మహింద్రా XUV500 అమ్మకాలు 1.5 లక్షల మార్క్ ని దాటాయి
మహీంద్రా ఎక్స్యూవి500 కోసం sumit ద్వారా అక్టోబర్ 05, 2015 05:06 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మహింద్రా & మహింద్రా లిమిటెడ్ వారు (M & M) 500 1,50,000 యూనిట్ల అమ్మకాలు ( ఎగుమతులతో కలిపి) అందుకుంది అని కంపెనీ వారు ప్రకటించారు. చిరుత పులి ఆధారంగా తయారయిన ఎస్యూవీ కేవలం నాలుగు ఏళ్ళలో ఈ మైలురాయి దాటడం గర్వకారణం.
ఈ వాహనం మహింద్రా వారి ప్రపంచ వ్యాప్త రీసర్చ్ & డెవలప్‌మెంట్ సదుపాయం చెన్నై లోని మహింద్రా రీసర్చ్ వ్యాలీ (MRV) లో ఉంది. విడుదల దగ్గర నుండి, కొత్త పుంతలు తొక్కుతూ సామర్ధ్యం మెరుగు పరుచుతూ మంచి సురక్షణ కూడా అందిస్తూ వస్తున్నారు.
మహింద్రా & మహింద్రా లిమిటెడ్ కి ప్రెసిడెంట్ మరియూ చీఫ్ ఎగ్జెక్యూటివ్ అయిన ప్రవీన్ షా వారి మాటల్లో," ఇది మాకు ఒక గొప్ప అనుభవం. ఇది జరగడానికి తోడ్పడిన మా కస్టమర్లు అందరికి ధన్యవాదాలు," అని తెలిపారు.
" ఈ XUV500 ఒక మైలురాయిని దాటడం మాకు గర్వంగా ఉంది. ఈ విజయం సాధించడానికి సహాయపడిన మా కస్టమర్లకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ విజయం XUV500 యొక్క ప్రాచుర్యాన్ని పెంచుతుంది," అని అన్నారు.
ఈ విజయం ఈమధ్య 5 లక్షల సంచిత అమ్మకాలు మహింద్రా స్కార్పియో వారు సాధించిన సందర్భంగా జరిగింది.