Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

బురదలో చిక్కుకుని కనిపించిన Mahindra Thar 5-door

మహీంద్రా థార్ 5-డోర్ కోసం shreyash ద్వారా ఫిబ్రవరి 26, 2024 06:40 pm ప్రచురించబడింది

ఇటీవల విడుదలైన వీడియో ప్రకారం, మీరు 5-డోర్ థార్‌లో ఆఫ్-టార్మాక్ వెళ్లాలనుకుంటే, మీకు 4WD వేరియంట్ మంచిక ఎంపిక.

  • టెస్ట్ మోడల్ ను చూస్తే ఇది రేర్ వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ అని తెలుస్తోంది.

  • వీల్ ట్రాక్షన్ మరియు టైర్ కండిషన్ కారు బురదలో చిక్కుకోవడానికి కొన్ని కారణాలు కావచ్చు.

  • పెద్ద మహీంద్రా థార్ రెగ్యులర్ వెర్షన్ నుండి 2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజల్ ఇంజన్ల ఎంపికను పొందుతుంది.

  • వీటి ధరల రూ.15 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ టెస్టింగ్ సమయంలో కనిపించిన అనేక స్పై షాట్లు విడుదలయ్యాయి. ఇప్పుడు 5-డోర్ థార్ యొక్క కొత్త వీడియో బయటకు వచ్చింది, ఇందులో ఈ 4WD SUV కారు మనాలిలోని బురద మార్గం నుండి బయటపడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

A post shared by Rajesh Thakur (@rajeshhimalayan)

వీడియోను నిశితంగా పరిశీలిస్తే టెస్ట్ మోడల్ వెనుక చక్రాలు మాత్రమే తిరుగుతున్నాయని తెలుస్తుంది, ఇది 4x2 (రేర్-వీల్-డ్రైవ్) వేరియంట్ కావచ్చు లేదా ఇందులో 4-వీల్-డ్రైవ్ (4WD) మోడ్ ఇన్స్టాల్ చేసి ఉండకపోవచ్చు. ఒక్క ఉదాహరణలో థార్ 5-డోర్ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను తోసిపుచ్చకూడదు. బురదలో ఐస్ కలపడం వంటి కొన్ని ఇతర అంశాలు కూడా ఈ పరిస్థితికి కారణం అవ్వొచ్చు, దీని వల్ల స్లిప్ అయ్యే ప్రదేశాలలో సాధారణ టైర్లు దానిపై వెళ్ళటం కష్టంగా ఉంటుంది.

ఇది కాకుండా, టైర్ కండిషన్ మరియు డ్రైవర్ నైపుణ్యం వంటి మరికొన్ని అంశాలు కూడా ఇలాంటి పరిస్థితిని సృష్టిస్తాయి.

రాబోయే మహీంద్రా థార్ 5-డోర్ గురించి మరింత తెలుసుకోండి

మహీంద్రా థార్ 5-డోర్ 3-డోర్ మోడల్ వలె అదే 2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజల్ ఇంజన్లతో అందించబడుతుంది, అయితే ఇంజన్ కు ఎక్కువ పవర్ ట్యూనింగ్ ఇవ్వబడుతుంది. సాధారణ థార్ మాదిరిగానే, ఇది కూడా రెండు ఇంజిన్లతో 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికను పొందుతుంది. 5-డోర్ వెర్షన్ లో 4-వీల్ డ్రైవ్ (4WD) మరియు రేర్-వీల్ డ్రైవ్ (RWD) ఎంపికలను కూడా అందించనున్నారు.

ఇది కూడా చూడండి: ఇటీవల విడుదల అయిన స్పై షాట్స్ ప్రకారం ఫోర్స్ గూర్ఖా 5 డోర్ త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోండి

థార్ 3-డోర్ కంటే మరిన్ని ఫీచర్లు

5-డోర్ థార్ 3-డోర్ మోడల్ కంటే ఎక్కువ ఫీచర్లను పొందుతుంది, వీటిలో పెద్ద టచ్స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, సింగిల్ ప్యాన్ సన్రూఫ్, రేర్ AC వెంట్స్ మరియు ఆటో-డిమ్మింగ్ IRVM ఉన్నాయి. దాని గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అంతే కాకుండా ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఫ్రంట్ మరియు రేర్ పార్కింగ్ సెన్సార్లు, రేర్ వ్యూ కెమెరా, 360 డిగ్రీల కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఆశించిన ధర ప్రత్యర్థులు

మహీంద్రా థార్ 5-డోర్ 2024 మధ్యలో భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది, దీని ధర రూ.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది 5 డోర్ ఫోర్స్ గూర్ఖాతో పోటీ పడనుంది. మారుతి జిమ్నీ కంటే ఇది ప్రీమియం ఎంపికగా దీన్ని ఎంచుకోవచ్చు.

మరింత చదవండి: థార్ ఆటోమేటిక్

s
ద్వారా ప్రచురించబడినది

shreyash

  • 49 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మహీంద్రా థార్ 5-Door

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర