Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మారుతి ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్ - తెలుసుకోవలసిన 5 విషయాలు

మారుతి ఎర్టిగా 2015-2022 కోసం khan mohd. ద్వారా మే 15, 2019 10:01 am ప్రచురించబడింది

ఇది వి వేరియంట్ ఆధారంగా రూపాంతరం చెందింది దీని ధర వి వేరియంట్ కంటే రూ 14,000- 17,000 ఎక్కువ ధరను కలిగి ఉంది

దీపావళిలో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు రెండో తరం మారుతి ఎర్టిగా సిద్ధంగా ఉంది. అవుట్గోయింగ్ ఎంపివి యొక్క స్టాక్స్ను క్లియర్ చేయటానికి కార్ల తయారీదారుడు సిద్దంగా ఉన్నారు. ఇటీవలే లిమిటెడ్ ఎడిషన్ అని పిలవబడే ఎర్టిగా ను రూ 7.88 లక్షల (ఎక్స్-షోరూమ్ జైపూర్) ధర ట్యాగ్లో కాస్మెటిక్లీ -ఎన్హాన్స్డ్ వెర్షన్ను విడుదల చేసింది. మీరు స్పెషల్ ఎడిషన్ ఎంపివి గురించి తెలుసుకోవలసిన ఐదు విషయాలు ఇక్కడ ఉన్నాయి.

1.బాహ్య మార్పులు

పై చిత్రపటం: రూఫ్ మౌంటెడ్ వెనుక స్పాయిలర్

మారుతి ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్ వెలుపల తక్కువ మార్పులను పొందుతుంది. వీటిలో రూఫ్ మౌంటెడ్ రేర్ స్పాయిలర్ మరియు క్రోమ్ సైడ్ మౌల్డింగ్ వంటి అంశాలు ఉన్నాయి. జెడ్ వేరియంట్, క్రోమ్ ముగింపును కలిగిన ఫాగ్ లాంప్ లు మరియు 15 అంగుళాల అల్లాయ్ చక్రాలను కూడా కలిగి ఉంది, ఇవి ఎంపివి జాబితాలోని ఇతర భాగాలలో వాస్తవ అంశాలు. చివరిది కానీ ముఖ్యమైనది ఎమిటంటే, ఇది 'లిమిటెడ్ ఎడిషన్' బ్యాడ్జ్ను కూడా పొందుతుంది.

పైన చిత్రపటం: 10 స్పోక్ అల్లాయ్ చక్రాలు

2. కొత్త రంగు ఎంపికలు

ఎర్టిగా యొక్క సాధారణ వెర్షన్ ఐదు రంగు ఎంపికలతో అందుబాటులో ఉంది అవి వరుసగా (సిల్వర్, తెలుపు, నలుపు, నీలం మరియు పెర్ల్ బ్లూ) లలో లభ్యమవుతుంది, లిమిటెడ్ ఎడిషన్ మూడు రంగులలో మాత్రమే అందుబాటులో ఉంది - అవి వరుసగా మెరూన్, బూడిద రంగు మరియు తెలుపు. ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్కు మెరూన్ మరియు బూడిద పెయింటింగ్ ఎంపికలు ప్రత్యేకమైనవి.

3. ఇంటీరియర్

ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్ యొక్క సెంట్రల్ కన్సోల్, ఏసి వెంట్స్ మరియు డోర్- సైడ్ ఆర్మ్ రిస్ట్ ల బోర్డర్ లలో వుడెన్ ఇన్లేస్ పొందు పరచబడి ఉంటాయి. సీటు కవర్లు, తెల్ల పైపింగ్ తో ముదురు ఎరుపు / మెరూన్ షేడ్ లో అందించబడతాయి. అంతేకాకుండా ఇది ఒక ద్వంద్వ టోన్ స్టీరింగ్ కవర్ ను కూడా పొందుతుంది.

పైన చిత్రపటం: ముదురు రంగు సీటు కవర్లు

పైన చిత్రపటం: కేంద్ర కన్సోల్ లో వుడెన్ ఇన్లేస్

4. ఇంజిన్

ఇంజిన్ డిపార్ట్మెంట్లో ఎటువంటి మార్పు లేదు మరియు ఇది ఒక 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ లను కలిగి ఉంది. ముందుగా 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, 93 పిఎస్ పవర్ ను మరియు 130 ఎన్ ఎం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది లేదా 67 పిఎస్ పవర్ ను మరియు 200 ఎన్ ఎ ం గల టార్క్ లను ఉత్పత్తి చేసే 1.3 లీటర్ డీజిల్ మోటర్ ను కలిగి ఉంటుంది. రెండు ఇంజిన్లు ప్రామాణికమైన 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జత చేయబడతాయి. అయితే, పెట్రోల్ ఇంజిన్, 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ తో కూడా జత చేయబడి ఉంటుంది.

రాబోయే 2018 ఎర్టిగా ఇటీవల భారతదేశంలో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పరీక్షించబడింది. ఇక్కడ దాని గురించి మరింత చదవండి.

5. ధర

మారుతి ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్ పెట్రోల్ వెర్షన్, 7.88 లక్షల రూపాయలతో అందుబాటులో ఉంది, అదే డీజిల్ వెర్షన్ రూ. 9.76 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్ జైపూర్) ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇది వి వేరియంట్ కంటే రూ. 14,000 నుండి రు. 17,000 వరకు ఎక్కువ ధర తేడా తో అందుబాటులో ఉంది. అదనపు ధరతో, లిమిటెడ్ ఎడిషన్ దాని వెనుక స్పాయిలర్ మరియు అల్లాయ్ చక్రాలను కలిగి ఉంది. డ్రైవర్ సీట్ల ఎత్తు సర్దుబాటు, వెనుక డిఫోగ్గర్ మరియు వెనుక వైపర్ / వాషర్ వంటి లక్షణాలు జెడ్ వేరియంట్ లో ప్రామాణికంగా అందించబడతాయి, ఈ అంశాలు లిమిటెడ్ ఎడిషన్లో అందించబడటంలేదు. ఇది ఈ వేరియంట్ శ్రేణిలో అగ్ర స్థానంలో ఉన్న వేరియంట్ కంటే రూ 60,000 తక్కువ ధరను కలిగి ఉంది.

ఈ సంవత్సరం పండుగ సీజన్లో మారుతి సుజుకి రెండో తరం ఎర్టిగాని ప్రారంభిస్తుంది మరియు అప్పటి వరకు మీ కొనుగోలును ఆపగలిగితే, మీరు కొత్త మోడల్ కోసం వెళ్లాలని సూచిస్తున్నాము. ఇది కొత్త ప్లాట్ఫారమ్పై ఆధారపడి ఉంటుంది మరియు మీరు కొత్త ఇంజిన్ల సమితిని కూడా పొందవచ్చు. మేము ఫీచర్ జాబితా ముందు కంటే మరింత విస్తృతమైన అంశాలు కలిగి ఉంటుందని భావిస్తున్నాము. అయినప్పటికీ, ఇది అవుట్గోయింగ్ మోడల్పై స్వల్ప ప్రీమియం వద్ద ధరకే ఉంటుంది. ఈ సంవత్సరం ఏప్రిల్లో ఇండోనేషియాలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనున్న రెండవ తరం ఎంపివి ఏ ఏ అంశాలతో రాబోతుందో ఆలోచించండి: మారుతి ఎర్టిగా ఫస్ట్ లుక్ చిత్రాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

మరింత చదవండి: మారుతి ఎర్టిగా రోడ్ ధర

k
ద్వారా ప్రచురించబడినది

khan mohd.

  • 21 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మారుతి ఎర్టిగా 2015-2022

S
srikanth
Apr 12, 2020, 9:33:05 PM

Maruti Ertiga Desiel vehicle version BS6 Launch or Not this year....

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర