• English
    • Login / Register

    మారుతి బాలెనో 70,000 బుకింగ్స్ సాధించింది,నిరీక్షణ కాలం 6-నెలలు

    మారుతి బాలెనో 2015-2022 కోసం cardekho ద్వారా జనవరి 27, 2016 05:29 pm ప్రచురించబడింది

    • 13 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    మారుతి సుజుకి అందిస్తున్న తాజా ప్రీమియం హ్యాచ్బ్యాక్, బాలెనో తప్పనిసరిగా సంస్థ కోసం ఒక బ్లాక్ బస్టర్ గా నిరూపించబడుతుంది. ప్రారంభం అయిన నాలుగు నెలల్లోనే ఈ కారు వినియోగదారులు మధ్య ఒక విశిష్ట కోరికను సృష్టించింది మరియు ఇప్పటిదాకా దాదాపు 70,000 బుకింగ్స్ ఆర్జించింది. i20 వాహనం యొక్క అమ్మకాలను కొల్లగొట్టిన బాలెనో వాహనం డిసెంబర్ 2015 నెలలో హ్యుందాయ్ ఐ 20 మరియు హోండా జాజ్ ల అమ్మకాలను అధిగమించింది. గత నెల, మారుతి బాలెనో వాహనం 11,203 యూనిట్లు ఉత్పత్తి చేసింది మరియు 10,572 యూనిట్లు అమ్మకాలు చేసి హ్యుందాయ్ ఐ 20 (10,379) యూనిట్లు ని అగ్ర స్థానంలో నుండి తొలగించి టాప్ సెల్లింగ్ ప్రీమియమ్ హాచ్బాక్ గా మారుతుంది.

     

    ఇటీవలి నివేదికల ప్రకారం మారుతి అధికారులు బాలెనో కి సంబంధించి ఎటువంటి స్పందనను ఊహించలేదని తెలుస్తుంది మరియు వారు ప్రొడక్షన్ విభాగంతో సంప్రదించి ఉత్పత్తులను తొందరగా చేసే విధంగా ఉన్నారు. ఎంత త్వరితం చేసినా సరే ఆరు నెలల ఈ నిరీక్షణ కాలం తగ్గేలా లేదు. 

    దీని డిమాండ్ ని అదే విధంగా ఉంచడం కార్ల తయారీదారులు ఈ నెల తరువాత బాలెనో ఎగుమతి ప్రారంభించాలని యోచిస్తున్నారు. నివేధికల ప్రకారమ బాలెనో జపాన్, పశ్చిమ యూరోప్, లాటిన్ అమెరికా మరియు కొన్ని ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. 

    మారుతి సుజుకి బాలెనో ధరలు ఈ నెల పెంచింది మరియు ఈ కారు యొక్క అధిరోహించబడిన ధరలు రూ. 5.11 లక్షల నుంచి రూ. 8.16 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) పరిధిలో ఉంటాయి. అయితే ఇది డిమాండు ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియాల్సి ఉంది. ఈ ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ మారుతి బాలెనో RSని రాబోయే ఆటో ఎక్స్పో కి తీసుకొని వచ్చేందుకు సిద్ధంగా ఉంది. బాలెనో RSఫాక్స్ డిఫ్యూజర్ , శరీరం కిట్, సైడ్ స్కర్ట్స్ మరియు అలాయ్ వీల్స్ వంటి లక్షణాన్ని కలిగి ఉంది. 

    ఇంకా చదవండి మారుతి బాలెనో బూస్టర్ జెట్ ని ఈ సంవత్సరం పోస్ట్-IAE 2016 షోకేస్ లో ప్రారంభించవచ్చు.

    was this article helpful ?

    Write your Comment on Maruti బాలెనో 2015-2022

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience