• English
  • Login / Register

మహింద్రా ఎస్101 మళ్ళీ కంటపడింది; అంతర్ఘతాలు బహిర్గతం అయ్యాయి

ఆగష్టు 20, 2015 10:13 am అభిజీత్ ద్వారా సవరించబడింది

  • 23 Views
  • 2 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మహింద్రా వారి నుండి వస్తోన్న చిన్న కారు అయిన ఎస్101 మళ్ళీ కంటపడింది మరియూ అంతర్ఘతాలు ఫోటోలకు చిక్కాయి. కారు యొక్క బాహ్య రూపం కప్పిపుచ్చినా, లోపలి ముఖ్యమైన భాగాలు కంటపడ్డాయి. ఇది కాంపాక్ట్ ఎస్యూవీ అని అంటున్నా, ఇది హ్యాచ్బ్యాక్ గా మేము పరిగణీస్తున్నాము. ఇందులో కంపెనీ వారి అధునాతన డిజైన్ దీనిని ఎస్యూవీ లా కనిపించేట్టు చేస్తుంది.

ఫోటోల విషయానికి వస్తే, లోపల డ్యాష్ బోర్డు, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, సీట్లు, స్టీరింగ్ వీలు, సెంట్రల్ కన్సోల్ మరియూ దాదాపుగా అన్నీ కనపడ్డాయి. డ్యాష్ బోర్డు అందంగా మరియూ అధునాతనంగా ఉంది, మెరిసే క్రోము మరియూ సిల్వర్ హంగులతో మరియూ సెంట్రల్ కన్సోల్ మీద కంట్రోల్ డైల్స్ తో ఉంది. మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ సమకాలీన విధంగా ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పైన ఉంది. కానీ, అతి ముఖ్యంగా లోపలి ఫోటోలలో కనపడింది ఏమిటంటే సెంట్రల్ కన్సోల్ పైన అమర్చిన గేర్ స్టిక్. ఇది అద్దం యొక్క నీడ కారణంగా సరిగా కనపడలేదు. దీని బట్టి, ఈ ఎస్101 కారుకి ముందు వైపున మధ్య సీటు వస్తుందేమో అనుకోవచ్చు. ఇది కిందికి పెట్టినప్పుడు హ్యాండ్ రెస్ట్ గా ఉపయోగించుకోవచ్చును. కారు సరిపడ పొడవుగా ఉండటం వలన లోపలికి ప్రవేశించడం మరియూ బయటకి రావడం సులువు అవ్వొచ్చు.

బాహ్య విషయాలను చూస్తే, ముందు వైపు స్కార్పియో లో మరియూ ఎక్స్యూవీ500 కి వచ్చినట్టే మహింద్రా యొక్క గ్రిల్లు ఉంది. దీని రెండు వైపులా ఫోకస్ ల్యాంప్స్ కలిగిన హెడ్ల్యాంప్స్ ఉన్నాయి. టీయూవీ300 లో ఉన్నట్టుగా 14-అంగుళాల వీల్స్ మరియూ టైర్లు ఉన్నాయి.

ఈ కారు మోనోకాక్ ఛాసీ ఆధారంగా నిర్మించబడింది మరియూ టీయూవీ300 లో ఉన్నట్టుగానే 1.5-లీటరు ఎమ్హాక్ 80 మోటరు తో వస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Mahindra Compact XUV

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience