జిమ్నీని ప్రదర్శించిన కొంత కాలంలోనే 15,000 కంటే ఎక్కువ బుకింగ్ؚలను అందుకున్న మారుతి

published on ఫిబ్రవరి 06, 2023 10:21 am by rohit for మారుతి జిమ్ని

 • 41 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ వాహనం మే నెల నాటికి రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) అంచనా ప్రారంభ ధరతో మార్కెట్ؚలోకి రానుంది.

Maruti Jimny

 • మారుతి ఈ ఐదు-డోర్‌ల జిమ్నీని 2023 ఆటో ఎక్స్ؚపోలో ప్రదర్శించింది. 
 • మూడు-డోర్‌ల వేరియెంట్‌తో పోలిస్తే, ఈ SUV అదనంగా రెండు డోర్‌లను, పొడవైన వీల్ؚబేస్ؚను పొందింది. 
 • గరిష్ట బుకింగ్ؚలను అందుకున్న వేరియెంట్ లేదా గేర్ؚబాక్స్ ఎంపిక గురించి వివరాలు అందుబాటులో లేవు. 
 • జిమ్నీ రెండు వేరియెంట్‌లు జెటా మరియు ఆల్ఫా నెక్సా షోరూమ్ؚల ద్వారా విక్రయించబడతాయి. 
 • 5-స్పీడ్ MT, 4-స్పీడ్ AT మరియు 4WDలు ప్రామాణికంగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తాయి. 
 • ప్రామాణిక ఫీచర్‌లలో టచ్ؚస్క్రీన్, ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP) ఉన్నాయి. 

మారుతి సుజుకి ఎట్టకేలకు, ఎంతగానో-ఎదురుచూస్తున్న అంతర్జాతీయ వాహనం అయిన జిమ్నీని ఈ సంవత్సరం భారతదేశానికి తీసుకువచ్చింది. దీన్ని ఆటో ఎక్స్ؚపో 2023లో ప్రదర్శించి, బుకింగ్ؚలను కూడా ప్రారంభించింది. ఇప్పటికే ఈ SUV కోసం 15,000 కంటే ఎక్కువ ప్రీ-ఆర్డర్‌లు మారుతి అందుకుంది. 

Maruti Jimny side

అంతర్జాతీయ-స్పెక్ జిమ్నీ ప్రపంచవ్యాప్తంగా మూడు-డోర్‌ల వాహనంగా విక్రయించబడుతుండగా, మారుతి సుజుకి భారత దేశ మార్కెట్‌లో దీన్ని కేవలం ఐదు-డోర్‌ల వేరియెంట్ؚగా, నెక్సా షోరూమ్ؚల ద్వారా విక్రయిస్తుంది. అదనపు డోర్‌లు ఉన్నా కూడా, ఈ SUV నాలుగు మీటర్‌ల కంటే తక్కవ ఎత్తు ఉన్న వాహనం కాబట్టి తక్కువ పన్ను అర్హత ఉంటుంది. జిమ్నీ లో అందించబడిన  పొడుగైన వీల్ؚబేస్ వెనక కూర్చునే ప్రయాణీకులకు మరింత లెగ్ రూమ్ؚను, సరైన బూట్ؚను ఇస్తుంది, తద్వారా ఇది భారతీయ కొనుగోలుదారుల కోసం అనే భావనను కలిగిస్తుంది. 

Maruti Jimny cabin

ఈ వాహనం రెండు వేరియెంట్ؚలలో లభిస్తుంది: జెటా మరియు ఆల్ఫా. ఇది టచ్ؚస్క్రీన్ సిస్టమ్ (ఎంట్రీ-స్థాయి జెటాలో ఏడు-అంగుళాల యూనిట్), వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMలు (బయటివైపు రేర్ వ్యూ అద్దం), ఆరు ఎయిర్ బ్యాగులు, మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం(ESP)లను ప్రామాణికంగా పొందుతుంది. టాప్-స్పెక్ ఆల్ఫా తొమ్మిది-అంగుళాల ఇన్ఫోటైన్ؚమెంట్, ఆటో AC, వాషర్ؚతో ఆటో-LED హెడ్‌లైట్‌లు, మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి కొన్ని ప్రత్యేకమైన ఫీచర్‌లతో వస్తుంది. 

సంబంధించినది: మీ మారుతి జిమ్నీని మినీ జి-వాగన్ؚగా మార్చే టాప్ 5 కిట్లు ఇక్కడ అందించబడ్డాయి

ఇండియా-స్పెక్ జిమ్నీని సింగిల్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో అందిస్తున్నారు, ఇది 105PS/134Nmగా పవర్, టార్క్‌లను అందిస్తుంది. ఫోర్-వీల్ డ్రైవ్ ట్రెయిన్ (4WD) ప్రామాణికంగా అందించబడుతున్న, మీరు ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ లేదా నాలుగు-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ ఎంపికని పొందవచ్చు. ముందుగా పొందిన ఆర్డర్‌లలో ఏ వేరియెంట్ లేదా ట్రాన్స్ؚమిషన్ ఎంపిక అత్యంత ప్రజాదరణ పొందింది అనేది వెల్లడించలేదు.

Maruti Jimny rear

రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఈ సంవత్సరం మే నెలలో మారుతి జిమ్నీని విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ఈ వాహనం ప్రస్తుత మహీంద్రా థార్ మరియు ఫోర్స్ గూర్ఖాలతో పోటీ పడుతుంది, ఈ రెండిటి సొంత ఐదు-డోర్‌ల వర్షన్‌లను త్వరలోనే రానున్నాయి. 

ఇది కూడా చదవండి: మారుతి జిమ్నీ కోసం వేచి ఉండాలా లేదా దాని పోటీదారులలో దేనినైనా ఎంచుకోవడం మంచిదా?

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి జిమ్ని

Read Full News
space Image

trendingకాంక్వెస్ట్ ఎస్యూవి

 • లేటెస్ట్
 • ఉపకమింగ్
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience