Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

జూలై నాటికి ఆవిష్కరించనున్న ‘మారుతి’ ఇన్నోవా హైక్రాస్

టయోటా ఇన్నోవా హైక్రాస్ కోసం tarun ద్వారా ఏప్రిల్ 28, 2023 01:53 pm ప్రచురించబడింది

ఇది మారుతి నుండి వస్తున్న రెండవ బలమైన-హైబ్రిడ్ ఎంపిక మరియు ADAS భద్రత సాంకేతికత కలిగిన మొదటి వాహనం

  • మారుతి తన ఇన్నోవా హైక్రాస్ వెర్షన్ؚను జూలైలో విడుదల చేయనుంది.

  • ఇది పనోరమిక్ సన్ؚరూఫ్, 10-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, మరియు రాడార్-ఆధారిత భద్రత సాంకేతికత, ADASలను కలిగి ఉంటుంది.

  • బలమైన-హైబ్రిడ్ ఎంపికతో హైక్రాస్ 2-లీటర్‌ల పెట్రోల్ ఇంజన్ؚను ఉపయోగిస్తుంది, ఇది 21.1kmpl మైలేజ్‌ను క్లెయిమ్ చేస్తుంది.

  • ధర సుమారు రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయని అంచనా.

అధిక డిమాండ్ కారణంగా, ఇన్నోవా హైక్రాస్ టాప్-స్పెక్ మోడల్‌ల బుకింగ్ؚను టయోటా ఇటీవల నిలిపివేసింది. ఇప్పటికే వేచి ఉండాల్సిన సమయం 12 నెలల కంటే ఎక్కువగా ఉంది. విచారించకండి, ఈ MPV మారుతి వెర్షన్ కూడా త్వరలోనే, బహుశా జూలైలోనే రానుంది.

ఇటీవల జరిగిన కంపెనీ వార్షిక ఆర్ధిక ఫలితాల సదస్సులో, మారుతి సుజుకి ఛైర్మన్, ఆర్‌సి భార్గవ, మాట్లాడుతూ “మేము టయోటా నుండి ఒక వాహనాన్ని సోర్స్ చేయనున్నాము, ఇది 3-వరుసల బలమైన హైబ్రిడ్ మరియు ధర విషయంలో అగ్ర స్థానంలో ఉన్న వాహనం. పరిమాణం పెద్దది కాకపోయినప్పటికీ, ఇది మార్గదర్శి అవుతుంది,” అన్నారు. ఈ బలమైన-హైబ్రిడ్ MPV సుమారుగా వచ్చే రెండు నెలల్లో అమ్మకానికి సిద్దంగా ఉంటుంది అని ఆయన తెలిపారు.

ఇన్నోవా హైక్రాస్-ఆధారిత MPV టయోటా-బ్యాడ్జ్ కలిగిన మొదటి మారుతి వాహనంగా నిలుస్తుంది, మారుతి MPV, హైక్రాస్ స్పెసిఫికేషన్‌లను, పవర్ؚట్రెయిన్ؚలు, ట్రాన్స్ؚమిషన్, మరియు బలమైన-హైబ్రిడ్ సాంకేతికలను ఉపయోగించనుంది. గ్రాండ్ విటారా మరియు హైరైడర్ కూడా తమ ప్లాట్ؚఫార్మ్ֶలు మరియు పవర్‌ట్రెయిన్ؚలను పంచుకున్నాయి.

ఇది కూడా చదవండి: టయోటా ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ Vs హైబ్రిడ్: ఎలక్ట్రిఫైడ్ MPV ఎంత ఎక్కువ పొదుపు చేస్తుంది?

మారుతి MPV పనోరామిక్ సన్‌రూఫ్, 10-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు మరియు పవర్డ్ రెండవ-వరుస ఒట్టోమాన్ సీట్లతో సహా ఇన్నోవా ప్రీమియం ఫీచర్‌ల లిస్ట్ؚను పొందనుంది. భద్రతను ADAS (అడ్వాన్సెడ్ డ్రైవర్ ఆసిస్టెన్స్ సిస్టమ్), ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, మరియు 360-డిగ్రీల కెమెరా కవర్ చేస్తాయి. మారుతి MPV, ఇన్నోవాకు సరిపోలిన ఫీచర్ల జాబితాను పొందుతుంది.

టయోటా ఇన్నోవా హైక్రాస్ 2-లీటర్‌ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚను ఉపయోగిస్తుంది, ఇందులో బలమైన-హైబ్రిడ్ సాంకేతికత ఎంపిక కూడా ఉంటుంది. బలమైన-హైబ్రిడ్ వేరియెంట్‌లు 21.1kmpl వరకు ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తాయి. ప్రామాణిక పెట్రోల్ ఇంజన్ కోసం CVT ట్రాన్స్ؚమిషన్ ప్రామాణికం, అయితే హైబ్రిడ్ వేరియెంట్‌లు e-CVTని పొందుతాయి. మారుతి MPVలో కూడా ఇదే ప్లాట్ఫార్మ్ మరియు ఇంజన్ؚను చూడవచ్చు.

ఇది కూడా చదవండి: EVలు Vs బలమైన-హైబ్రిడ్‌లు: మీరు దేనిని ఎంచుకోవాలి?

ఇన్నోవా హైక్రాస్ ధర రూ.19.40 లక్షల నుండి రూ.29.72 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంటుంది. మారుతి వెర్షన్ ధర కూడా రూ.20 లక్షల వద్ద ప్రారంభం అవుతుందని అంచనా. ఇన్నోవా విధంగానే, మారుతి MPVకి కూడా దాని టయోటా సహచర వాహనాన్ని మినహాయించి ప్రత్యక్ష పోటీ ఏదీ ఉండదు.

ఇక్కడ మరింత చదవండి: టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆటోమ్యాటిక్

t
ద్వారా ప్రచురించబడినది

tarun

  • 61 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన టయోటా ఇనోవా Hycross

Read Full News

explore మరిన్ని on టయోటా ఇన్నోవా హైక్రాస్

ట్రెండింగ్‌లో ఉందిఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.10.44 - 13.73 లక్షలు*
Rs.10.52 - 19.67 లక్షలు*
Rs.2 - 2.50 సి ఆర్*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర