వాటర్ؚఫాల్ క్రింద స్కార్పియో N వైరల్ వీడియోకు తమ సొంత వైరల్ వీడియోతో స్పందించిన మహీంద్రా
మార్చి 09, 2023 12:38 pm rohit ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
అసలైన వీడియోలో కనిపించినట్లుగా, ఈ SUVలో నీటి లీకేజ్ సమస్య ఉండదని తెలియచేయడానికి ఈ కారు తయారీదారు అదే సంఘటనను తిరిగి చిత్రీకరించారు.
-
ఇటీవల, ఈ SUV వాటర్ؚఫాల్ కింద ఉన్నప్పుడు క్యాబిన్‌లోకి నీరు లీక్ అవుతున్నట్లు ఒక వైరల్ వీడియో కనిపించింది.
-
దీని సన్ؚరూఫ్ తెరిచి ఉండటం లేదా చుటూ మట్టి చేరడం దీనికి సంభావ్య కారణాలు కావొచ్చు.
-
మహీంద్రా విడుదల చేసిన వీడియోలో, ఈ SUVలో లీకేజ్ సమస్యలు లేవని స్పష్టంగా గమనించవచ్చు.
వాటర్‌ఫాల్ కింద పార్క్ చేసిన మహీంద్రా స్కార్పియో N క్యాబిన్ؚలోకి నీరు లీక్ అవుతున్న వైరల్ వీడియోను మీరు ఇప్పటికే చూసి ఉంటారు. ఈ సంఘటన, SUV నిర్మాణ నాణ్యతపై చర్చకు దారి తీసింది. దీనికి సమాధానంగా ఈ కారు తయారీదారు అలాంటి దృశ్యానే పునరావృతం చేస్తూ తెల్లని స్కార్పియో N ఉన్న వీడియోను ఆన్ؚలైన్ؚలో పోస్ట్ చేశారు.
వీడియోలో ఏం కనిపించింది?
Just another day in the life of the All-New Scorpio-N. pic.twitter.com/MMDq4tqVSS
— Mahindra Scorpio (@MahindraScorpio) March 4, 2023
మహీంద్రా వీడియోలో ఉన్న SUVని, అసలైన వీడియో క్లిప్ؚలో ఉన్నట్లుగా ఒక వాటర్‌ఫాల్ క్రింద ఉంచారు. సన్‌రూఫ్ మూసి ఉన్నట్లు, నీరు వాహనంపై పడుతున్నట్లు SUV లోపలి నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. అసలైన వీడియోలో కనిపించినట్లుగా రూఫ్ؚకు అమర్చిన స్పీకర్‌ల నుండి ఎలాంటి నీటి లీకేజ్ లేదని ఇందులో చూపించారు.
అయితే అసలైన వీడియో ఫేక్ వీడియోనా?
సామాజిక మాధ్యమంలో వచ్చిన అసలైన వీడియో విశ్వసనీయతను పూర్తిగా నిర్ధారించడం కష్టం అయినప్పటికీ, కార్ؚలోకి నీరు రావడం మాత్రమే అందులో కనిపించింది. అలా జరగడానికి సన్‌రూఫ్‌ను సరిగ్గా మూయకపోవడం, సక్రమంగా ఉపయోగించకపోవడం వలన పాడైన సీల్, లేదా చేరిన నీరు సురక్షితమైన నిష్క్రమణ మార్గానికి వెళ్లకుండా దుమ్ము, ఆకులు లేదా కొమ్మలు అడ్డుపడటం వంటి కారణాలు ఉండవచ్చు.
సంబంధించినవి: జపాన్ؚలో, భారీగా కప్పినట్లుగా కనిపించిన మహీంద్రా స్కార్పియో N
ఈ సంఘటనపై మా అభిప్రాయం
అసలైన వీడియోలో నీరు లీకీజ్ నిజమైన సమస్యగా కనిపిస్తునప్పటికీ, సామాజిక మాధ్యమాలలో అందుబాటులో ఉన్న కంటెంట్ ఎప్పుడూ పూర్తిగా నమ్మదగినది కాదు. స్వతంత్ర క్రియేటర్‌లు నిజనిర్దారణ చేయకుండా లేదా ప్రేక్షకులతో పారదర్శకంగా ఉండకుండా వినోదాత్మక కథనాలను ప్రచురించడం అసాధారణం కాదు.
కాబట్టి, అటువంటి కంటెంట్ؚను చూసే ప్రేక్షకులుగా తార్కికంగా ఆలోచించకుండా, అటువంటి సంఘటనల వెనుక కారణాలను విశ్లేషించకుండా మనం ఇంటర్నెట్‌పై అందుబాటులో ఉన్నవన్నీ పూర్తిగా నిజం అని గుడ్డిగా నమ్మకపోవడం చాలా మంచిది. మహీంద్రా వీడియో స్పందన, దీన్ని మనకు మరొకసారి గుర్తు చేసింది.
ఇది కూడా చదవండి: కొత్త వేరియెంట్ మరియు మరిన్ని సీటింగ్ ఎంపికలను పొందనున్న మహీంద్రా స్కార్పియో క్లాసిక్
ఇక్కడ మరింత చదవండి: స్కార్పియో-N ఆన్ؚరోడ్ ధర