మహీంద్రా మరాజో వోల్వో లాంటి యాక్టివ్ సేఫ్టీ టెక్నాలజీతో ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శించబడింది
published on ఫిబ్రవరి 13, 2020 12:52 pm by dhruv attri for మహీంద్రా మారాజ్జో
- 31 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మహీంద్రా మరాజో భారతదేశం-స్పెక్ కార్లపై త్వరలో చూడగలిగే యాక్టివ్ భద్రతా లక్షణాల ప్రివ్యూను మనకి ఇచ్చింది
ఎయిర్‌బ్యాగులు వంటి పాసివ్ భద్రతా టెక్నాలజీ గత దశాబ్దంలో భారతదేశంలో విక్రయించే ప్రధాన కార్లకు మాత్రమే ఉంది మరియు ఈ భద్రతను మరింత పెంచడానికి భవిష్యత్ కార్లలో లేన్ కీప్ అసిస్ట్ వంటి యాక్టివ్ సేఫ్టీ ని సహజంగా అమలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు, మహీంద్రా ఎలాంటి లక్షణాలని మరాజో MPV లో ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శించింది, దీనిలో రాహార్ ఆధారిత భద్రతా లక్షణాలను కూడా అమర్చడం జరిగింది.
ఆటో ఎక్స్‌పో 2020 లోని మహీంద్రా మరాజో షో కారులో ఈ క్రింది ఫీచర్లు కలిగి ఉన్నాయి:
- డ్రౌజీ డ్రైవర్ డిటెక్షన్ సిస్టమ్: డ్రైవర్ గనుక మత్తుగా ఉంటే స్టీరింగ్ కదలికలను పర్యవేక్షించడం ద్వారా విశ్రాంతి తీసుకోమని సలాహా ఇస్తుంది.
- క్రాస్ ట్రాఫిక్ హెచ్చరిక: దీని ద్వారా డ్రైవర్ కెమెరా రేంజ్ బయట నుండి కారు వచ్చినట్లయితే డ్రైవర్ ని హెచ్చరిస్తుంది.
- అటెన్షన్ డిటెక్షన్ : డ్రైవర్ గనుక అలర్ట్ గా లేకపోతే, అది గుర్తించి డ్రైవర్ ని హెచ్చరిస్తుంది.
- బ్లైండ్స్పాట్ డిటెక్షన్: ఇది ఒక సెన్సార్-ఆధారిత పరికరం, ఇది కనిపించని వాహనం మరియు వెనుక వైపున ఉన్న వాహనాలను కనుగొంటుంది.
- లేన్ కీప్ అసిస్ట్: ఇది ఫార్వర్డ్ ఫేసింగ్ కెమెరాను ఉపయోగించి డ్రైవర్ అనుకోకుండా లేన్ నుండి బయటకు వెళ్ళకుండా నిరోధిస్తుంది.
- అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్: ఈ రాడార్ ఆధారిత వ్యవస్థ అవసరమైనప్పుడు బ్రేక్‌లను సొంతంగా వర్తింపజేస్తుంది.
మహీంద్రా మరాజో డిసెంబర్ 2018 లో ఫోర్-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, EBD విత్ ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ISOFIX ఎంకరేజెస్, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్ మరియు ఇంజిన్ ఇమ్మొబిలైజర్ ఉన్నాయి. మహీంద్రా ఈ యాక్టివ్ భద్రతా లక్షణాలను జోడించే ముందు, మరాజ్జో సైడ్, కర్టెన్ మరియు మోకాలి ఎయిర్‌బ్యాగులు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు వంటి చిన్న XUV 300 లలో లభించే మెరుగుదలలను చూడాలనుకుంటున్నాము.
ప్రధాన కార్లు పాసివ్ భద్రతా సాంకేతికతతో బాగా అమర్చబడి ఉన్నట్లయితేనే, అప్పుడు మాత్రమే మనం ఈ యాక్టివ్ వాటికి వెళ్ళాలి. వాస్తవానికి, ఈ సాంకేతికతలు ప్రభావవంతంగా ఉండటానికి మార్కెట్ మరియు రహదారి మౌలిక సదుపాయాలు గణనీయమైన స్థాయిలో పరిపక్వత పొందాలి. ప్రస్తుతం పరిస్థితులలో, ప్రీమియం లగ్జరీ బ్రాండ్లలో ఎక్కువ భాగం దేశంలో ప్రస్తుత చట్టం మరియు మౌలిక సదుపాయాల కారణంగా భారతదేశంలో తమ కార్లపై ఈ లక్షణాలను అందించడం మానేస్తున్నాయి.
ఈ భద్రతా సాంకేతిక పరిజ్ఞానాలతో ఇండియా-స్పెక్ మరాజ్జో వస్తుందా, అనే దానిపై మహీంద్రా గట్టిగా పెదవి విప్పింది. ఏదేమైనా, ఈ దశాబ్దం చివరినాటికి ఈ లక్షణాలు మా మాస్-మార్కెట్ రోజువారీ డ్రైవర్లలోకి ప్రవేశిస్తాయని మేము ఆశిస్తున్నాము.
- Renew Mahindra Marazzo Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful