• English
  • Login / Register

మారుతి బలెనొ వారు నెక్సా వెబ్సైట్ లో ఆరంగ్రేటం చేయనున్నారు

మారుతి బాలెనో 2015-2022 కోసం nabeel ద్వారా అక్టోబర్ 06, 2015 01:18 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Maruti Baleno on Nexa Website

మారుతీ వారు కొత్త తార రాబోతున్నందున, ఈ కొత్త హ్యాచ్ బ్యాక్ పైన ఆశలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ని నెక్సా అధికారిక వెబ్సైట్ లో ఆరంగ్రేటం చేయించనున్నారు. ఎస్-క్రాస్ తో పాటుగా ఇప్పుడు నెక్సా షోరూం లలో రెండు కార్లు అమ్మకానికి ఉంటాయి. ఈ కారు మొదట సుజుకీ వారిచే ఫ్రాంక్‌ఫర్ట్ IAA మోటర్ షోలో సెప్టెంబర్ 2015 న ప్రదర్శించారు. ఒక అనధికార విడుదల అక్టోబర్ 26న, 2015 లో మారుతి వారి సమర్పణల్లో వెల్లడించబడింది కానీ వెబ్సైట్ లో మాత్రం ఇంకా రాబోతోంది అనే కనిపిస్తొంది. ఈ కారు సుజుకీ యొక్క సరికొత్త వేదిక ఆధారంగా నిర్మించబడింది మరియూ ఇకపై రాబోయే YBA ఇంకా నెక్స్ట్-జెన్ స్విఫ్ట్ లు కూడా ఈ వేదిక ఆధారంగానే ఉంటాయి.

Maruti Baleno Side

కారుకి పెట్రోల్ మరియూ డీజిలు ఆప్షన్లు ఉన్నాయి మరియూ డీజిల్ వాటికి SHVS హైబ్రీడ్ టెక్నాలజీ తో అనుసంధానం చేసిన డీజిల్ ఇంజిను కలిగి ఉంటుంది. పెట్రోల్ కి 1.2-లీటర్ VTVT ఇంజిను ఉండి ఇది 83bhp మరియూ 115Nm టార్క్ ని విడుదల చేస్తుంది. డీజిల్ ఇంజిను 1.3-లీటర్ DDiS200 యూనిట్ గా ఉండి 90bhp ఇంకా 200Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది. దీనికి SHVS టెక్నాలజీ ఉండి దాదాపు 30Kmpl మైలేజీ ఇవ్వగలదు. బలెనో కి ఆల్-బ్లాక్ స్కీం ఇవ్వబడింది మరియూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా స్టీరింగ్ వీల్ పై క్రోము పూత వేయబడి ఉంటుంది. ఈ హ్యాచ్ బ్యాక్ లో సియాజ్ మరియూ ఎస్ క్రాస్ నుండి పునికి తెచ్చుకున్న 7-అంగుళాల స్మార్ట్‌ప్లే ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టము ఉంటుంది. బయటవైపు బలెనో కొత్త డిజైన్ తో రానుంది. ఈ మారుతి సుజూకీ ఆధారిత డిజైన్ కి ముందు గ్రిల్లు పై 'V' ఆకారం, సగం తేలాడే పై కప్పు, జారు వాలే రూఫ్ లైన్, రేర్ స్పాయిలర్ ఇంకా కొత్త సుజూకి అల్లోయ్స్ ఇవ్వబడతాయి.

was this article helpful ?

Write your Comment on Maruti బాలెనో 2015-2022

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience