Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

Mahindra XUV 3XO vs Mahindra XUV300: ప్రధాన వ్యత్యాసాల వివరణ

మహీంద్రా ఎక్స్యువి 3XO కోసం rohit ద్వారా ఏప్రిల్ 30, 2024 06:37 pm సవరించబడింది

నవీకరించబడిన XUV300 కొత్త పేరుని పొందడమే కాకుండా, సరికొత్త స్టైలింగ్‌తో పెద్ద మేక్ఓవర్‌ను పొందింది. ఇప్పుడు దాని విభాగంలో అత్యంత ఫీచర్-లోడ్ చేయబడిన ఆఫర్‌లలో ఒకటిగా మారింది.

XUV300 కు ఫేస్‌లిఫ్ట్‌గా మహీంద్రా XUV 3XO విడుదల అయింది. మహీంద్రా యొక్క నవీకరించబడిన సబ్‌కాంపాక్ట్ SUVలో ప్రధాన ఎక్స్టీరియర్ డిజైన్ మార్పులు, XUV400 EV నుండి కీలక అంశాలతో సరికొత్త ఇంటీరియర్ మరియు అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో, లుక్స్ పరంగా XUV 3XO మరియు మునుపటి వెర్షన్ల మధ్య వ్యత్యాసాలను అన్వేషిస్తాము.

ఫ్రంట్

మహీంద్రా XUV300తో పోలిస్తే XUV 3XOను రీడిజైన్ చేసిన మరియు స్ప్లిట్ గ్రిల్‌తో అందిస్తున్నారు. ఇందులో ఐదు క్రోమ్ స్లాట్లు, కొత్త మహీంద్రా లోగో ఉన్నాయి. పొడవైన ఫాంగ్ ఆకారంలో ఉన్న LED DRLలు, హెడ్‌లైట్ క్లస్టర్‌ల హౌసింగ్ ప్రొజెక్టర్ యూనిట్‌లను కూడా చూడవచ్చు. దీని బంపర్ లో పెద్ద ఎయిర్ డ్యామ్, ఫ్రంట్ కెమెరా, అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) రాడార్ ఉన్నాయి.

సైడ్

XUV 3XOలో కొత్తగా డిజైన్ చేసిన 17 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కాకపోతే, SUV ప్రొఫైల్‌లో పెద్ద మార్పులు చేయలేదు.

రేర్

వెనుక భాగంలో అతిపెద్ద మార్పు ర్యాపరౌండ్ మరియు కనెక్టెడ్ LED టెయిల్ లైట్లు. ఇందులో ఇప్పుడు కొత్త ‘XUV 3XO’ మరియు వేరియంట్-స్పెసిఫిక్ మోనికర్‌లను మరియు చంకీ సిల్వర్ స్కిడ్ ప్లేట్తో కూడిన బంపర్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: మహీంద్రా థార్ 5-డోర్ ఇంటీరియర్ మళ్లీ స్పై చేయబడింది-దీనికి ADAS లభిస్తుందా?

క్యాబిన్

మహీంద్రా XUV300 యొక్క క్యాబిన్‌లో భారీ మార్పులను చేశారు. మహీంద్రా 3XO లో XUV400 లో కనిపించే డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లేలను కలిగి ఉంది మరియు ఇందులో అదే స్టీరింగ్ వీల్‌ ఉంటుంది. డాష్‌బోర్డ్‌లో సాఫ్ట్-టచ్ లెథరెట్ అప్హోల్స్టరీ, 65 W USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, రీపోజిషన్ మరియు రివైజ్డ్ సెంట్రల్ AC వెంట్స్ మరియు నవీకరించిన క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ కూడా ఉన్నాయి.

పెద్ద టచ్‌స్క్రీన్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే

అవుట్‌గోయింగ్ XUV300 7-అంగుళాల టచ్‌స్క్రీన్ యూనిట్ ఉండగా, XUV 3XO లో XUV400 మాదిరిగానే వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేసే పెద్ద 10.25 అంగుళాల స్క్రీన్ లభిస్తుంది.

XUV 3XO లో కూడా XUV400 EV వంటి ఆవే 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే లభిస్తుంది, ఇది డేటెడ్ ట్విన్-పాడ్ అనలాగ్ క్లస్టర్ను భర్తీ చేస్తుంది.

ఇది కూడా చూడండి: వేసవిలో మీ కారు ACపై సమర్థవంతమైన కూలింగ్ ఎలా సాధించాలి

సన్‌రూఫ్

ప్రీ-ఫేస్‌లిఫ్ట్ XUV300తో పోలిస్తే XUV 3XO లో కొత్తగా వచ్చిన మరో ఫీచర్ సెగ్మెంట్-ఫస్ట్ పనోరమిక్ సన్‌రూఫ్. XUV300 దాని సెగ్మెంట్ ప్రత్యర్థులలో చాలా వరకు అందుబాటులో ఉన్న సాధారణ సన్‌రూఫ్‌ను కలిగి ఉంది.

సంక్షిప్తీకరించిన ఇతర ఫీచర్లు

మహీంద్రా XUV 3XOలో 7-స్పీకర్ హర్మన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్ (సబ్ వూఫర్‌తో సహా), వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు డ్యూయల్-జోన్ AC వంటి మరిన్ని ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు (ప్రామాణికంగా), 360 డిగ్రీల కెమెరా, ఫ్రంట్ మరియు రేర్ పార్కింగ్ సెన్సార్లు, లెవల్ -2 అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఉన్నాయి.

ఇంజిన్ గేర్‌బాక్స్ ఎంపికలు

అవుట్‌గోయింగ్ మోడల్ మాదిరిగానే, XUV 3XO కూడా టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో వస్తుంది, ఇవి క్రింద వివరించబడ్డాయి:

స్పెసిఫికేషన్

1.2-లీటర్ టర్బో-పెట్రోల్

1.2-లీటర్ TGDi టర్బో-పెట్రోల్

1.5-లీటర్ డీజిల్

పవర్

112 PS

130 PS

117 PS

టార్క్

200 Nm

230 Nm, 250 Nm

300 Nm

ట్రాన్స్మిషన్

6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT

6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT

6-స్పీడ్ MT, 6-స్పీడ్ MT

AMT

పేర్కొన్న మైలేజ్

18.89 kmpl, 17.96 kmpl

20.1 kmpl, 18.2 kmpl

20.6 kmpl, 21.2 kmpl

పెట్రోల్-ఆటోమేటిక్ వేరియంట్‌లలో జిప్, జాప్ మరియు జూమ్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి.

ధర శ్రేణి మరియు ప్రత్యర్థులు

మహీంద్రా XUV 3XO ధర రూ.7.49 లక్షల నుండి రూ.15.49 లక్షల వరకు (పరిచయ ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) ఉంటుంది. ఇది కియా సోనెట్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్, మరియు రాబోయే స్కోడా సబ్-4m SUVలకు గట్టి పోటీ ఇస్తుంది. XUV 3XO మారుతి ఫ్రాంక్స్ మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ వంటి సబ్-4m క్రాసోవర్లకు ఒక SUV ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

మరింత చదవండి: మహీంద్రా XUV 3XO ఆన్ రోడ్ ధర

Share via

Write your Comment on Mahindra ఎక్స్యువి 3XO

explore మరిన్ని on మహీంద్రా ఎక్స్యువి 3xo

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.2.84 - 3.12 సి ఆర్*
కొత్త వేరియంట్
ఫేస్లిఫ్ట్
Rs.1.03 సి ఆర్*
కొత్త వేరియంట్
Rs.11.11 - 20.50 లక్షలు*
కొత్త వేరియంట్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర