• English
  • Login / Register

స్కార్పియో యొక్క ఆటోమేటిక్ వేరియంట్లను రూ. 13.13 లక్షల వద్ద ప్రారంభించిన మహింద్రా

మహీంద్రా స్కార్పియో 2014-2022 కోసం sourabh ద్వారా జూలై 16, 2015 04:25 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: మహీంద్రా అండ్ మహీంద్రా, నివేదిక ప్రకారం స్కార్పియో నమూనాల లైనప్ లో ఆటోమేటిక్ వేరియంట్ లను జత చేసుకుంది. ఢిల్లీ లో ఇప్పటికే మహింద్రా డీలర్స్, అమ్మకాలను ప్రారంబించారు. వీటి యొక్క ధరలను చూసినట్లైతే, 2డబ్ల్యూడి ఆటోమేటిక్ వేరియంట్ ను రూ. 13.13 లక్షల వద్ద మరియు 4డబ్ల్యూడి వెర్షన్ ను 14.33 లక్షల వద్ద ప్రారంబించారు. మేము, ఆటోమేటిక్ వేరియంట్ ల అమ్మకాల కోసం, నిర్ధారణ పొందడానికి కొన్ని డీలర్స్ కు కాల్ చేశాము.

మహీంద్రా, గత సంవత్సరం సెప్టెంబర్ లో తదుపరి తరం స్కార్పియో ను ప్రారంభించినప్పుడు, దీని యొక్క పోర్ట్ఫోలియో లో ఆటోమేటిక్ వేరియంట్ లు లేవు. కానీ, దేశంలో ఆటోమేటిక్ వేరియంట్ ల కోసం పెరుగుతున్న డిమాండ్ ను చూసిన తరువాత తయారీదారుడు ఆటోమేటిక్ వెర్షన్ ను తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఈ ఆటోమేటిక్ వెర్షన్ డీలర్ ధగ్గర అందుబాటులో ఉన్నప్పటికీ కంపెనీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. 

ఈ కొత్త స్కార్పియో, యాంటీ రోల్ టెక్నాలజీతో, మెరుగైన సస్పెన్షన్ సెటప్ తో పాటు పూర్తిగా కొత్త చాసిస్ తో ఇటీవల విడుదల అయ్యింది. అంతేకాకుండా, ఇది స్వెప్ట్ బేక్ హెడ్ల్యాంప్స్, డే టైం రన్నింగ్ హెడ్ ల్యాంప్స్, వెర్తికల్ స్లాట్ గ్రిల్ ను కలిగి ఉంది. ఈ వాహనం వెనుక భాగం విషయానికి వస్తే, డి ఆకారం లో ఉండే ఎల్ ఈ డి టైల్ ల్యాంప్ క్లస్టర్ తో వచ్చింది. అంతేకాకుండా, కొత్త టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ, రైన్ అండ్ లైట్ సెన్సార్స్ తో పాటు క్రూజ్ నియంత్రణ మరియు టైర్ ట్రోనిక్స్ తో విడుదల అయ్యింది. 

స్కార్పియో, 2.2 లీటర్ ఎం హాక్ సి ఆర్ డి ఐ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 2179 సిసి స్థానభ్రంశాన్ని మరియు 4 సిలండర్లను కలిగి ఉంది. దీనితో పాటుగా వేరియబుల్ జియోమెట్రీ టర్బో తో పాటు ఇంటర్ కూలర్ ను కలిగి ఉంది. ఈ ఇంజన్, అత్యధికంగా 4000 rpm వద్ద 120 bhp పవర్ ను మరియు 1800 నుంది 2800 rpm మద్య 280 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో 2డబ్ల్యూడి లో లేదా 4 డబ్ల్యూడి లో ఆప్షనల్ గా జత చేయబడి ఉంటుంది. టాప్ ఎస్10 వేరియంట్ కూడా మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ వస్తుంది. బేస్ ఎస్2 వేరియంట్, 2.5 లీటర్ టర్బో చార్జెడ్ సి ఆర్ డి ఐ డీజిల్ ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజన్, అత్యదికంగా 3200 rpm వద్ద 75 bhp పవర్ ను మరియు 1400 నుండి 2000 rpm మధ్య 200 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ఇది 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Mahindra స్కార్పియో 2014-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience