మహింద్రా టీయూవీ300 ని చెన్నై లో రూ. 7.14 లక్షల ధరకు విడుదల చేశారు
సెప్టెంబర్ 14, 2015 09:33 am bala subramaniam ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నిన్నటి జాతీయ విడుదల తరువాత, మహింద్రా టీయూవీ300 ని చెన్నై లో రూ.7.14 లక్షల ధర వద్ద విడుదల చేశారు. క్వాంటో తరువాత ఈ మహింద్రా టీయూవీ300 కంపెనీ వారి నుండి వస్తోన్న రెండవ కాంపాక్ట్ ఎస్యూవీ. కాని ఈసారి, మహింద్రా వారి టౄఉ బ్లూ ఎస్యూవీ ని సమర్పిస్తున్నట్టు చెబుతున్నారు. తద్వారా స్పోర్ట్స్ యూటిలిటీ సెగ్మెంట్ లో కొత్త అనుభవాన్ని అందించాలి అన్నది వారి ఆశయం. పూర్తిగా కొత్త వేదికపై నిర్మింపబడిన ఈ టీయూవీ300 అంతర్ఘత స్థలం, సమర్ధత మరియూ లక్షణాలు మహింద్రా వరి శైలి లో అందిస్తున్నారు.
ఈ టీయూవీ300 కి 1.5-లీటర్ ఎమ్హాక్ ఇంజిను తో 2-స్టేజ్ టర్బో చార్జర్ ని అమర్చారు. ఇది 84hp శక్తిని మరియూ 230Nm టార్క్ని విడుదల చేస్తుంది. ఉత్తమమైన 5-స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ని 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపిక తో పాటుగా అందిస్తున్నారు.
అంతర్ఘతాలలో ఇటాలియన్ డిజైన్ ఫర్మ్ అయిన పినింఫరీనా తో కలసి పనిచేసినందున ప్రత్యేకమైన రూపాన్ని అందించడం జరిగింది.
సురక్షణ విషయానికి వస్తే, డ్యువల్ ముందు వైల్పు ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ తో ఈబీడీ ఉన్నాయి. డిక్కీ స్థలం 384 లీటర్లు ఉండగా, ఇది రెండవ మరియూ మూడవ వరుస సీట్లు మడిస్తే 720 లీటర్లకు పెంచుకోవచ్చును. కానీ ఈ వెసులుబాటు కేవలం ఉన్నత శ్రేని వేరియంట్స్ కి మాత్రమే అందించడం జరిగింది. ఇతర లక్షణాలు, స్టాటిక్ హెడ్ల్యాంప్స్, ఇంటెల్లీ పార్క్ రివర్స్ అస్సిస్ట్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో మరియూ ఫోను కంట్రోల్స్, వాయిస్ మెస్సేజ్ సిస్టము, మైక్రో-హైబ్రీడ్ టెక్నాలజీ మరియూ బ్లూ ఎస్సెన్స్ ఆప్ గా చెప్పవచ్చును.
మహింద్రా టీయూవీ300 వేరియంట్స్ మరియూ ధరలు (ఎక్స్- షోరూం చెన్నై):