మహీంద్రా KUV100 గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు
డిసెంబర్ 22, 2015 04:45 pm raunak ద్వారా ప్రచురించబడింది
- 18 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారతదేశం యొక్క అతిపెద్ద యుటిలిటీ ఆటోమొబైల్ తయారీదారు,మహీంద్రా అండ్ మహీంద్రా,KUV100 తో నిన్న సూక్ష్మ SUV విభాగంలో నిలిచింది. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇది అధికారికంగా జనవరి 15, 2016 న విడుదల కానుంది!
జైపూర్ :
అందరూ ఎదురుచూస్తున్న మహీంద్రా S101 నిన్న బహిర్గతమైంది. వాహనం అధికారికంగా KUV100 అని నామకరణం చేయనుంది. దీనిని '1 డబుల్ o' అని పిలుస్తారు. కొత్త mFalcon డీజిల్, పెట్రోల్ ఇంజన్లుని మహీంద్ర తన కుటుంబంలో పరిచయం చేసింది. మహీంద్రా KUV100 బుకింగ్స్ ని అంగీకరించడం ప్రారంబించింది. మరియు ఇది జనవరి 15,2016 కంటే ముందే భారత ఆటో ఎక్స్పో లో ప్రారంభించబడుతుంది!.
మెకానికల్స్:
- mFalcon D75 - 1.2 లీటర్ 3-సిలిండర్ టర్బో డీజిల్ 3,750rpm వద్ద 77bhp శక్తిని, మరియు 1,750-2,250rpm మధ్య 190Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.
- mFalcon G80 - 1.2 లీటర్ 3-సిలిండర్ కలిగి ఉంది సహజంగా 5,500 rpm వద్ద 82 bhpల శక్తిని, 3,500 rpm వద్ద 114 Nmల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.
- ట్రాన్స్మిషన్- ప్రారంభ సమయంలో KUV100 5-స్పీడ్ MT మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, మహీంద్రా తరువాత దశలలో ఒక AMTబాక్స్ పరిచయం చేసే అవకాశం ఉంది.
భద్రత:
మహీంద్రా, KUV100తో ABS ప్రామాణిక ఫీచర్ని కలిగి ఉన్న వేరియంట్ ని అందుబాటులోకి తేబోతుంది మరియు దీని బేస్ వేరియంట్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని ఆప్ష్నల్ కుడా కలిగి ఉంటుంది.
ఫీచర్స్ మరియు లోపలి పరికరాలు:మహీంద్రా సంస్థ KUV100 యొక్క లోపలి పరికరాలు , లక్షణాలని బహిర్గతం చేయలేదు. అయితే క్యాబిన్ మాత్రం ఇంతకు ముందు కొన్ని సార్లు రహస్యంగా బహిర్గతం అయింది. వాహనం యొక్క రహస్య చిత్రాలు డీకోడింగ్ చేసిన తరువాత వాహనం 6 సీట్లని కలిగి ఉండి, ముందు మరియు మద్యలో సీట్లు ముడుచుకునేవిగా ఉండి cup-హోల్డర్స్ ని కలిగి ఉంటాయని తెలిసింది. ఆడియో సిస్టమ్ గురించి మాట్లాడితే, యూనిట్ బహుశా TUV3OO లో లాంటి బ్లూటూత్ కనెక్టివిటీ, యు ఎస్ బి , ఆక్స్-ఇన్, మహీంద్రా బ్లూ సెన్స్ ఆప్ ఇంటిగ్రేషన్, Intellipark రివర్స్, వాయిస్ సందేశ సేవ వంటి ఫీచర్స్ ని కలిగి ఉంటుంది.
ధరలు:
ధరలు జనవరి 15, 2016న బహిర్గతం చేయబడుతాయి. అయితే అంచనా ప్రకారం B-సెగ్మెంట్ బ్యాండ్ లు అయినటువంటి హ్యుందాయ్ ఐ 10 గ్రాండ్, 2015 ఫోర్డ్ ఫిగో, మారుతి సుజుకి స్విఫ్ట్ , మరియు ఇతర కార్ల లాగే ఉండవచ్చు. ధర యొక్క పరిది 4-7 లక్షల మధ్య లో ఉండే అవకాశం ఉంది.
ఇది కుడా చదవండి: