Maruti Jimny మాన్యువల్ Vs ఆటోమ్యాటిక్: ఏది వేగవంతమైనది?
మారుతి జిమ్ని కోసం ansh ద్వారా డిసెంబర్ 15, 2023 01:54 pm ప్రచురించబడింది
- 119 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికతో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను జీమ్నీ పొందింది.
-
జీమ్నీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 105 PS మరియు 134 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది.
-
మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚలు రెండూ ఒకే పరిస్థితులలో పక్క పక్కనే పరీక్షించబడ్డాయి.
-
నిర్వహించిన పరీక్షలలో 0-100 kmph యాక్సెలరేషన్, క్వార్టర్ మైల్ రన్ మరియు బ్రేకింగ్ పనితీరు ఉన్నాయి.
-
మారుతి జిమ్నీ ధర రూ.10.74 లక్షల నుండి రూ.15.05 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
మారుతి జిమ్నీ ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైంది, ఇది మార్కెట్‌లో సరికొత్త ఆఫ్ రోడర్ మరియు మహీంద్రా థార్‌కు ప్రధాన పోటీదారు. ఈ 5-డోర్ SUV కేవలం ఒకే ఇంజన్ ఎంపికతో మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ రెండు ఎంపికలతో వస్తుంది. ఇటీవల, జీమ్నీ రెండు వేరియెంట్ؚలు మా వద్ద ఉండగా, ఈ రెండిటిలో వాస్తవ-పరిస్థితులలో దేని పనితీరు మెరుగ్గా ఉందో పరీక్షించడానికి పర్ఫార్మెన్స్ పరీక్షలను చేయాలని నిర్ణయించాము. అయితే ఫలితాలను చూసే ముందు, మారుతి జీమ్నీ పవర్ؚట్రెయిన్ వివరాలను పరిశీలిద్దాం.
స్పెసిఫికేషన్ |
|
ఇంజన్ |
1.5-లీటర్ పెట్రోల్ |
పవర్ |
105 PS |
టార్క్ |
134 Nm |
డ్రైవ్ؚట్రెయిన్ |
4WD (ప్రామాణికం) |
ట్రాన్స్మిషన్ |
5MT / 4AT |
పనితీరు: యాక్సెలరేషన్
టెస్ట్ؚలు |
జిమ్నీ మాన్యువల్ |
జిమ్నీ ఆటోమ్యాటిక్ |
0-100 kmph |
13.64 సెకన్‌లు |
15.73 సెకన్‌లు |
క్వార్టర్ మైల్ |
18.99 సెకన్‌లు @ 115.83 kmph |
19.79 సెకన్‌లు @ 111.82 kmph |
టాప్ స్పీడ్ |
126.46 kmph |
135.86 kmph |
నిర్వహించిన యాక్సెలరేషన్ టెస్ట్ؚలలో, మారుతి జిమ్నీ మాన్యువల్ వేరియెంట్, ఆటోమ్యాటిక్ వేరియెంట్‌తో పోలిస్తే మెరుగ్గా ఉంది, 0-100 kmphను 2 సెకన్‌లు వేగంగా అందుకుంది. క్వార్టర్ మైల్ రన్ؚలో రెండిటి మధ్య తేడా అంతగా లేదు, అయితే మాన్యువల్ వేరియెంట్ ముందుగా మరియు అధిక వేగంతో రన్ؚను పూర్తి చేసింది. టాప్ స్పీడ్ విషయంలో, టెస్టింగ్ పారామితులలో మాన్యువల్ వేరియంట్‌తో పోలిస్తే ఆటోమ్యాటిక్ ఎక్కువ అంకెను పొందింది.
టెస్ట్ؚలు |
జిమ్నీ మాన్యువల్ |
జిమ్నీ ఆటోమ్యాటిక్ |
ఇన్ గేర్ యాక్సెలరేషన్ |
30-80 kmph (3వ గేర్) - 10.27 సెకన్‌లు 40-100 kmph (4వ గేర్) - 19.90 సెకన్‌లు |
- |
కిక్ؚడౌన్ |
- |
20-80 kmph - 9.29 సెకన్‌లు |
మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚల గేర్ స్పీడ్ؚలు మరియు కిక్ డౌన్ؚల మధ్య పోలిక లేకపోయినా, మాన్యువల్ؚకు 3వ గేర్ؚలో 30 నుండి 80 kmph చేరుకోవడానికి పట్టే సమయం కంటే ఆటోమ్యాటిక్ؚకు 20 నుండి 80 kmph చేరడానికి పట్టే సమయం తక్కువ అనేది గమనార్హం. వీటి ఫలితాలను బట్టి, ఓవర్ టెక్ చేయడానికి అవసరమయ్యే వేగాన్ని ఆటోమేటిక్ వేరియంట్ త్వరగా పొందుతుంది అని చెప్పవచ్చు.
పనితీరు: బ్రేకింగ్
టెస్ట్ؚలు |
జిమ్నీ మాన్యువల్ |
జిమ్నీ ఆటోమ్యాటిక్ |
80-0 kmph |
43.94 మీటర్‌లు |
43.99 మీటర్‌లు |
100-0 kmph |
28.75 మీటర్‌లు |
28.38 మీటర్‌లు |
యాక్సెలరేషన్ టెస్ట్ؚలలో, రెండిటి మధ్య తేడాను గమనించవచ్చు, బ్రేకింగ్ టెస్ట్ؚలలో తేడా స్వల్పంగా ఉంది, జిమ్నీలో ముందు మాత్రమే డిస్ బ్రేక్ؚలు ఉన్నాయి, ఆటోమ్యాటిక్ కేవలం 10 కిలోలు ఎక్కువ బరువు ఉంది (కర్బ్ వెయిట్). 80-0 kmph టెస్ట్ؚలో, మాన్యువల్ వేరియెంట్ తక్కువ స్టాపింగ్ డిస్టెన్స్ؚను కలిగి ఉంది, అయితే కేవలం కొన్ని సెంటీమీటర్‌లు మాత్రమే తక్కువ. 100-0 kmph టెస్ట్ؚలలో, ఆటోమ్యాటిక్ వేరియెంట్ కొంత తక్కువ స్టాపింగ్ డిస్టెన్స్ؚను కలిగి ఉంది.
ఇది కూడా చదవండి: 5-డోర్‌ల మారుతి సుజుకి జిమ్నీ ఇండియా-స్పెక్ మరియు ఆస్టేలియా-స్పెక్ మధ్య 5 ముఖ్యమైన తేడాలు
గమనిక: వాహనం ఆరోగ్యం, భూభాగం, వాతావరణం మరియు టైర్ అరుగుదల వంటి కారకాలపై ఆధారపడి యాక్సెలరేషన్ మరియు బ్రేకింగ్ పనితీరు మారవచ్చు. అందువలన, ఒకే మోడల్ విభిన్న యూనిట్‌లతో కొంత భిన్నమైన ఫలితాలు రావచ్చు.
ధర
మారుతి జిమ్నీ ధర రూ.10.74 లక్షలు మరియు రూ.15.05 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది, ఆటోమ్యాటిక్ వేరియెంట్‌ల ధర రూ.13.94 లక్షలకు (ఎక్స్-షోరూమ్) ప్రారంభం అవుతుంది. ఇది ప్రస్తుతం రూ.2.3 లక్షల విలువైన బిగ్ ఇయర్-ఎండ్ డిస్కౌంట్ؚలతో లభిస్తోంది. ఈ సబ్ؚకాంపాక్ట్ ఆఫ్ؚరోడర్ మహీంద్రా థార్ మరియు ఫోర్స్ గూర్ఖాలతో పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: జిమ్నీ ఆన్ؚరోడ్ ధర
0 out of 0 found this helpful