మహీంద్రా XUV300 vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్ vs ఫోర్డ్ ఎకోస్పోర్ట్ vs హోండా WR-V: వాస్తవిక ప్రంపంచంలో పోలికలు
మహీంద్రా ఎక్స్యూవి300 కోసం dhruv attri ద్వారా ఏప్రి ల్ 17, 2019 04:00 pm ప్రచురించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
- XUV300 కారు బాగా వెడల్పుగా ఉంటుంది మరియు పొడవైన వీల్ బేస్ ని కలిగి ఉంటుంది, అయితే WR-V కారు పొడవైనది మరియు ఎకోస్పోర్ట్ ఎత్తైనదిగా పేపర్ మీద ఉంది.
- మహింద్రా XUV300 మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లకి ముందర వరుస స్థలం చాలా బాగుంటుంది, దీని తరువాత స్థానం WR-V మరియు నెక్సాన్ దక్కించుకుంటాయి.
- మారుతి విటారా బ్రెజ్జా క్యాబిన్ నెక్సాన్ కారు యొక్క క్యాబిన్ కి ఇంచుమించు దగ్గరగా ఉంటుంది, కానీ బ్రెజ్జా క్యాబిన్ కొంచెం వెడల్పుగా ఉంటుంది.
- వెనుకాతల వరుస యొక్క స్థలం నెక్సాన్ లో చాలా బాగుంటుంది, దాని తరువాత స్థానం WR-V తీసుకుంటుంది.
మేము ఇటీవలే మహీంద్రా XUV300 ను పరీక్షించాము, దాని యొక్క వాస్తవిక ప్రదర్శనల సంఖ్యను దాని యొక్క పోటీదారులతో పోల్చి చూశాము. ఏదైతే ఈ SUV లలో అత్యంత విశాలమైనది మరియు సౌకర్యవంతమైన క్యాబిన్ ను అందిస్తుందని తెలుసుకొనేందుకు ఇప్పుడు మనకి సమయం వచ్చింది.
ముందుకు వెళ్ళే ముందు మనం ఒకసారి ఈ SUV ల యొక్క కొలతలు చూద్దాము. తరువాత ఈ చుక్కలు అన్నీ కలిపి మరియు ఒకవేళ బయట కొలతలు పెద్దగా ఉంటే, అంతర్గత స్థలం కూడా పెద్దగా ఉంటుందనే భావనకి కలుస్తుందా లేదా అనేది తెలుసుకుందాం.
కొలతలు (mm) |
మహీంద్రా XUV300 |
మారుతి విటారా బ్రెజ్జా |
టాటా నెక్సన్ |
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ |
హోండా WR-V |
పొడవు |
3995 |
3995 |
3994 |
3998 |
3999 |
వెడల్పు |
1821 |
1790 |
1811 |
1765 |
1734 |
ఎత్తు |
1627 |
1640 |
1607 |
1647 |
1601 |
వీల్బేస్ |
2600 |
2500 |
2498 |
2519 |
2555 |
బూట్ స్పేస్ |
259 |
328 |
350 |
352 |
363 |
పొడవైనది: హోండా WR-V
విశాలమైనది: XUV300
ఎత్తైనది: ఫోర్డ్ ఎకోస్పోర్ట్
అత్యధిక వీల్బేస్: XUV300
అతిపెద్ద బూట్: హోండా WR-V
సంఖ్యల ప్రకారం, XUV300 విశాలమైనది మరియు అత్యధిక వీల్ బేస్ కలిగి ఉంది - కానీ అది మంచి క్యాబిన్ స్థలానికి అనువదిస్తోందా? అంతర్గత కొలతలు చూస్తే దీనికి సమాధానం దొరుకుతుంది.
ముందరి వరుస స్థలం :
కొలతలు (mm) |
మహీంద్రా XUV300 |
మారుతి విటారా బ్రజ్జా |
టాటా నెక్సన్ |
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ |
హోండా WR-V |
లెగ్రూమ్ (మిని-మాక్స్) |
935-1110 |
890-1060 |
900-1050 |
955-1105 |
925-1055 |
నీ(మోకాలు)రూమ్ (మిని-మాక్స్) |
575-805 |
570-740 |
580-770 |
635-825 |
525-750 |
సీట్ బేస్ పొడవు |
495 |
480 |
480 |
495 |
490 |
సీట్ బేస్ వెడల్పు |
480 |
520 |
510 |
495 |
505 |
సీటు బ్యాక్ ఎత్తు |
645 |
595 |
615 |
610 |
580 |
హెడ్ రూం (మినీ మాక్స్ ఫర్ డ్రైవర్) |
885-975 |
950-990 |
965-1020 |
870-1005 |
900-920 |
క్యాబిన్ వెడల్పు |
1370 |
1410 |
1405 |
1320 |
1400 |
(ఫోర్డ్ ఎకోస్పోర్ట్)
ఎకోస్పోర్ట్ మరియు XUV300 రెండూ కూడా ఒకే విధంగా అత్యంత లెగ్రూం మరియు నీ(మోకాలు) రూం అందిస్తున్నాయి. నెక్సాన్ మరియు విటారా బ్రెజ్జా కి లెగ్ రూం మరియు నీ(మోకాలు) రూం ఒకే విధంగా ఉంటాయి మరియు సీట్ బేస్ పొడవు మరియు వెడల్పు కూడా ఒకేలా ఉంటాయి.
(టాటా నెక్సాన్)
హోండా WR-V నెక్సాన్ కంటే మెరుగైన లెగ్రూం అందిస్తుంది, కానీ నెక్సాన్ కారు అధిక నీ(మోకాలు) రూం ని అందిస్తుంది. సీటు బేస్ పొడవు ప్రకారం తొడ క్రింద భాగంలో సపోర్ట్ అన్ని కార్లలో ఒకే మాదిరిగా ఉంటుంది, అయితే దేనికైతే నెక్సాన్ లాగా విస్తృతమైన లోవర్ బాడీ కలిగి ఉంటుందో వారికి ఇది బాగా అనుకూలంగా ఉంటుంది,తరువాత స్థానం WR-V తీసుకుంటుంది.
(మహీంద్రా XUV300)
XUV300 యొక్క ముందు వరుస సీట్లు అన్నిటి కన్నా పొడవాటి సీట్ బ్యాకు ఎత్తు కలిగి ఉంటుంది, దీనివలన ఇది పెద్ద దేహం కలిగి ఉన్న ప్రయాణీకులకు బాగా సరిపోతుంది. WR-V చిన్నదైన సీటు బ్యాక్ కలిగి ఉంది, కాబట్టి పొడవైన ప్రయాణీకులు దానిలో తగినంత బ్యాక్ సౌకర్యాన్ని పొందలేరు. హెడ్‌రూం విషయానికి వచ్చినప్పుడు, టాటా నెక్సాన్ లో ఇది అత్యధికంగా ఉంటుంది, తర్వాత స్థానాలలో ఎకోస్పోర్ట్, విటారా బ్రెజ్జా, XUV300 మరియు WR-V లు ఉంటాయి.
(హోండా WR-V)
ఈ SUV లలో మొదటి వరుసలో డ్రైవర్ మరియు ప్రయాణీకుడికి సరిపోయేటట్టు చూస్తాయి, ఇది విటారా బ్రెజ్జా, నెక్సాన్ మరియు WR-V కి ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే వీటిలో పొడవైన కాబిన్ వెడల్పు ఉండడం వలన.
(విటారా బ్రెజ్జా)
వెనుక వరుస స్థలం
కొలతలు (mm) |
మహీంద్రా XUV300 |
మారుతి విటారా బ్రజ్జా |
టాటా నెక్సన్ |
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ |
హోండా WR-V |
షోల్డర్ రూం |
1330 |
1400 |
1385 |
1225 |
1270 |
హెడ్ రూం |
925 |
950 |
970 |
930 |
940 |
నీ(మోకాలు)రూమ్ (మిని-మాక్స్) |
600-830 |
625-860 |
715-905 |
595-890 |
740-990 |
సీట్ బేస్ పొడవు |
445 |
460 |
510 |
480 |
480 |
సీట్ బేస్ వెడల్పు |
1320 |
1300 |
1220 |
1230 |
1270 |
సీటు బ్యాక్ ఎత్తు |
650 |
600 |
610 |
610 |
570 |
నెక్సాన్ కారు ఉత్తమమైన హెడ్రూం, తొడ క్రింద భాగంలో మద్దతు అందిస్తుంది మరియు మోకాలి రూం లో అన్ని 5 కార్ల కంటే ఉత్తమంగా అందిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ముగ్గురు ప్రయాణికులని కూర్చో పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అతి తక్కువ సీట్ బేస్ వెడల్పు కలిగి ఉంటుంది.
మారుతి విటారా బ్రెజ్జ అన్నికంటే అత్యధిక షోల్డర్ రూం ని అందిస్తూ మరియు రెండవ ఉత్తమ సీటు బేస్ వెడల్పు అందిస్తున్న కారణంగా మిగిలిన వాటితో పోలిస్తే ముగ్గురుని సులభంగా కూర్చోబెట్టవచ్చు. ఇది మెరుగైన నీ రూం తో పాటు రెండవ ఉత్తమ హెడ్ రూం ని కలిగి ఉంది. సీట్ బేస్ పొడవు మరియు బ్యాక్ రెస్ట్ ఎత్తు దాని ప్రత్యర్థులతో సమానంగా ఉంటుంది, కాబట్టి 6-అడుగుల పొడవు గల ప్రయాణికులకు మంచి తొడ క్రింద భాగంలో మద్దతు మరియు బ్యాక్ సపోర్ట్ ని ఇస్తుందని ఊహించవచ్చు.
మూడవ ఉత్తమమైన షోల్డర్ రూం XUV300 లో ఉంది. కాని దాని హెడ్‌రూం చాలా తక్కువగా ఉంది. పొడవైన వీల్ బేస్ కలిగి ఉన్నప్పటికీ, నీ(మోకాలు) రూం మరియు సీటు బేస్ పొడవు తక్కువగా ఉన్నాయి, దీని ఫలితంగా ఇది తక్కువ తొడ మద్దతును అందిస్తుంది. ఇదిలా ఉండగా సీటు బేస్ మరియు బ్యాక్‌రెస్ట్ సంఖ్యలు అత్యధికంగా ఉండడం వలన, ఇది మిగిలిన వాటి కంటే ముగ్గురు ప్రయాణీకులు సులభంగా కూర్చొనేందుకు సహాయపడుతుంది.
షోల్డర్ రూం దగ్గరకి వచ్చినప్పుడు హోండా WR-V కారు ఎకోస్పోర్ట్ కన్నా మెరుగైనదిగా ఉంటుంది, అయితే ఇది నెక్సాన్ మరియు XUV కంటే చాలా తక్కువగా ఉంటుంది. దీని లోపల హెడ్‌రూం టాటా మరియు మారుతి తరువాత మూడవ స్థానంలో ఉత్తమంగా ఉంటుంది, నీ(మోకాలు) రూం విషయానికి వస్తే మాత్రం WR-V అన్నిటినీ చిత్తు చేస్తుంది. హోండా లో సీటు బేస్డ్ ఎకోస్పోర్ట్ లానే పొడవు పెద్దదిగా ఉంటుంది, అయితే ఇది వెడల్పులో XUV తరువాత రెండవదిగా ఉంటుంది. పెద్ద శరీరం ఉన్న ప్రయాణికులు WR-V లో అంత సౌకర్యంగా ఉండలేకపోవచ్చు.
ఎకోస్పోర్ట్ లో అన్నిటి కంటే చాలా తక్కువ షోల్డర్ రూం ఉంటుంది, అయితే హెడ్‌రూం మాత్రం కేవలం కొద్దిగా విటారా బ్రెజ్జా కంటే తక్కువగా ఉంటుంది. నీ(మోకాలు) రూం మారుతి కంటే మెరుగైనదిగా ఉంటుంది, అయితే హోండా మరియు టాటా కంటే బాగా వెనకపడి ఉంటుంది. సీటు బేస్డ్ పొడవు మరియు వెడల్పు కేవలం ఏవరేజ్ గా ఉంటాయి, అయితే సీటు బ్యాక్ రెస్ట్ నెక్సాన్ తో సమానంగా ఉంది.
ముందు వరుస స్థలానికి వస్తే, ఎకోస్పోర్ట్ దీనిలో అతి పెద్ద సీటును అందించే విధంగా ఉంటుంది కానీ ఇతర కార్లు అలా అని తక్కువేమీ ఇవ్వడం లేదు. కానీ మీకు మొత్తం స్థలం మెరుగైనదిగా కావాలని కోరుకుంటే, దాని ప్రత్యర్థులతో పోలిస్తే విటారా బ్రెజ్జా అన్నిటికంటే వెడల్పాటి షోల్డర్ స్పేస్ ని అందిస్తుంది. ఎవరైతే వెనుక వరుసలో సౌకర్యంగా ఉండాలి అనుకుంటారో వారు విటారా బ్రజ్జా మరియు నెక్సాన్ ను ఎంపిక చేసుకుంటారు, ఎందుకంటే ఈ రెండూ కూడా హెడ్‌రూం మరియు షోల్డర్ రూం లో చాలా ఉత్తమంగా ఉంటుంది.