంది. ఈ అంశం ఫ్యామిలీ-ఓరియెంటెడ్ కొనుగోలుదారులకు జిమ్నీని ఇష్టమైన ఎంపికగా చేస్తుంది. అయితే, రెండూ అధికారికంగా ఫోర్-సీటర్‌లుగా నిలుస్తున్నాయి.

Mahindra Thar ground clearance

  • థార్‌లో కాంపోజిట్ హార్డ్ టాప్ మరియు కన్వర్టబుల్ సాఫ్ట్ టాప్ రూఫ్ మధ్య ఎంచుకోవచ్చు. జిమ్నీ కేవలం మెటల్ రూఫ్ డిజైన్ؚతో మాత్రమే వస్తుంది.

  • థార్ కొనుగోలుదారులకు మరొక అనుకూలత డీజిల్‌పవర్ ట్రెయిన్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది, ఇది SUV మరియు ఆఫ్-రోడర్ ప్రియులకు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. డీజిల్ వేరియెంట్ؚల ధర రూ.14.44 లక్షలుగా ఉంది.

  • 4WD ప్రాధాన్యత కాకపోతే, రేర్-వీల్ డ్రైవ్ؚట్రెయిన్‌తో మహీంద్రా థార్ మరింత చవకైన ప్రత్యామ్నాయం. ఇందులో డీజిల్ పవర్ؚట్రెయిన్ ఎంపికను కూడా పొందవచ్చు మరియు ఎంట్రీ-లెవెల్ AX (O) RWD డీజిల్ ధర రూ.10.54 లక్షల నుండి ఉంటుంది, ఇది జిమ్నీ కంటే రూ.2.20 లక్షల కంటే తక్కువ.

ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚలు

మారుతి జిమ్నీ

మహీంద్ర థార్

జెటా AT – రూ. 13.94 లక్షలు

-

ఆల్ఫా AT – రూ. 14.89 లక్షలు

-

-

LX కన్వర్టబుల్ సాఫ్ట్ టాప్ – రూ. 16.02 లక్షలు

 

LX హార్డ్ టాప్- రూ. 16.10 లక్షలు

  • మహీంద్రా టాప్-స్పెక్ థార్ LXను పెట్రోల్-ఆటోమ్యాటిక్ పవర్‌ట్రెయిన్‌తో మాత్రమే అందిస్తుంది. అందువలన, ఇది టాప్-స్పెక్ పెట్రోల్-AT జిమ్నీ కంటే రూ.1.13 లక్షలు ఎక్కువ ధరను కలిగి ఉంది. అంతేకాకుండా, బేస్ స్పెక్ జిమ్నీ పెట్రోల్-AT రూ.2.08 లక్షల మార్జిన్ؚతో మరింత చవకైనది.

Maruti Jimny ground clearance

  • థార్ కంటే జిమ్నీలో అనేక ఫీచర్‌లు ఉన్నపటికి, పవర్‌ట్రెయిన్‌ల విషయంలో మారుతిలో ఉండే 4-స్పీడ్ల ఆటోమ్యాటిక్‌తో పోలిస్తే, థార్ؚ 6-స్పీడ్‌ల టార్క్ కన్వర్టర్ؚ మెరుగైనది.

  • ఇందులో కూడా, రూ.13.49 లక్షల ధరకు జిమ్నీ కంటే కొంత చవకగా వచ్చే థార్ RWD పెట్రోల్-AT ఎంపికతో లభిస్తుంది. థార్ డీజిల్-ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚల విషయానికి వస్తే, ఇవి రూ.16.68 లక్షల నుండి అధిక ధరను కలిగి ఉంది.

మొత్తం మీద, మారుతి జిమ్నీ మహీంద్రా ధార్ కంటే మరింత చవకైన మరియు ఆచరణాత్మకమైన పెట్రోల్-ఆధారిత 4x4 ఆఫ్-రోడర్. కానీ కన్వర్టబుల్ సాఫ్ట్ టాప్, మరింత పనితీరు మరియు డీజిల్ ఇంజన్ ఎంపిక కోరుకుంటే మీరు థార్ؚను ఎంచుకోవాలి. 

(అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు)

ఇక్కడ మరింత చదవండి: జిమ్నీ ఆటోమ్యాటిక్

was this article helpful ?

Write your Comment on Maruti జిమ్ని

1 వ్యాఖ్య
1
N
neeraj kumar
Jun 8, 2023, 5:18:19 PM

Over priced

Read More...
    సమాధానం
    Write a Reply

    explore similar కార్లు

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    • టాటా సియర్రా
      టాటా సియర్రా
      Rs.10.50 లక్షలుఅంచనా ధర
      సెపటెంబర్, 2025: అంచనా ప్రారంభం
    • కియా syros
      కియా syros
      Rs.9.70 - 16.50 లక్షలుఅంచనా ధర
      ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
    • బివైడి sealion 7
      బివైడి sealion 7
      Rs.45 - 49 లక్షలుఅంచనా ధర
      మార, 2025: అంచనా ప్రారంభం
    • M జి Majestor
      M జి Majestor
      Rs.46 లక్షలుఅంచనా ధర
      ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
    • నిస్సాన్ పెట్రోల్
      నిస్సాన్ పెట్రోల్
      Rs.2 సి ఆర్అంచనా ధర
      అక్ోబర్, 2025: అంచనా ప్రారంభం
    ×
    We need your సిటీ to customize your experience