2018 మహీంద్రా XUV500 ఫేస్ లిఫ్ట్: వేరియంట్స్ వివరణ
మహీంద్రా ఎక్స్యూవి500 కోసం dhruv attri ద్వారా మార్చి 12, 2019 10:05 am ప్రచురించబడింది
- 26 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మహీంద్రా సంస్థ 2018 XUV500 ఫేస్‌లిఫ్ట్ యొక్క బేస్ వేరియంట్ ధరను రూ.37,000 తగ్గించింది. ఈ SUV ప్రస్తుతం రూ.12.32 లక్షల నుంచి రూ.18.98 లక్షల రూపాయల(ఎక్స్-షోరూమ్,ముంబై) ధరను కలిగి ఉంది. ఇది ఇప్పటికి కూడా ఐదు డీజిల్ వేరియంట్స్ మరియు పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ఎంపికతో అందుబాటులో ఉంది. కానీ డీజిల్ వేరియంట్స్ నామకరణాలు W5, W7, W9, W11 మరియు W11 (O) కు మార్చబడ్డాయి. ఇక్కడ దాని ధరల యొక్క వివరాలు వివరించబడ్డాయి.
వేరియంట్ |
MT |
AT |
W5 |
రూ. 12.32 లక్షలు |
|
W7 |
రూ. 13.58 లక్షలు |
రూ. 14.78 లక్షలు |
W9 |
రూ.15.23 లక్షలు |
రూ. 16.43 లక్షలు |
W11 |
రూ. 16.43 లక్షలు |
రూ. 17.63 లక్షలు |
W11(O) |
రూ. 16.68 లక్షలు |
రూ. 17.88 లక్షలు |
W11(O)AWD |
రూ. 17.78 లక్షలు |
రూ. 18.98 లక్షలు |
పెట్రోల్ G AT |
రూ. 15.43 లక్షలు |
ఇప్పుడు మాకు ధరల గురించి తెలుసు,అయితే ప్రతీ వేరియంట్ ఏ లక్షణాలను కలిగి ఉంది మరియు అవి డబ్బుకి న్యాయం చేయగలవా?? పదండి తెలుసుకుందాం.
మహీంద్రా XUV500 ఫేస్ లిఫ్ట్ W5: బేస్ వేరియంట్
W5 |
రూ. 12.32 లక్షలు |
ముఖ్యమైన లక్షణాలు
- R17 స్టీల్ వీల్స్
- సిల్వర్ గ్రిల్ ఇన్సర్ట్
- రూఫ్ రెయిల్స్
- డ్యుయల్ ఎయిర్బాగ్స్
- EBD తో ABS
- మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ
- 6-వే డ్రైవర్ అడ్జస్టబుల్ సీటు
- టిల్ట్ స్టీరింగ్
- ఫాలో-హోమ్-ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్
- పవర్ సర్దుబాటు ORVM
- బ్లాక్ మరియు గ్రే ఇంటీరియర్స్
- రిమోట్ తో ఫ్లిప్ కీ
- USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో 6 ఇంచ్ టచ్‌స్క్రీన్
- మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు
- పవర్ విండోస్
- వాష్ మరియు వైప్ తో వెనుక డెమిస్టర్
- ఫ్లాట్ ఫోల్డబుల్ సీట్లు
ఈ బేస్ వేరియంట్ మంచి లక్షణాల జాబితాతో లోడ్ చేయబడి ఉంది.ఈ వేరియంట్ ఎక్కువగానే అవసరమైన లక్షణాలను కలిగి ఉంది, కానీ ఈ ధరకు మీరు ఆశించే కొన్ని అవసరమైన లక్షణాలు అయినటువంటి స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ మరియు స్మార్ట్ కీ వంటి వాటిని కలిగి లేదు. మీరు టైట్ బడ్జెట్లో ఉన్నట్లయితే మాత్రమే ఈ వేరియంట్ ఎంపిక చేసుకోండి. అయితే ఎవరైతే ఆటోమెటిక్ వేరియంట్ కొనుగోలు చేసుకొనేందుకు చూస్తున్నారో మరియు బడ్జెట్ ని అంతవరకూ కొనసాగించగలరో వారికి W7 వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది.
మహీంద్రా XUV500 ఫేస్ లిఫ్ట్ W7: మంచి అవసరాలను మరియు కోరికలను తీర్చగలిగే వేరియంట్
W5 పై అదనపు వ్యయం |
రూ .1.26 లక్షలు |
రూ.14.78 లక్షలు (AT) |
- పుష్ బటన్ స్టార్ట్-స్టాప్
- పాసివ్ కీలెస్ ఎంట్రీ
- GPS, వీడియో ప్లేబ్యాక్, ఆండ్రాయిడ్ ఆటో, ఎకోస్సెన్స్, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ, వాయిస్ కమాండ్ మరియు బ్లూస్సెన్స్ యాప్ తో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్
- స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
- LED DRL లతో స్టాటిక్ బెండింగ్ ఆటో హెడ్ల్యాంప్స్
- ఆర్కమ్య్స్ ట్యూనెడ్ స్పీకర్లు
- రెయిన్ సెన్సింగ్ వైపర్స్
- క్రూజ్ కంట్రోల్
- పార్క్ అసిస్ట్
- ఇంబిల్ట్ కంపాస్ మరియు E-మాన్యువల్
- గ్లాస్ ఎంబెడెడ్ యాంటెన్నా
- ఆటో క్లైమేట్ కంట్రోల్
- టాన్ మరియు బ్లాక్ ఇంటీరియర్స్
- క్రోం గ్రిల్ ఇన్సర్ట్లు
- కన్వర్సేషన్ మిర్రర్
- ఐసీ బ్లూ ఆంబియంట్ లైటింగ్
- ఎమర్జెన్సీ కాల్ ఫంక్షన్
W7 వేరియంట్ అవసరాలు మరియు కోరికలను తీర్చే ఖచ్చితమైన వేరియంట్ గా ఉంటుంది. ఇది లోపల క్యాబిన్ అనుభవాన్ని మరింతగా పెంచే సౌకర్యవంతమైన మరియు సదుపాయమైన లక్షణాలు అయినటువంటి పాసివ్ కీలెస్ ఎంట్రీ, స్టార్ట్-స్టాప్ బటన్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్లైమేట్ కంట్రోల్ వంటి వాటిని కలిగి ఉంది. అయితే, LED DRLs, రెయిన్ సెన్సింగ్ వైపర్స్,యాంబియంట్ లైటింగ్ మరియు గ్రిల్ పై క్రోమ్ ఇన్సర్ట్స్ ఇవన్నీ కూడా XUV500 ఒక ప్రీమియం SUV అని గుర్తు చేసేలా ఉన్నాయి. ఇంకా దీనిలో పెద్ద 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ ఉండి విస్తృతమైన కనెక్టివిటీ ఎంపికలు మరియు లక్షణాలను అందుకుంటుంది. W7 వేరియంట్ W5 కంటే అధనంగా రూ.1.26 లక్షల ధరను కలిగి ఉంది, కానీ దీనికి ఉంటే అధనపు లక్షణాలను పరిగణలోనికి తీసుకుంటే ఈ అధనపు ధర న్యాయమే అనిపిస్తుంది. మేము ఇప్పటికీ W7 లో స్టీల్ వీల్స్, టెలిస్కోపిక్ స్టీరింగ్ మరియు పవర్-ఫోల్డబుల్ వెలుపల రేర్వ్యూ మిర్రర్స్ చూడటానికి ఇష్టపడుతున్నాము. అయితే ఈ లక్షణాలన్నీ ఆటోమేటిక్ వేరియంట్ లో లభ్యమవుతున్నాయి. అయితే ఆటోమెటిక్ వేరియంట్ W7 మాన్యువల్ వేరియంట్ పై అదనంగా రూ.1.20 లక్షలు డబ్బుని కలిగి ఉంది.
మహీంద్రా XUV500 ఫేస్ లిఫ్ట్ W9: గర్వించదగ్గ వేరియంట్
W7 పై అదనపు వ్యయం |
రూ. 1.65 లక్షలు |
రూ. 1.65 లక్షలు |
- యంటీ పించ్ తో ఎలక్ట్రిక్ సన్రూఫ్
- వాయిస్ మెసేజింగ్ సిష్టం
- టైర్ ప్రజర్ మోనిటరింగ్ సిష్టం
- డ్రైవర్ వన్ టచ్ డౌన్ విండో
- 8-వే డ్రైవర్ సీటు సర్దుబాటు
- టెలిస్కోపిక్ స్టీరింగ్
- పవర్-ఫోల్డింగ్ ORVM లు
- 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్
- రోలోవర్ మిటిగేషన్ తో ESP
- హిల్ హోల్డ్ మరియు హిల్ డెసెంట్ కంట్రోల్
- ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
ఇది కొన్ని అధనపు భద్రతా లక్షణాలు అయినటువంటి ఎలక్ట్రిక్ సన్రూఫ్, వాయిస్ మెసేజ్ సిస్టమ్ మరియు 8-వే డ్రైవర్ సీట్ అడ్జస్ట్ తో టైర్ ప్రజర్ మోనిటరింగ్ సిష్టం వంటి వాటిని కలిగి ఉంది. ఇవి అన్నీ మంచి లక్షణాలే కానీ అంతగా అవసరమైనవి మాత్రం కావు. అయితే 1.65 లక్షల ధర ప్రీమియం వద్ద W9 కేవలం అధిక ధరను మాత్రమే కలిగి ఉంది మరియు మొదటి రెండు వేరియంట్స్ వలే ఎక్కువ విలువను అందించదు. దీని బదులుగా మీరు మీ బడ్జెట్ ని ఇంకా కొంచెం పెంచుకొని W11 వేరియంట్ ని తప్పనిసరిగా చూడాలి.
మహీంద్రా XUV500 ఫేస్ లిఫ్ట్ W11: అద్భుతమైన లక్షణాలతో లోడ్ అయ్యింది
W9 పై అదనపు వ్యయం |
రూ.1.20 లక్షలు |
రూ.1.20 లక్షలు |
- ORVM పై లోగో ప్రొజెక్షన్
- కనెక్టెడ్ యాప్స్
- బ్రేక్ ఎనర్జీ రీజెనరేషన్
- డైమండ్ 18-ఇంచ్ అల్లాయ్ చక్రాలు (O)
- AWD (O)
- క్విల్టెడ్ లెదర్ సీట్లు
- డాష్బోర్డ్ మరియు డోర్ ట్రిమ్లలో సాఫ్ట్ టచ్ లెదర్
- విండో క్రోమ్ లైన్స్
- అల్యూమినియం పెడల్స్
- సైడ్ మరియు కర్టెన్ ఎయిర్బాగ్స్
- డ్రైవర్ వన్ టచ్ అప్ విండో
- హైడ్రాలిక్ సహాయంతో బోనెట్
- పడ్డుల్ ల్యాంప్స్
- క్యాంపింగ్ ల్యాంప్స్
XUV500 ఫేస్ లిఫ్ట్ యొక్క W11 వేరియంట్ రూ.1.20 లక్షల అదనపు ధరల వద్ద మీరు ఒక ప్రీమియమ్ SUV నుండి ఎటువంటి లక్షణాలను కోరుకుంటారో అటువంటి లక్షణాలన్నిటిని కలిగి ఉంది. మరో రూ.25,000 W11(O) వెర్షన్ లో మీకు మెషిన్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. మరొక రూ 1.10 లక్షల ఖర్చు పెడితే మీకు AWD(ఆల్ వీల్ డ్రైవ్) సిష్టం వస్తుంది. W11 వేరియంట్ కొనుగోలు చేయడం వలన ఇది ఆరు ఎయిర్బాగ్లను పొందుతుంది, కానీ ఇదే ఆప్ష్నల్ వేరియంట్ కోసం చెప్పలేము, ఎందుకంటే అది కేవలం భిన్నమైన శైలిలో అలాయ్ వీల్స్ ని మాత్రమే కలిగి ఉంది,ఇది ప్రతి కొనుగోలుదారు యొక్క షాపింగ్ జాబితాలో ఉండకపోవచ్చు.
మహీంద్రా XUV500 ఫేస్ లిఫ్ట్ పెట్రోల్ G AT: పెట్రోల్ ఆప్షన్ తో మాత్రమే ఉంది
పెట్రోల్ G AT |
రూ. 15.43 లక్షలు |
- లోగో ప్రొజెక్షన్
- వాయిస్ మెసేజింగ్ సిష్టం
- టైర్ ప్రజర్ మానిటరింగ్ సిష్టం
- ESP
- హిల్ హోల్డ్ మరియు హిల్ డెసెంట్
- ఫ్రంట్ ఫాగ్‌ల్యాంప్స్
- 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్
- 8-వే డ్రైవర్ సీటు అడ్జస్ట్
- టెలిస్కోపిక్ స్టీరింగ్
- పవర్ ఫోల్డబుల్ ORVM
- డ్రైవర్ ఎక్స్ప్రెస్ విండో
- 1 వ మరియు 2 వ వరుస లో రీడింగ్ ల్యాంప్
పెట్రోల్ G AT వేరియంట్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే లభిస్తుంది మరియు దాని మొత్తం పరికర జాబితాను W7 వేరియంట్ తో పంచుకుంటుంది. పైన పేర్కొన్నవి G వేరియంట్లో అదనంగా లభించే లక్షణాలు.
మా అభిప్రాయం ప్రకారం, XUV500 W7 పోటీ ధర వద్ద గొప్ప లక్షణాల మిశ్రమాన్ని కలిగి ఉండి అత్యంత విలువను అందిస్తుంది. ఒకవేళ మీరు XUV500 ని పెట్రోల్ లో కావాలనుకుంటే మాత్రం మీకు ఘ్ ఆట్ ఒకటే ఎంచుకొనేందుకు ఉంది. ఆసక్తికరంగా, పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్స్ రెండింటికీ ఉన్న సామర్ధ్యం ఒకటే అందువల్ల డబ్బులో పెద్ద తేడా ఏమీ రాదు.కాబట్టి చాలా తక్కువగా వాహనాన్ని నడిపే వారు G AT వేరియంట్ ను ఎంచుకోవచ్చు. మేము ముంగించే ముందు, XUV500 యొక్క వివరణలను చూద్దాం.
ఇంజిన్ |
e-VGT తో 2.2 లీటర్ డీజిల్ |
2.2-లీటరు పెట్రోల్ |
డిస్ప్లేస్మెంట్ |
2179cc |
2179cc |
ట్రాన్స్మిషన్ |
6-స్పీడ్ మాన్యువల్ / 6 స్పీడ్ AT |
6-స్పీడ్ AT |
పవర్ |
155PS |
140PS |
టార్క్ |
360Nm |
320Nm |
సామర్థ్యం |
16kmpl |
16kmpl |
కొలతలు (LxWxH) (mm) |
4585x1890x1785 |
వీల్బేస్ (mm) |
2700 |
గ్రౌండ్ క్లియరెన్స్ (mm) |
200 |
ఇంధన సామర్థ్యం (లీటర్) |
70 |
0 out of 0 found this helpful