Maruti Invicto: ఇప్పుడు రేర్ సీట్ బెల్ట్ రిమైండర్ؚను ప్రామాణికంగా పొందనున్న మారుతి ఇన్విక్టో
మారుతి ఇన్విక్టో జెటా+ వేరియెంట్‌లో ప్రస్తుతం రేర్ సీట్ బెల్ట్ రిమైండర్ؚను రూ.3,000 అదనపు ధరకు ప్రామాణికంగా అందిస్తున్నారు.
-
టయోటా ఇన్నోవా హైక్రాస్ నుండి వచ్చిన ఇన్విక్టోను మారుతి జూలై 2023లో విడుదల చేసింది.
-
ఇది జెటా+ మరియు ఆల్ఫా+ అనే రెండు విస్తృత వేరియెంట్ؚలుగా అందించబడుతుంది.
-
ఈ MPV విడుదల సమయం నుండి ఆల్ఫా+లో ఈ భద్రత ఫీచర్ ఉంది.
-
జెటా+ వేరియెంట్ భద్రత కిట్ؚకు ఇతర మార్పులు ఏవీ చేయలేదు.
-
ఈ MPV కొత్త ధరలు రూ.24.82 లక్షల నుండి రూ.28.42 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) పరిధిలో ఉంటాయి.
టయోటా ఇన్నోవా హైక్రాస్ నుండి వచ్చిన మారుతి ఇన్విక్టోను పరిచయం చేసిన కొన్ని రోజుల తరువాత, భారతదేశపు అతి పెద్ద కారు తయారీదారు ప్రస్తుతం తమ అత్యంత ఖరీదైన MPVలో వెనుక సీట్ బెల్ట్ రిమైండర్‌ను అందిస్తోంది, ఇది ఎంట్రీ-లెవెల్ జెటా+ వేరియెంట్‌లో కూడా ఉంటుంది. ఇన్విక్టో విడుదలైనప్పటి నుండి ఈ ఫీచర్ టాప్ ఆల్ఫా+ వేరియెంట్ؚలో లభిస్తోంది.
వర్తింపు మరియు ధర సమీక్ష
తాజా భద్రత సాంకేతికత జోడింపు మారుతి MPV రెండవ మరియు మూడవ వరుస సీట్లు రెండిటికీ వర్తిస్తుంది. జెటా+ వేరియెంట్ؚల (7 మరియు 8 సీటర్ؚలు రెండిటిలో లభిస్తుంది) ధరలు రూ.3,000 స్వల్పంగా పెరిగాయి.
ఇతర భద్రత ఫీచర్‌లు
మారుతి జెటా+ వేరియెంట్ భద్రత ఫీచర్‌లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ప్రయాణీకులు అందరికి 3-పాయింట్ సీట్ బెల్ట్ؚలు, ఆటో-హోల్డ్ؚతో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజీలతో వస్తుంది.
360-డిగ్రీల కెమెరా, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు వెనుక డీఫాగర్ ప్రస్తుతానికి ఆల్ఫా+ వేరియెంట్ؚకు మాత్రమే పరిమితం అయ్యాయి.
ఇది కూడా చదవండి: మారుతి ఇన్విక్టో జెటా ప్లస్ Vs టయోటా ఇన్నోవా హైక్రాస్ VX: ఏ హైబ్రిడ్ MPVని ఎంచుకోవాలి?
ధరలు మరియు పోటీదారులు
సవరించిన ఇన్విక్టో ధర రూ.24.82 లక్షల నుండి రూ.28.42 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉన్నాయి. దీని ఏకైక ప్రత్యక్ష పోటీదారు టయోటా ఇన్నోవా హైక్రాస్, అయితే కియా క్యారెన్స్ మరియు టయోటా ఇన్నోవా క్రిస్టా దీని కంటే దిగువ స్థాయిలో ఉంటాయి.
ఇది కూడా చదవండి: మరింత చల్లదనం కోరుకునే వారికి: రూ.30 లక్షల కంటే తక్కువ ధరలో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ؚతో వచ్చే కార్‌లు
ఇక్కడ మరింత చదవండి: ఇన్విక్టో ఆటోమ్యాటిక్