Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మహీంద్రా మరాజో వోల్వో లాంటి యాక్టివ్ సేఫ్టీ టెక్నాలజీతో ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శించబడింది

ఫిబ్రవరి 13, 2020 12:52 pm dhruv attri ద్వారా ప్రచురించబడింది
32 Views

మహీంద్రా మరాజో భారతదేశం-స్పెక్ కార్లపై త్వరలో చూడగలిగే యాక్టివ్ భద్రతా లక్షణాల ప్రివ్యూను మనకి ఇచ్చింది

ఎయిర్‌బ్యాగులు వంటి పాసివ్ భద్రతా టెక్నాలజీ గత దశాబ్దంలో భారతదేశంలో విక్రయించే ప్రధాన కార్లకు మాత్రమే ఉంది మరియు ఈ భద్రతను మరింత పెంచడానికి భవిష్యత్ కార్లలో లేన్ కీప్ అసిస్ట్ వంటి యాక్టివ్ సేఫ్టీ ని సహజంగా అమలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు, మహీంద్రా ఎలాంటి లక్షణాలని మరాజో MPV లో ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శించింది, దీనిలో రాహార్ ఆధారిత భద్రతా లక్షణాలను కూడా అమర్చడం జరిగింది.

ఆటో ఎక్స్‌పో 2020 లోని మహీంద్రా మరాజో షో కారులో ఈ క్రింది ఫీచర్లు కలిగి ఉన్నాయి:

  • డ్రౌజీ డ్రైవర్ డిటెక్షన్ సిస్టమ్: డ్రైవర్ గనుక మత్తుగా ఉంటే స్టీరింగ్ కదలికలను పర్యవేక్షించడం ద్వారా విశ్రాంతి తీసుకోమని సలాహా ఇస్తుంది.
  • క్రాస్ ట్రాఫిక్ హెచ్చరిక: దీని ద్వారా డ్రైవర్ కెమెరా రేంజ్ బయట నుండి కారు వచ్చినట్లయితే డ్రైవర్ ని హెచ్చరిస్తుంది.
  • అటెన్షన్ డిటెక్షన్ : డ్రైవర్ గనుక అలర్ట్ గా లేకపోతే, అది గుర్తించి డ్రైవర్ ని హెచ్చరిస్తుంది.
  • బ్లైండ్స్పాట్ డిటెక్షన్: ఇది ఒక సెన్సార్-ఆధారిత పరికరం, ఇది కనిపించని వాహనం మరియు వెనుక వైపున ఉన్న వాహనాలను కనుగొంటుంది.
  • లేన్ కీప్ అసిస్ట్: ఇది ఫార్వర్డ్ ఫేసింగ్ కెమెరాను ఉపయోగించి డ్రైవర్ అనుకోకుండా లేన్ నుండి బయటకు వెళ్ళకుండా నిరోధిస్తుంది.
  • అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్: ఈ రాడార్ ఆధారిత వ్యవస్థ అవసరమైనప్పుడు బ్రేక్‌లను సొంతంగా వర్తింపజేస్తుంది.

మహీంద్రా మరాజో డిసెంబర్ 2018 లో ఫోర్-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, EBD విత్ ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ISOFIX ఎంకరేజెస్, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్ మరియు ఇంజిన్ ఇమ్మొబిలైజర్ ఉన్నాయి. మహీంద్రా ఈ యాక్టివ్ భద్రతా లక్షణాలను జోడించే ముందు, మరాజ్జో సైడ్, కర్టెన్ మరియు మోకాలి ఎయిర్‌బ్యాగులు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు వంటి చిన్న XUV 300 లలో లభించే మెరుగుదలలను చూడాలనుకుంటున్నాము.

ప్రధాన కార్లు పాసివ్ భద్రతా సాంకేతికతతో బాగా అమర్చబడి ఉన్నట్లయితేనే, అప్పుడు మాత్రమే మనం ఈ యాక్టివ్ వాటికి వెళ్ళాలి. వాస్తవానికి, ఈ సాంకేతికతలు ప్రభావవంతంగా ఉండటానికి మార్కెట్ మరియు రహదారి మౌలిక సదుపాయాలు గణనీయమైన స్థాయిలో పరిపక్వత పొందాలి. ప్రస్తుతం పరిస్థితులలో, ప్రీమియం లగ్జరీ బ్రాండ్లలో ఎక్కువ భాగం దేశంలో ప్రస్తుత చట్టం మరియు మౌలిక సదుపాయాల కారణంగా భారతదేశంలో తమ కార్లపై ఈ లక్షణాలను అందించడం మానేస్తున్నాయి.

ఈ భద్రతా సాంకేతిక పరిజ్ఞానాలతో ఇండియా-స్పెక్ మరాజ్జో వస్తుందా, అనే దానిపై మహీంద్రా గట్టిగా పెదవి విప్పింది. ఏదేమైనా, ఈ దశాబ్దం చివరినాటికి ఈ లక్షణాలు మా మాస్-మార్కెట్ రోజువారీ డ్రైవర్లలోకి ప్రవేశిస్తాయని మేము ఆశిస్తున్నాము.

Share via

Write your Comment on Mahindra మారాజ్జో

k
kia
Feb 12, 2020, 5:46:22 AM

nice car...

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.14 - 18.10 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.15 - 8.97 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.26.90 - 29.90 లక్షలు*
Rs.63.91 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర