మహీంద్రాS101ని KUV100 గా పిలవబడుతుందని అధికారికంగా ప్రకటించారు.
మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి కోసం nabeel ద్వారా డిసెంబర్ 21, 2015 06:26 pm ప్రచురించబడింది
- 13 Views
- 5 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మహీంద్రా, S101 హాచ్ సంకేతపదాన్ని KUV 100గా పిలవనుంది అని వెల్లడించింది.
భారత మార్కెట్లో రాబోయే మహీంద్రా తాజా ఎంట్రీ ఇప్పుడు అధికారికంగా KUV100 గా పిలవబడుతుంది. ఇది mFALCON కుటుంబానికి చెందిన ఇంజిన్లను కలిగి ఉంటుంది. ఈ mFALCON (BS-IV) G80 పెట్రోల్ ఇంజిన్ 5,500 rpm వద్ద 82 BHP ని మరియు 114 114 Nm గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ mFALCON D75, 3750 rpm వద్ద 77 BHP శక్తిని మరియు 1,750rpm వద్ద 190 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. kuv100 ఒక కొత్త వేదికని ఆధారంగా చేసుకొని 4 రకాల వేరియంట్స్ ని కలిగి ఉండి ఆప్షనల్ ఎయిర్బ్యాగ్స్ మరియు ABS అనే ప్రామాణిక ఫీచర్స్ ని కలిగి ఉంది.
బేస్ వేరియంట్స్
K2 & K2+ (ఎయిర్బ్యాగ్స్ తో )
మిడ్ వేరియంట్స్
K4 & K4+ (ఎయిర్బ్యాగ్స్ తో )
హై వేరియంట్స్
K6 and K6+ (ఎయిర్బ్యాగ్స్ తో )
టాప్ ఎండ్ వేరియంట్
K8 (ఎయిర్బ్యాగ్స్ తో )
KUV 100 ఏడు రంగుల ఎంపికలు కలిగి ఉంటుంది. అవి డజ్జిలింగ్ సిల్వర్ , ఆక్వా మరిన్ , పెరల్ వైట్ , డిజైనర్ గ్రే, ఫైరి ఆరెంజ్, ఫ్లామ్బోయంట్ రెడ్ మరియు మిడ్ నైట్ బ్లాక్. కారు కోసం బుకింగ్స్ డిసెంబర్ 19, 2015 నుండి ఓపెన్ అయ్యాయి.
ఈ కారు ధర 4 నుండి 7 లక్షల దాక ఉండవచ్చునని అంచనా. ఇది వచ్చే నెల విడుదల కానుంది. ఇది బహుశా సూక్ష్మ SUV విభాగంలో ఒక కొత్త విభాగం ని సృష్టిస్తుంది (సబ్-4m సువ సెగ్మెంట్ స్పేస్ క్రింద ). ఇది త్వరలో మారుతీ సుజుకి ఫైర్ ని అనుసరించవచ్చు.
ఇది కుడా చదవండి;
డిల్లీలో డీజిల్ బాన్ ద్వారా పేరుకున్న 1,000 ఖరీదు కార్లు ఇంకా మహింద్రా ఎదుర్కొంటున్న అడ్డంకులు