మహింద్రా టీయూవీ 300 సెప్టేంబరు 10 న విడుదల కావొచ్చు
జైపూర్: మహింద్రా వారి మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్యూవీ అయిన టీయూవీ 300 గురించిన ప్రకటన పై మౌనం ఎట్టకేలకు వీడింది. అధికారికంగా సెప్టెంబరు 10 న , 2015 లో విడుదల చేస్తాము అని ప్రకటించింది. ఈ కాంపాక్ట్ కారు తయారిదారుల మహరాష్ట్ర లోని చకన్ సముదాయం నుండి విడుదల చేస్తారు. మొదటి నుండి ఆఖరి దాకా ఈ కారు పూర్తిగా చెన్నై లోని మహింద్రా రీసర్చ్ వ్యాలీ (ఎమార్వీ) లో తయారు చేయబడింది.
మహింద్రా మరియూ మహింద్రా వారి ప్రెసిడేంట్ మరియూ చీఫ్ ఎగ్జెక్యూటివ్ అయిన ప్రవీన్ షా మాటల్లో, "ఈ సంవత్సరం ఈ టీయూవీ 300 కోసం ఎంతగానో ఎదురు చూడటం జరిగింది. నిజమైన 'మేక్ ఇన్ ఇడియా' అనే నినాదం తో మరియూ ఒక యుద్ద ట్యాంక్ ని ఆధారంగా నిర్మించినది. మా కస్టమర్లలో మరియూ మార్కెట్ లో కూడా దీని విడుదల ఉత్సాహాన్ని నింపుతుంది అని నమ్మకంగా ఉన్నాము," అని అన్నారు.
ఈ కారులో 1.5 లీటరు ఎమ్హ్యాక్ 80 డీజిల్ మోటరు ఉంటూంది. ఇక్కడ పేరు లో 80 అనగా అది ఉత్పత్తి చేసే శక్తి అయ్యి ఉంటుంది. మహింద్రా వారి వాహనాలు అన్నీ బాహ్య రూపానికి పెట్టింది పేరు కాబట్టి ఈ కారుని కూడా ఒక ఆర్మర్డ్ ట్యాంక్ డిజైన్ ఆధారంగా రూపొందించారు. పెద్ద విండోలు, కురస ముందు మరియూ వెనుక వైపు భాగాలు ఒక స్పోర్టీ అప్పీల్ ని ఇస్తాయి. పినింఫర్నియా అనే ప్రముఖ డిజైనింగ్ కంపెనీ వారిచే ఇది రూపొందించడం వల్ల దీని డిజైను మొత్తం బావుంటూంది అనే నమ్మకంగా ఉన్నాము.
టీయూవీ 300 యొక్క ప్రవేశంతో మరియూ ప్రతి ఎస్యూవీ సెగ్మెంట్ లో ఒకొక్క కారుని ప్రవేస పెట్టడంతో మహింద్రా వారు ఎస్యూవీ తయారీదారిగా వారిని వారు స్థాపించుకుంటూన్నారు. ఈ టీయూవీ 300 కి పోటీదారులుగా నిలిచేవి ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనాల్ట్ డస్టర్, మారుతీ ఎస్-క్రాస్ మరియూ హ్యుండై క్రేటా.