సెప్టెంబర్ లో ప్రారంభించనున్న కాంపాక్ట్ ఎస్యూవి 'యువి301' అధికారిక నామం 'టియువి300' గా ప్రకటించిన మహీంద్రా

జూలై 30, 2015 05:36 pm raunak ద్వారా సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

యు301 యొక్క అధికారిక నామం టియువి300 మరియు ఇది ఒక 'అడ్వాన్స్డ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం' తో రూపొందించబడ్డ ఎమ్ హాక్ ఇంజిన్ తో అందించబడుతుంది. 

జైపూర్: మహీంద్రా అధికారికంగా వారి కొత్త సబ్ -4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవి 'టియువి300' లను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. దీని యొక్క సంకేతపదం ప్రాజెక్ట్ లో యు301 గా ఉంటుంది. దీనిని సెప్టెంబర్ మధ్యలో విడుదల చేయడానికి యోచిస్తున్నట్లు ,ఆ తర్వాత డెలివరీలు ప్రారంభమవుతాయని సమాచారం. 

డిజైన్ గురించి మాట్లాడుతూ, కంపెనీ ఈ విధంగా చెప్పారు. ఈ వాహనం ఇటాలియన్ డిజైన్ సంస్థ పినిన్ఫారినా నుండి తీసుకువచ్చిన ఇన్ పుట్లతో మహీంద్రా వారిచే సొంతంగా రూపొందించిబడింది. మహీంద్రా మరియు మహీంద్రా ప్రకారం, టియువి300 యొక్క రూపకల్పన ఒక యుద్ధ ట్యాంక్ నుండి ప్రేరణగా తీసుకుని రూపొందించారు మరియు ఇది మహీంద్రా యొక్క లక్షణాలను పుణికి పుచ్చుకుంది. వాహన తయారీ దారుడు విడుదల చేసిన అధికారిక స్కెచ్లను చూస్తుంటే, ఈ కాంపాక్ట్ ఎస్యూవి నిలువు గీతల లక్షణాలతో మరియు బాక్సీ ఆకారంతో కూడి వెనుక వైపు ఒక అదనపు వీల్ తో జత చేయబడి ఉన్నట్లు తెలుస్తుంది. 

దీని యొక్క పేరు వెల్లడి గురించి మహీంద్రా మరియు మహీంద్రా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ "ఈ రోజు మహీంద్రా భారతదేశంలో ఎస్వియు విభాగంలో బలమైనదిగా సమదృష్టితో ఉంది. నిరంతరంగా కొనసాగే మా ఆటోమోటివ్ ప్రయాణంలో, మేము ఒక కఠినమైన విధానం కోసం బోల్డ్ గా మరియు మస్కులిన్ ఎస్యూవీ వలె ఉండేలా , మా వినియోగదారులు మా నుండి టియువి300 లో ఈ విధమైన ప్రమాణాలు కావాలని ధ్రువీకరించారు. ఈ మహీంద్రా టియువి300 దాని ఖ్యాతిగాంచిన పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ మహీంద్రా బ్రాండ్ కి ఒక గుర్తింపును తీసుకొస్తుందని మేము విశ్వసిస్తున్నాము" అని ఆయన ప్రసంగించారు. 

మహీంద్రా మరియు మహీంద్రా లిమిటెడ్ యొక్క అధ్యక్షుడు & చీఫ్ ఎక్జిక్యూటివ్ అయినటువంటి ప్రవీణ్ షా ఈ విధంగా అన్నారు. "టియువి 300అనేది సాంప్రదాయ ఆలోచనా ధోరణి, చాలెంజింగ్, అభివృద్ధికి రూపం అయినటువంటి మహింద్రా రైజ్ ఫిలాసఫీ కి సారాంశం వంటిది" అని తెలిపారు. ఈ వాహనం మహారాష్ట్రలో చకన్ వద్ద భవిష్యత్ లో సిద్ధమవ్వబోయే మహీంద్రా మరియు మహీంద్రా యొక్క ఎంవిఎం ఎల్ తయారీ ఫెసిలిటీ వద్ద తయారవ్వబోతుంది. 

ఇంకా, టియువి 300 యొక్క పరిశోధన మరియు అభివృద్ధి చెన్నై లో మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ (ఎం ఆర్ వి) లో నిర్వహిస్తున్నారు. వాహనం పూనే లో కంపెనీ చకన్ కర్మాగారంలో తయారు చేయబడుతుంది. మహీంద్రా సంస్థ ,అది ప్రపంచ ఉత్పత్తి వాహనంగా మరియు దానిలో ఎల్ హెచ్ డి వెర్షన్ కూడా ఉంటుందని, ఇది భారతదేశం నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేయబడతాయని హామీ ఇచ్చింది. 

ఈ టియువి300 ఒక కొత్త ఎమ్ హాక్ 80 డీజిల్ ఇంజన్ చేత శక్తినివ్వబడినది, ఇంజిన్ కి సంబందించిన మిగతా వివరాలు వాహన తయారీదారుడు బయట పెట్టలేదు. ప్లాట్ఫార్మ్ గురించి మాట్లాడుకుంటే, టియువి300 కొత్త ప్లాట్ఫార్మ్ ను కలిగి ఉంది. ఈ వేదిక స్కార్పియో యొక్క కొత్త హైడ్రోఫార్మెడ్ చాసిస్ కి షార్ట్ వెర్షన్ వలే ఉంటుంది. ఎప్పుడైతే, స్కార్పియో విడుదలయ్యిందో అప్పుడే మహింద్రా సంస్థ స్కార్పియో లో ఉపయోగించిన ప్లాట్ఫార్మ్ ని భవిష్యత్తు వాహనాల కొరకు కూడా ఉపయోగిస్తామని తెలిపింది. ఇంకా, ఈ టియువి యొక్క ప్లాట్ఫార్మ్ 4 వీల్ డ్రైవ్ తో సిద్ధంగా ఉంది. కానీ వచ్చే నెల ప్రారంభ సమయంలో, అది 4 వీల్ డ్రైవ్ లక్షణం తో రావడం లేదు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience