మహింద్రా XUV300 అద్భుతాలు & లోపాలు

సవరించబడిన పైన Mar 11, 2019 12:16 PM ద్వారా Dhruv for మహీంద్రా XUV300

 • 20 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Mahindra XUV300: Hits & Misses

నవీకరణ: మాహింద్రా XUV300 ని భారతదేశంలో రూ.7.90లక్షల(ఎక్స్-షోరూం,ఇండియా) ప్రారంభ ధర వద్ద ప్రారంభించింది.

మహింద్రా సంస్థ XUV300 ని 14 ఫిబ్రవరీ 2019 లో భారతదేశంలో ప్రారంభించింది. ఇప్పుడు మేము దీని నడిపి చుశాము. అందువలన మేము XUV300 లో నచ్చే కొన్ని అంశాలు ఖచ్చితంగా చెప్పగలము మరియు కొన్ని అంశాలు కూడా దీనిలో మిస్ అయ్యాయి. ఇక్కడ మేము సబ్-4 మీటర్ SUV కి ఏవైతే అనుకూలంగా ఉంటాయో వాటిని మరియు మహింద్రా ఏఏ అంశాలను చేర్చడం ద్వారా మరింత ఆకర్షణీయంగా ఉంటుందో ఈ అంశాలనీ పొందుపరచడం జరిగింది.

మహింద్రా XUV300 లో మాకు నచ్చిన అంశాలు

 • భద్రత: మహింద్రా XUV300 దాని విభాగంలో అద్భుతమైన భద్రతా లక్షణాలను కలిగి ఉంది. దీనిలో సెవెన్ ఎయిర్‌బ్యాగ్స్,అన్ని నాలుగు వీల్స్ కి డిస్క్ బ్రేక్స్, హిల్ హోల్డ్ అసిస్ట్ తో ESP,ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్ మరియు టైర్ ప్రజర్ మోనిటరింగ్ వ్యవస్థ కూడా ఉన్నాయి.
 • లక్షణాలు: మహీంద్రా కొత్త XUV300 లో డజన్ ల లక్షణాలను నింపింది. ఇది విభాగంలో మొదటి లక్షణాలు అయినటువంటి డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మోడ్లు (స్టీరింగ్ యొక్క బరువు సర్దుబాటు చేయడానికి) మరియు ముందు పార్కింగ్ సెన్సార్ల వంటి వాటిని కలిగి ఉంది. ఇంకా దీనిలో ఒక సన్రూఫ్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ మరియు 17-డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ టాప్ వేరియంట్లో ఉన్నాయి.  

 • శక్తివంతమైన ఇంజన్లు: XUV300 ఒక 1.2 లీటర్ టర్బోచార్జెడ్ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది, ఇది 110Ps పవర్ ని మరియు 200Nm టార్క్ ని అందిస్తుంది. అలాగే, 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ మోటర్ ని కలిగి ఉండి 115Ps పవర్ మరియు 300Nm టార్క్ ను విడుదల చేస్తుంది.ఈ సంఖ్యలు XUV300 యొక్క డీజిల్ ఇంజన్ దాని విభాగంలో అత్యంత శక్తివంతమైనది మరియు మంచి టార్క్ ని అందిస్తుందని తెలుపుతున్నాయి. XUV300 యొక్క పెట్రోల్ మోటార్ కూడా టార్క్ పరంగా దాని ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు సహాయపడుతుంది.

 • రైడ్ క్వాలిటీ: XUV300 యొక్క రైడింగ్ విధానం ఆకట్టుకుంటుంది.దీని సస్పెన్షన్ తక్కువ వేగాలలో బంప్స్ ని తెలియనివ్వదు మరియు స్పీడ్ మూడు అంకెల సంఖ్య దాటినా కుడా నిలకడగా ఉంటుంది.

మహీంద్రా XUV300 లో మెరుగుపరచవలసిన అంశాలు

 • స్థలం: ఈ XUV300 వాహనంలో దీని విభాగంలో పొడవైన వీల్‌బేస్ కలిగి ఉన్నప్పటికీ వెనకతాల భాగం కొంచెం ఇరుకుగా ఉంటుంది. మహింద్రా దీనిలో బూట్ సైజ్ ఎంతో చెప్పలేదు, కానీ మాకు అర్ధమవుతుంది ఏమిటంటే ఆ స్థలం ఒక ఫ్యామిలీ వీకెండ్ ట్రిప్ కి కావలసినంత లగేజ్ కి సరిపోదు. లోడింగ్ లిప్ దీనిలో పైకి అమర్చడం జరిగింది. దీనిలో వీల్ బేస్ పెద్దది ఉన్నప్పటికీ కూడా  ఫ్రంట్ ప్యాసింజర్ ఫుట్ వెల్ ఇరుకుగా ఉంటుంది.  దీని అర్ధం మహింద్రా XUV300 యొక్క ఆకర్షణీయతను పెంచాలంటే మరింత శ్రద్ధ చూపించాలి.
 • ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ లేదు:మహింద్రా XUV300 ప్రారంభించేటపుడు ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ తో ఉండదు. ఎవరైతే వారి ఎడమ కాలు కి ఎక్కువ శ్రమ ఇవ్వకూడదు అని అనుకుంటారో వారు ఈ విభాగంలో వేరే వాహనాన్ని ఎంచుకుంటారు. దీనిలో డీజిల్ ఇంజన్ (మేము పెట్రోల్ పవర్ XUV300 ని నడపలేదు)1500Rpm వద్ద పవర్ లో తగ్గుతుంది మరియు దీనిని సిటీ లో తిప్పేటపుడు గేర్ లు అవీ చూసుకుంటూ వెళ్ళాలి.

 • సెంటర్ కన్సోల్ డిజైన్: ఈ XUV300 శ్సాంగ్యాంగ్ తివోలీ ఆధారంగా ఉంటుంది మరియు దీనిలో ఉన్నడాష్బోర్డ్ డిజైన్ దాని నుండి పంచుకుంది. ఈ తివోలీ 2015 నుండి ప్రపంచవ్యాప్త మార్కెట్లలో విక్రయించబడుతుంది మరియు దీని డాష్బోర్డ్ కొత్త తరంలాగా లేదా ఉత్తేజకరంగా ఏమీ ఉండదు. చాలా వరకు ఆధునిక డాష్బోర్డ్లకు ఫ్లోటింగ్ లేదా "ప్రోప్డ్ అప్" స్క్రీన్ మరియు కనిష్ట బటన్లు ఉన్నాయి, XUV300 ఇలా ఉండదు. దీనిలో ఆరెంజ్ బాక్ లిట్ ఇన్స్టృమెంటల్ క్లస్టర్ మరియు సాదా జేన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొత్తంగా చూసుకుంటే అంత ఆకర్షణీయంగా ఏమీ ఉండదు.

 • అస్థిరమైన నాణ్యత: XUV300 ప్రీమియం కాబిన్ కు హామీ ఇచ్చినప్పటికీ, నాణ్యత అసంబద్ధంగా ఉంటుంది మరియు కొన్ని ప్రదేశాలలో నాణ్యత మరియు ఫినిషింగ్ కొంచెం ప్రశ్నార్థకం ఉంది. ఇంకా దీనిలో ప్యానెల్ గాప్స్ మరియు స్విచ్లు యొక్క నాణ్యత అంత సమానంగా ఏమి ఉండవు.        

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మహీంద్రా XUV300

0 వ్యాఖ్య
Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
 • ట్రెండింగ్
 • ఇటీవల

తాజా ఎస్యూవి కార్లు

రాబోయే ఎస్యూవి కార్లు

* న్యూఢిల్లీ అంచనా ధర
×
మీ నగరం ఏది?